EPAPER

Upcoming Week Launching Mobiles: వచ్చే వారం లాంచ్ అయ్యే కిల్లర్ మొబైల్స్ ఇవే.. ఏ బ్రాండ్ ఫోన్ తీసుకోవాలంటే?

Upcoming Week Launching Mobiles: వచ్చే వారం లాంచ్ అయ్యే కిల్లర్ మొబైల్స్ ఇవే.. ఏ బ్రాండ్ ఫోన్ తీసుకోవాలంటే?

Next Week Launching Mobiles: దేశంలో స్మార్ట్‌ఫోన్ల మార్కెట్ దూసుకుపోతుంది. కొత్త కొత్త టెక్నాలజీతో టెక్ కంపెనీలు ఫోన్లను తీసుకొస్తున్నాయి. మొబైల్ ప్రియుల అభిరుచులకు అనుగుణంగా ఫోన్లను విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలోనే వచ్చే వారంలో నాలుగు సంస్థలు ఈవెంట్లు నిర్వహిస్తున్నాయి. చైనాలో రెండు ఈవెంట్లు జరగనున్నాయి. మిగిలిన రెండు ఈవెంట్‌లలో ఒకటి భారతదేశంలో మరొకటి ప్రపంచంలోని అనేక దేశాలలో నిర్వహిస్తారు. ఈ ఈవెంట్‌లలో సరికొత్త ఫోన్‌లను, లెటెస్ట్ ఫీచర్లతో చూడొచ్చు. చైనాలో మార్కెట్‌లో iQOO, Oppo సబ్‌బ్రాండ్ నియో, రెనో సిరీస్‌ల కొత్త ఫోన్లు చూడొచ్చు. పోకో తన ఎఫ్ సిరీస్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ కోసం గ్లోబల్ ఈవెంట్‌ను నిర్వహిస్తుంది. చివరగా Realme చాలా కాలం తర్వాత భారతదేశంలో తన కొత్త GT ఫోన్‌ను కూడా లాంచ్ చేస్తుంది.


Poco F6 Series
పోకో తన కొత్త F సిరీస్ ఫోన్‌లను మే 23న విడుదల చేస్తోంది. లాంచ్ ఈవెంట్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ సిరీస్‌లో రెండు ఫోన్‌లు ఉంటాయి. Poco F6, Poco F6 Pro. సమాచారం ప్రకారం Poco F6 Qualcomm Snapdragon 8s Gen 3 చిప్‌సెట్, 6.67-అంగుళాల 1.5K 120Hz OLED డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఇందులో 50MP Sony LYT-600 కెమెరా, 5000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్‌ని కలిగి ఉంటుంది. Poco F6 Proలో Qualcomm Snapdragon 8 Gen 2 చిప్, 6.67 అంగుళాల QHD+ OLED డిస్‌ప్లే, 50MP బ్యాక్ కెమెరా, 5,000mAh బ్యాటరీ మరియు 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది.

Also Read: 10 వేల లోపే బ్రాండెడ్ 5G స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు చూస్తే షాకవుతారు!


Realme GT 6T
రియల్‌మీ GT 6T ఫోన్ మే 22న భారతదేశంలో లాంచ్ కానుంది. సంస్థ మధ్యాహ్నం 12 గంటలకు ఈవెంట్‌ను నిర్వహించనుంది. సమాచారం ప్రకారం ఈ ఫోన్‌లో Qualcomm Snapdragon 7 Plus Gen 3 చిప్‌సెట్, 6.78 అంగుళాల 1.5K 120Hz LTPO OLED డిస్‌ప్లే, 50MP Sony IMX882 కెమెరా, 5,500mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్నాయి. భారతదేశంలో ఈ ఫోన్ ధర సుమారు రూ. 30,000 ఉండే అవకాశం ఉంది.

iQOO Neo 9s Pro
iQOO Neo 9s Pro మే 20న లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ గురించిన దాదాపు మొత్తం సమాచారం కంపెనీ వెల్లడించింది. ఈ ఫోన్ ప్రత్యేకత ఏమిటంటే దాని MediaTek Dimensity 9300 Plus చిప్‌సెట్. అదనంగా ఇది 6.78-అంగుళాల 1.5K OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. HDR10+కి కూడా సపోర్ట్ ఇస్తుంది. ఇది కాకుండా ఈ ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ 50MP మెయిన్ కెమెరా + 50MP అల్ట్రావైడ్ కెమెరా, 16MP సెల్ఫీ కెమెరా, 5160mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్, ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నాయి.

Also Read: మోడ్రన్ డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీతో సామ్‌సంగ్ నుంచి చీపెస్ట్ ఫోన్..!

Oppo Reno 12 Series
Oppo తన కొత్త రెనో 12 సిరీస్‌ను మే 23న చైనాలో విడుదల చేయబోతోంది. ఈ సమావేశం సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ సిరీస్‌లో రెండు ఫోన్‌లు ఉంటాయి. Oppo Reno 12, Oppo Reno 12 Pro. మొదటి ఫోన్‌లో MediaTek Dimensity 8250 చిప్‌సెట్ ఉంటుంది. రెండవ ఫోన్‌లో MediaTek Dimensity 9200 Plus చిప్‌సెట్ ఉంటుంది. రెనో 12లో 6.7-అంగుళాల FHD+ 120Hz OLED డిస్‌ప్లే, ట్రిపుల్ కెమెరాలు 50MP మెయిన్ + 8MP అల్ట్రావైడ్ + 50MP టెలిఫోటో, 50MP ఫ్రంట్ కెమెరా, 5000mAh బ్యాటరీ ఉంటాయి.

Related News

Moto G85 5G: మరో రెండు కొత్త కలర్‌ వేరియంట్‌లలో మోటో ఫోన్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

iQoo Z9 Turbo+: అ అ అదుర్స్.. 6400 mAh బ్యాటరీతో ఐక్యూ కొత్త ఫోన్, ఫీచర్లు పిచ్చెక్కించాయ్ బాబోయ్!

Honor 200 Lite 5G: హమ్మయ్య వచ్చేసింది.. AI ఫీచర్లు, 108MP కెమెరాతో కొత్త ఫోన్ లాంచ్, ధర చాలా తక్కువ!

Vivo V40e: ఊహించలేదు భయ్యా.. వివో నుంచి కొత్త ఫోన్, కీలక ఫీచర్లు వెల్లడి!

Inactive Gmail Accounts shutdown: సెప్టెంబర్ 20 నుంచి జిమెయిల్ అకౌంట్లు బంద్.. మీ అకౌంట్‌ని కాపాడుకోండిలా..

Samsung Galaxy M55s 5G: మరో చీపెస్ట్ ఫోన్.. ఈ టెక్నాలజీ అదిరిపోయింది, 50MP ఫ్రంట్ కెమెరా కూడా!

Flipkart Big Billion Days Sale 2024: కొత్త సేల్.. రూ.80,000 ధరగల ఫోన్ కేవలం రూ.30,000 లోపే, డోంట్ మిస్!

Big Stories

×