EPAPER

5th Phase Elections 2024: రేపే ఐదో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్.. బరిలో ప్రముఖ నేతలు!

5th Phase Elections 2024: రేపే ఐదో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్.. బరిలో ప్రముఖ నేతలు!

5th Phase Lok Sabha Elections 2024: సార్వత్రిక సమరం కీలక దశకు చేరుకుంది. ఐదవ విడత లోక్ సభ ఎన్నికల్లో భాగంగా సోమవారం ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలింగ్ జరగనుంది. మొత్తం 49 లోక్‌సభ స్థానాల్లో 695 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.


ఎన్నికల ప్రచారానికి శనివారం సాయంత్రం తెరపడింది. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, రాజ్ నాథ్ సింగ్, పీయూష్ గోయల్, స్మృతి ఇరానీ, సాధ్వీ నిరంజన్, శంతను ఠాకూర్ తో పాటు పలువురు నేతలు ఎన్నికల్లో తమ అదృష్టాన్నిపరీక్షించుకోనున్నారు. అయితే జమ్మూ కశ్మీర్ బారాముల్లా లోక్ సభ స్థానం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అక్కడ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా సహా 22 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.

పశ్చిమ బెంగాల్‌లోను సోమవారం ఏడు లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ జరగనుంది. కాగా 57% పోలింగ్ కేంద్రాలను సున్నితమైనవిగా వర్గీకరించారు. ఈ నేపథ్యంలోనే ఘర్షణలు నివారించేందుకు ఈసీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. మరోవైపు ఒడిశాలో సోమవారం 35 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇక్కడ కూడా శనివారం ప్రచారం ముగిసింది.


Also Read: భావోద్వేగానికి గురైన రాహుల్ గాంధీ

దేశ వ్యాప్తంగా 49 లోక్ సభ స్థానాల్లో సోమవారం ఎన్నికలు జగనుండగా ఐదో దశ పోలింగ్ లో భాగంగా యూపీలో 14, మహారాష్ట్ర 13, బెంగాల్ 7, బీహార్ 5, ఒడిశా 5, జార్ఖండ్ 3, జమ్మూ కశ్మీర్, లడక్ లో ఒక్కో స్థానంలో పోలింగ్ జరగనుంది. ఇప్పటికే సగానికి పైగా లోక్ సభ స్థానాల్లో పోలింగ్ జరగగా..ఉత్తర ప్రదేశ్, బీహార్ లో బీజేపీ, ఇండియా కూటమికి మధ్య టఫ్ పైట్ ఉంది.

ఈ లోక్ సభ ఎన్నికల్లో ప్రత్యేకంగా రెండు నియోజక వర్గాలపైనే అందరి దృష్టి ఉంది. కాంగ్రెస్ కంచుకోట రాయ్ బరేలీ, అమేథీలో ఆసక్తికర పోరు నెలకొంది. రాయ్ బరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. అమేథీలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ పోటీ చేస్తుండగా కాంగ్రెస్ అభ్యర్థిగా కేఎల్ శర్మ బరిలో నిలిచారు. కాంగ్రెస్ తరపున ప్రియాంక గాంధీ, అమేథీతో పాటు రాహుల్ పోటీ చేస్తున్న రాయ్ బరేలీలో విసృత ప్రచారం నిర్వహించారు. బీజేపీ కూడా అదే స్థాయిలో ప్రచారం చేసింది. ఇరానీకి మద్దతుగా కేంద్ర మంత్రి అమిత్ షా అమేథీలో ప్రచారం నిర్వహించారు.

Related News

Himanta Biswa Sarma: దీదీజీ.. పైలే బెంగాల్ వరదలు దేఖో.. ఉస్కే‌బాద్ ఝార్ఖండ్ గురించి బాత్‌కరో : సీఎం

Odisha Army Officer: ‘ఫిర్యాదు చేయడానికి వెళ్తే నా బట్టలు విప్పి కొట్టారు.. ఆ పోలీస్ తన ప్యాంటు విప్పి అసభ్యంగా’.. మహిళ ఫిర్యాదు

Tirumala Laddu Controversy: తిరుమల లడ్డూ వివాదం.. సుప్రీంకోర్టులో జర్నలిస్ట్ పిటిషన్

Tirumala Laddu Controversy: తిరుమల లడ్డు వ్యవహారం.. జగన్‌పై కేంద్ర మంత్రుల సంచలన వ్యాఖ్యలు

Star Health Data: స్టార్ హెల్త్ కస్టమర్లకు షాక్.. డేటా మొత్తం ఆ యాప్ లో అమ్మకానికి ?

Jammu Kashmir Elections: జమ్ము ఎన్నికల వేళ.. పాక్ మంత్రి కీలక వ్యాఖ్యలు

Cash for Vote Scam: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

Big Stories

×