EPAPER

Akhila Priya Comments on Allagadda: అఖిలప్రియ కామెంట్స్, అంత ఈజీ కాదంటూ..

Akhila Priya Comments on Allagadda: అఖిలప్రియ కామెంట్స్, అంత ఈజీ కాదంటూ..

Akhila Priya Comments on Allagadda Politics: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిసినా ఆ వేడి ఇంకా కంటిన్యూ అవుతోంది. కీలకమైన నియోజకవర్గాల్లో ఎటు చూసినా పార్టీల నేతలు, కార్యకర్తల దాడులు ఏమాత్రం తగ్గలేదు. పరిస్థితి గమనించిన ఎన్నికల సంఘం పోలీసు అధికారులకు కీలక సూచనలు చేసింది. అయితే ఉమ్మడి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బాడీగార్డుపై దాడి జరిగింది. దీని వెనుక ఏవీ సుబ్బారెడ్డి ఉన్నారన్నది నిందితుడి ప్రధాన ఆరోపణ.


తాజాగా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే కావాలనుకోవడం అంత ఈజీ కాదన్నారు. ఏవీ సుబ్బారెడ్డి మా నాన్న ఆత్మకాదని, ప్రేతాత్మగా వర్ణించారు. ఆయనకు మాకు ఎలాంటి విభేదాలు లేవని, కేవలం రాజకీయపరంగా ఆళ్లగడ్డకు ఆయనకు సూటుకాదన్నారు. ప్రజలు కూడా ఆయన్ని అంగీకరించరని మనసులోని మాట బయటపెట్టారు. ఆ ప్రాంతంలో చాలామందిని ఇబ్బందిపెట్టారని గుర్తుచేశారు.

భూమా నాగిరెడ్డి చనిపోయిన తర్వాత ఆళ్లగడ్డకు ఆయన దూరంగా ఉన్నారన్నారు అఖిలప్రియ. అలా అయితేనే ఆయనకు గౌరవం ఉంటుందని చెప్పుకొచ్చారు. మీడియాలో కాంట్రవర్సీ కోసం ఆయన తాపత్రయం పడుతున్నారన్నారు. తన సబ్జెక్ట్ కాకుండా అరగంట పాటు ప్రెస్‌మీట్ పెడితే అప్పుడు తెలుస్తుందన్నారు.


Also Read: మంత్రి గుడివాడ కామెంట్స్… మేమే కింగ్ మేకర్, కాకపోతే..

ఏవీ సుబ్బారెడ్డికి తమ నుంచి ముప్పులేదని, ఆళ్లగడ్డ ప్రజల నుంచి ఉందన్నారు అఖిలప్రియ. తనతో పాటు చాలామందిని ఇబ్బందిపెట్టారని ఆరోపించారు. సొంత ఫ్యామిలీలోని సభ్యులనూ ఆయన వదల్లేదన్నారు. భూమా నాగిరెడ్డి పేరు చెప్పి ఎన్నో ఆరాచకాలు చేశారన్నారు. ప్రస్తుత రాజకీయాల నేపథ్యంలో ఎవరుపడితే వాళ్లు ఎమ్మెల్యేలు కాలేరని, ఇదొక ముళ్ల కిరీటంగా వర్ణించారు భూమా అఖిలప్రియ. ఆమె వ్యాఖ్యల నేపథ్యంలో ఏవీ సుబ్బారెడ్డి రేపోమాపో మీడియా ముందుకు వచ్చే ఛాన్స్ ఉందని అనుకుంటున్నారు అక్కడి ప్రజలు.

Related News

Chandrababu: బుడమేరును ఇష్టారాజ్యంగా కబ్జా చేశారు: చంద్రబాబు

Flood Damage: ఏపీలో వరదల వల్ల ఎంత నష్టం వాటిల్లిందంటే..?

Duvvada Issue: దువ్వాడ ఇంటి వద్ద మళ్లీ ఆందోళన.. ఈసారి ఏం జరిగిందంటే?

Huge Rains: విజయవాడలో మరోసారి వర్ష బీభత్సం.. రానున్న 3 రోజులూ ఏపీలో మళ్లీ భారీ వర్షాలు!

Budameru Floods: బుడమేరు గండి పూడ్చివేత పూర్తి .. పరిశీలించిన మంత్రి నారా లోకేశ్..

YCP Target on Pawan Kalyan: మీడియా ముందు నీతి కబుర్లు చెప్పి.. చాటుగా బిల్లులు పెడుతున్నావా పవన్ కళ్యాణ్

CM Chandrababu: తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు.. తెలిపిన ఏపీ సీఎం

Big Stories

×