EPAPER

Saeed Anwar Comments on Pak Divorce: పాక్‌లో విడాకులు ఎందుకు పెరిగాయో తెలుసా..? మాజీ కెప్టెన్ అన్వర్ కామెంట్స్

Saeed Anwar Comments on Pak Divorce: పాక్‌లో విడాకులు ఎందుకు పెరిగాయో తెలుసా..? మాజీ కెప్టెన్ అన్వర్ కామెంట్స్

Pakistan Ex-Cricketer Saeed Anwar Sensational Comments Pak Divorce: ఒకప్పటి పాకిస్తాన్ ఓపెనర్, కెప్టెన్ సయీద్ అన్వర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీంతో నెట్టింట అందరూ అతనిపై భగ్గుమంటున్నారు. ఇంతెత్తున లేస్తున్నారు. ఇంతకీ తనేమన్నాడంటే, కుదురుగా ఉండకుండా మహిళలపైకి వెళ్లాడు. పాకిస్తాన్‌‌‌లో గతం కన్నా 30 శాతం విడాకులు పెరిగాయి. దీనికి కారణం ఆడవాళ్లు ఉద్యోగం చేయడమేనని సూత్రీకరించాడు.


పాతకాలంనాటి భావజాలం, మూర్ఖత్వంతో నిండిపోయిన సయిద్ అన్వర్ ప్రపంచ దేశాలన్నీ తిరిగి క్రికెట్ ఆడాడని చెప్పడానికే సిగ్గుగా ఉందని పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఇన్ని దేశాలు తిరిగి, అంత అభ్యున్నతిని చూసి, అక్కడ వారు మహిళలకు ఉద్యోగాల్లో ఇచ్చే గౌరవాన్ని చూసి ఇవేం మాటలని మండిపడుతున్నారు. ఇంత క్రికెట్ ఆడి, నువ్వు నేర్చుకున్నది ఇదేనా? అని సీరియస్ అవుతున్నారు. పదిమందికి చెప్పాల్సిన నువ్వే, ఇలా మాట్లాడితే ఎలా? అని తిట్టిపోస్తున్నారు.

ఇంతకీ తనేం అంటాడంటే, ఉద్యోగాలు చేసే మహిళలు, మేమూ సంపాదిస్తున్నాం, ఇంతకు ముందు నువ్వు తెచ్చేవోడివి, మేం చచ్చినట్టు ఉండాల్సి వచ్చేది, ఇప్పుడు ఆ అవసరం లేదని అంటున్నారు. నిర్మోహమాటంగా విడాకులు తీసుకుంటున్నారని తెలిపాడు. వారికి సరైన గైడెన్స్ లేదని అభిప్రాయపడ్డాడు.


Also Read: Mob Violence in Kyrgyzstan : కిర్గిస్థాన్‌లో అల్లర్లు.. మన విద్యార్థులకు ఇండియన్ ఎంబసీ హెచ్చరిక

అంతేకాదు, తను అన్నదే కాక మరో ఇద్దరిని ఇందులోకి లాగాడు. వారెవరో కాదు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, ఆస్ట్రేలియా మేయర్ ఇద్దరూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని అన్నాడు. నువ్వు బురదలోకి దిగడమేకాదు, వారినెందుకు అందులోకి లాగావు.. అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇప్పుడు వారి పరిస్థితేమిటో? అని మరికొందరు సరదాగా వ్యాక్యానిస్తున్నారు.

ఇదిక్కడితో ఆగేలా లేదు. పాకిస్తాన్ లో ఇప్పుడిప్పుడే మహిళలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఉద్యోగాలు చేసి కుటుంబాలకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు. తమ పిల్లల్ని ఉన్నతంగా చదివిస్తున్నారు.

Also Read:  టీమిండియా ప్రధాన కోచ్ రేసులో.. ఎవరున్నారు?

పేదరికం నుంచి బయటపడి, మధ్యతరగతి జీవనంలోకి అడుగుపెడుతున్నారు. ఇంకెంత కాలం ఇలా మగ్గిపోవాలి అని మహిళా సంఘాలు అప్పుడే అన్వర్ పై విరుచుకుపడుతున్నాయి. అల్లా అందరినీ ఒకేలా స్రష్టించాడు. మహిళలకెందుకు ఈ సంకెళ్లు అని కొటేషన్లతో రెచ్చిపోతున్నారు.

Tags

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×