EPAPER

Three Indians killed in America: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు భారతీయులు మృతి.. ఓ తెలుగు అమ్మాయి..

Three Indians killed in America: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు భారతీయులు మృతి.. ఓ తెలుగు అమ్మాయి..

Three Indian killed in Road Accident in America: అమెరికాలో రోడ్డు ప్రమాదాలు బెంబేలెత్తుతున్నాయి. ఈ తరహా ప్రమాదాల బారినపడి చాలామంది చనిపోయారు.. చనిపోతున్నారు కూడా. ముఖ్యంగా భారతీయులు అందులోని తెలుగువారూ ఉన్నారు.


తాజాగా జార్జియాలోని ఆల్పారెట్టా ప్రాంతంలో జరిగిన కారు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి చెందారు. వారిలో ఓ తెలుగు అమ్మాయి కూడా ఉంది. మృతులు ఆర్యన్‌జోషి, శ్రియా అవసరాల, అన్వీశర్మగా గుర్తించారు. మరో ఇద్దరు గాయాలతో బయటపడ్డారు. మృతుల వయస్సు 18 ఏళ్లు.

అసలేం జరిగిందంటే.. ఐదుగురు విద్యార్థులు ఆర్యన్, శ్రియ, అన్వీశర్మ, రిత్వాక్, లియాకత్‌లు కారులో బయటకు వెళ్లారు. తిరిగి వస్తున్న క్రమంలో ఆల్పారెట్టా ప్రాంతానికి దగ్గరగా వచ్చారు. మాక్స్‌వెల్ రోడ్డు సమీపంలోకి రాగానే విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పింది. పల్టీలు కొట్టి పక్కనేవున్న చెట్టును బలంగా ఢీ కొట్టింది. స్పాట్‌లో ముగ్గురు మృతి చెందారు. వారిలో ఆర్యన్ జోషి, శ్రియ అవసరాల, అన్వీశర్మ ఉన్నారు. హైస్కూల్‌లో సీనియర్ అయిన ఆర్యన్ జోషి, త్వరలో గ్రాడ్యుయేషన్‌లోకి అడుగు పెట్టబోతున్నాడు. ఘటన విషయం స్కూల్ ప్రిన్సిపల్ ఆర్యన్‌జోషి పేరెంట్స్‌కు సమాచారం ఇచ్చారు.


Also Read: భారత్ చంద్రుడిపైకి వెళ్లి చరిత్ర సృష్టిస్తే, మనం మాత్రం.. పాక్ నేత స్పీచ్ వైరల్

తెలుగమ్మాయి శ్రీయ అవసరాలతోపాటు అన్వీశర్మ జార్జియా యూనివర్సిటీలో ఇద్దరు మొదటి సంవత్సరం పూర్తి చేశారు. మరో ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. వెంటనే వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు కోలుకుంటున్నారు. గాయపడినవారిలో కారు డ్రైవ్ చేస్తున్న రిత్వాక్ సోమేపల్లి జార్జియా యూనివర్సిటీలో విద్యార్థి, మరొకరు మహమ్మద్ లియాకత్ అల్పారెట్టా హై‌స్కూల్‌లో సీనియర్ విద్యార్థి.

ఘటన విషయం తెలియగానే తోటి స్టూడెంట్స్ షాకయ్యారు. వాళ్లతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుని బాధపడ్డారు. ఈ ఘటనపై జార్జియా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ఓ అంచనాకు వచ్చారు.

Also Read: UAE Blue Residency Visa: బంపరాఫర్.. ఇలా చేసినవారికి.. దుబాయ్‌లో 10 ఏళ్లు ఉండే ఛాన్స్!

Tags

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×