EPAPER

IPL 2024 Playoffs Schedule: ఐపీఎల్ 2024 ప్లే ఆఫ్ మ్యాచ్‌లు.. ఎక్కడెక్కడంటే?

IPL 2024 Playoffs Schedule: ఐపీఎల్ 2024 ప్లే ఆఫ్ మ్యాచ్‌లు.. ఎక్కడెక్కడంటే?

IPL 2024 Playoffs Schedule: ఐపీఎల్ 2024 సీజన్ చివరి అంకానికి వచ్చేసింది. ఇప్పటికే ప్లే ఆఫ్ లోకి మూడు జట్లు వచ్చేశాయి. కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ బెర్త్ లు కన్ఫర్మ్ అయ్యాయి. ఆఖరి బెర్తును శనివారం జరగనున్న ఆర్సీబీ వర్సెస్ చెన్నై మధ్య మ్యాచ్ డిసైడ్ చేస్తుంది.


ఇప్పుడు అందరి దృష్టి ఈ మ్యాచ్ పైనే ఉంది. ఆర్సీబీ గెలిచినా రన్ రేట్ పై గెలిస్తేనే ఫైనల్ కి చేరుతుంది. లేదంటే 5వ స్థానంలో ఉండిపోతుంది. ఒకవేళ చెన్నై ఓడినా, ఆర్సీబీ రన్ రేట్ సాధించకపోతే 14 పాయింట్లతో తను ప్లే ఆఫ్ కి చేరుతుంది. ఈలోపు వరుణుడి గొడవ లేకపోతే మ్యాచ్ మాత్రం హోరా హోరీగా జరిగే అవకాశాలున్నాయని అంటున్నారు. వర్షం పడి మ్యాచ్ రద్దయితే చెరొక పాయింట్ తో చెన్నై హ్యాపీగా ప్లే ఆఫ్ రౌండ్ కి చేరిపోతుంది.

ప్లేఆఫ్ దశలో నాలుగు మ్యాచ్ లు జరుగుతాయి. – క్వాలిఫైయర్ 1, క్వాలిఫైయర్ 2, ఎలిమినేటర్, ఇంకా ఆఖరిగా ఫైనల్ మ్యాచ్..


Also Read: ఆర్సీబీకి సవాల్ : 18 పరుగులు.. లేదా 18.1 ఓవర్ లో గెలవాలి

మొదటి రెండు స్థానాల్లో ఉన్న జట్ల మధ్య జరిగే క్వాలిఫైయర్ 1 మ్యాచ్ మంగళవారం, మే 21న, అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతుంది.

ఇక్కడ ఎవరు గెలిస్తే వారు డైరక్టుగా ఫైనల్ కి చేరిపోతారు. అది ఆదివారం మే 26న చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరగనుంది.

క్వాలిఫైయర్ 1లో ఓడినవారికి మరొక అవకాశం ఉంటుంది. అది ఎలాగంటే, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న జట్లు ఎలిమినేటర్‌లో ఆడతాయి. అది బుధవారం మే 22న అహ్మదాబాద్ లోని చిదంబరం స్టేడియంలో జరుగుతుంది.

Also Read: RCB vs CSK Match Preview : ఆర్సీబీ వర్సెస్ చెన్నై.. ఉండేదెవరు ? వెళ్లేదెవరు ?

చివరికి ఎలిమినేటర్ లో గెలిచిన జట్టు, క్వాలిఫైయర్ 1లో ఓడిన జట్టు కలిసి క్వాలిఫైయర్ మ్యాచ్ ఆడతాయి. ఇది మే 24న చెన్నై‌లో జరుగుతుంది.

ఇంకా ఆఖరుగా క్వాలిఫైయర్ 1, క్వాలిఫైయర్ 2 విజేతలు కలిసి ఫైనల్ మ్యాచ్ చెన్నై వేదికగా ఆదివారం మే 26న జరగనుంది.

Tags

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×