EPAPER

Rahul Gandhi gets Emotional: భావోద్వేగానికి గురైన రాహుల్ గాంధీ

Rahul Gandhi gets Emotional: భావోద్వేగానికి గురైన రాహుల్ గాంధీ

Have an Emotional connect with Raebareli: పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బిజీ బిజీగా ఉన్నారు. దేశవ్యాప్తంగా పర్యటిస్తూ తమ పార్టీ, ఇండియా కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ఆయన తీవ్రంగా కృషి చేస్తున్నారు. బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఇటు రాహుల్ గాంధీతోపాటు ప్రియాంకా గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలు కూడా తీవ్రంగా కృషి చేస్తున్నారు.


ఇప్పటికే పలు దఫాలుగా పార్లమెంటు ఎన్నికలు ముగిశాయి. అయితే, కాంగ్రెస్ కు కంచుకోట అయినటువంటి రాయ్ బరేలీ పార్లమెంటు నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంతో తన కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. తాను, తన సోదరికి ఆ ప్రాంతంతో ఉన్న చిన్ననాటి జ్ఞాపకాలను సోషల్ మీడియాలో ఆయన గుర్తు చేసుకున్నారు.

రాహుల్ గాంధీ తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. అందులో ఓ వీడియోను షేర్ చేశారు. పలు విషయాలను కూడా ఆయన అందులో ప్రస్తావించారు. తన కుటుంబ సభ్యులు రాయబరేలీ ప్రాంతంపై ఎంత ప్రాధాన్యత ఇస్తారనే విషయాన్ని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా రాయ్ బరేలీలో తను చిన్నప్పుడు గడిపిన రోజులను గుర్తు చేసుకున్నారు. ఆ రోజులు ఇప్పుడు కూడా తన కళ్లముందే ఉన్నట్లు అనిపిస్తుందని ఆయన భావోద్వేగానికి గురయ్యారు.


‘గతంలో దేశానికి రాయ్ బరేలీ ప్రాంతం పురోగతి, అభివృద్ధి చూపింది. స్వాతంత్ర్య పోరాటంలోనూ ఈ ప్రాంతమే దేశానికి మార్గనిర్దేశం చేసింది. ఇప్పటివరకు దేశం సాధించిన పురోగతిలో రాయ్ బరేలీది ముఖ్యపాత్ర. అయితే, దేశానికి మరోసారి పురోగతి, అభివృద్ధి గమనాన్ని చూపించాల్సిన సమయం ఆసన్నమైంది. నా కుటుంబాన్ని ఎలా గౌరవిస్తానో.. అదేవిధంగా దేశ కుటుంబ సభ్యులను గౌరవిస్తాను’ అంటూ అందులో రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

అదేవిధంగా రాయ్ బరేలీ ప్రాంతంలో తాను చిన్నప్పుడు గడిపిన రోజులను గుర్తు చేసుకున్నారు. ‘రాయ్ బరేలీ వెళ్లిన ప్రతిసారి కూడా నేను, నా సోదరి ప్రియాంక చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటాం. నానమ్మ జ్ఞాపకాలను కూడా గుర్తు చేసుకుంటాం. నాన్నకు ఇష్టమైనటువంటి జిలేబీల గురించి కూడా గుర్తు చేసుకుంటాం. అదేవిధంగా ప్రియాంక చేసినటువంటి కేక్ లు కూడా గుర్తొస్తుంటాయి. అప్పుటి మధురమైన క్షణాలు ఇప్పటికీ కళ్ల ముందు కనిపిస్తుంటాయి. ఇవన్నీ కూడా నిన్నమొన్న జరిగినట్టే అనిపిస్తుంది. మాకు చిన్నప్పటి నుంచి రాజకీయాలతో అనుబంధం ఉన్నప్పటికీ కూడా ఏరోజు కూడా మా మధ్య రాజకీయాలకు చోటివ్వలేదు’ అంటూ ఆయన తన బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు.

Also Read: పెళ్లి సంబరంలో తల్లిదండ్రులు నిర్లక్షత.. ప్రాణం విడిచిన మూడేళ్ల కూతురు

అదేవిధంగా మరో విషయాన్ని ప్రస్తావిస్తూ పలువురు నాయకులకు ఆయన సూచనలు చేశారు. కుటుంబ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కుటుంబాన్ని గౌరవించాలని పేర్కొన్నారు. లేకపోతే మీరు భవిష్యత్తులో ఇబ్బందులు పడుతారన్నారు. మీరు రాజకీయాలలో కొనసాగుతున్న సమయంలో మీ కుటంబాలకు గౌరవం ఇవ్వాలి.. ఒకవేళ మీరు గౌరవం ఇవ్వకపోతే.. బయట కూడా మీరు సత్సంబంధాలు కొనసాగించడం కష్టం అంటూ బీజేపీ అగ్రనేతలపై రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags

Related News

Himanta Biswa Sarma: దీదీజీ.. పైలే బెంగాల్ వరదలు దేఖో.. ఉస్కే‌బాద్ ఝార్ఖండ్ గురించి బాత్‌కరో : సీఎం

Odisha Army Officer: ‘ఫిర్యాదు చేయడానికి వెళ్తే నా బట్టలు విప్పి కొట్టారు.. ఆ పోలీస్ తన ప్యాంటు విప్పి అసభ్యంగా’.. మహిళ ఫిర్యాదు

Tirumala Laddu Controversy: తిరుమల లడ్డూ వివాదం.. సుప్రీంకోర్టులో జర్నలిస్ట్ పిటిషన్

Tirumala Laddu Controversy: తిరుమల లడ్డు వ్యవహారం.. జగన్‌పై కేంద్ర మంత్రుల సంచలన వ్యాఖ్యలు

Star Health Data: స్టార్ హెల్త్ కస్టమర్లకు షాక్.. డేటా మొత్తం ఆ యాప్ లో అమ్మకానికి ?

Jammu Kashmir Elections: జమ్ము ఎన్నికల వేళ.. పాక్ మంత్రి కీలక వ్యాఖ్యలు

Cash for Vote Scam: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

Big Stories

×