EPAPER

Hyper Pigmentation: పిగ్మెంటేషన్ తో ఇబ్బంది పడుతున్నారా? ఈ చిట్కాలు మీ కోసమే..

Hyper Pigmentation: పిగ్మెంటేషన్ తో ఇబ్బంది పడుతున్నారా?  ఈ చిట్కాలు మీ కోసమే..

Natural Tips To Remove Pigmentation: చాలా మంది ఎదుర్కుంటున్న సమస్యల్లో హైపర్ పిగ్మెంటేషన్ ఒకటి. ముఖంపై నల్ల మచ్చలు ఎక్కువగా రావడాన్ని హైపర్ పిగ్మెంటేషన్ అంటారు. ముఖంపై నల్ల మచ్చలు రావడానికి అనేక కారణాలు ఉంటాయి. శరీరంలో మెలనిన్ అధికంగా ఉత్పత్తి అవడం వల్ల హైపర్ పిగ్మెంటేషన్ వస్తుంది. అంతే కాకుండా ఎండలో ఎక్కువగా తిరిగినా, సరైన ఆహారం తీసుకోకపోవడం, హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్ , మెడిసిన్ ఎక్కువగా వాడడం వల్ల ముఖంపై నల్ల మచ్చలు వస్తాయి.


నల్ల మచ్చల సమస్య నుంచి బయట పడేందుకు చాలా మంది మార్కెట్లో దొరికే అనేక రకాల కాస్మటిక్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. కానీ వాటి కంటే నేచురల్ ప్రొడక్ట్స్ వాడటం మంచింది. మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే నాచురల్ రెమెడీస్ వల్ల శరీరానికి ఎలాంటి హాని ఉండదు. అంతే కాకుండా ఇవి ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. వీటిని వాడడం వల్ల నల్లమచ్చలు పోవడమే కాకుండా చర్మం రంగు కూడా పెరుగుతుంది.

పసుపు:


ఆరోగ్యానికి పసుపు చాలా మేలు చేస్తుంది. అంతే కాకుండా అందానికి ఉపయోగపడుతుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి చర్మానికి ఎంతగానో మేలు చేస్తాయి. శనగపిండిలో కొద్దిగా రోజ్ వాటర్ తీసుకొని అందులో పసుపు వేసి దీనిని ఒక మిశ్రమంలాగా తయారు చేయాలి. తర్వాత దీనిని ఫేస్ ప్యాక్ లాగా వేసుకని కాసేపు ఉంచుకుని ఆ తర్వాత కడిగేస్తే డార్క్ స్పాట్స్ తగ్గుతాయి.

అలోవెరా :

అందానికి ఆరోగ్యానికి అలోవెరా ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని ద్వారా జుట్టుకు సంబంధించిన సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. అలోవెరా డార్క్ స్పాట్ తగ్గడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలోవెరా గుజ్జును ముఖంపై ఎక్కడైతే నల్ల మచ్చలు ఉంటాయో అక్కడ రాయాలి. దీనిని రాత్రి రాసి ఉదయాన్నే కడిగేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇది చాలా చక్కగా పనిచేస్తుంది.

పాలు, పాల పదార్థాలు :
పాలు, పెరుగు పిగ్మెంటేషన్ సమస్య ఉన్నవారికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇవి స్కిన్ కు మాయిశ్చరైజర్ లాగా పని చేస్తాయి. వీటిని ముఖంపై ఉపయోగించడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది. పిగ్మెంటేషన్ సమస్య నుంచి ఇవి దూరం చేస్తాయి.

పాలు లేదా పెరుగును తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ శనగపిండి, కాస్త పసుపు వేసుకోవాలి. వీటిని పేస్ట్ లాగా చేసుకొని ముఖానికి అప్లై చేయాలి. ఆరిన తర్వాత కడిగేస్తే మార్పు కనిపిస్తుంది. పాలు, పెరుగు హైపర్ పింగ్మెటేషన్ సమస్య నుంచి బయటపడేందుకు ఉపయోగపడతాయి.

సిట్రస్ ఫ్రూట్స్:

నిమ్మ ,ద్రాక్ష, నారింజ వంటి పండ్లలో అధికంగా విటమిన్ సి ఉంటుంది. అయితే ఇవి నాచురల్ బ్లీచింగ్ ఎజెంట్ గా పనిచేస్తాయి. డార్క్ స్పాట్ మరియు పిగ్మెంటేషన్ సమస్యలను ఇవి తొలగిస్తాయి. కానీ నిమ్మ లేదా ఇతర సిట్రస్ ఫ్రూట్స్ డైరెక్ట్ గా ముఖానికి రాయకూడదు. ఉదాహరణకు నిమ్మ రసంలో కాస్త తేనె కలిపి ముఖంపై అప్లై చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత కడిగివేయాలి. చల్లటి నీటితో ముఖాన్ని కడగడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. హైపర్ పిగ్మెంటేషన్ సమస్యతో ఇబ్బంది పడేవారు ఈ చిట్కాను ఫాలో అయ్యి మంచి మార్పును చూడవచ్చు.

Also Read: అధిక రక్తపోటుకు సంబంధించి మీరు ఈ 7 విషయాలు తెలుసుకోవాలి..

బంగాళదుంప:

అందానికి బంగాళ దుంప ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది చర్మానికి నేచురల్ బ్లీచ్ లాగా పని చేస్తుంది. స్కిన్ టాన్ అయినప్పుడు ముఖంపై బంగాళదుంప జ్యూస్ అప్లై చేస్తే మర్పును గమనించవచ్చు. కేవలం 15 నుంచి 20 నిమిషాల పాటు సమస్య ఉన్న ప్రదేశంలో బంగాళదుంపలోని చిన్న ముక్కను తీసుకొని రాయాలి. ఇలా తరుచూ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ చిట్కాలు పాటించడం వల్ల చర్మ సమస్యలు ఉండవు. అంతే కాకుండా మరింత అందంగా కనిపిస్తారు.

Disclaimer : ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటర్నెట్ ద్వారా సేకరించబడినది. bigtvlive.com దీన్ని ధృవీకరించడం లేదు.

 

Related News

Back Pain Relief Tips: నడుము నొప్పిని తగ్గించే టిప్స్ !

Homemade Face Mask: వీటితో 5 నిమిషాల్లోనే అదిరిపోయే అందం !

Dandruff Home Remedies: ఇంట్లోనే చుండ్రు తగ్గించుకోండిలా ?

Causes Of Pimples: మొటిమలు రావడానికి కారణాలు ఇవే !

Health Tips: నెయ్యి ఎవరు తినకూడదో తెలుసా ?

Benefits Of Pomegranate Flowers: ఈ పువ్వు ఆరోగ్యానికి దివ్యౌషధం.. దీని చూర్ణం తేనెతో కలిపి తీసుకుంటే ఆ సమస్యలన్నీ మాయం

Unwanted Hair Tips: అవాంఛిత రోమాలతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఇలా చెక్ పెట్టండి..

Big Stories

×