EPAPER

Natural Weight Gain Tips: బరువు పెరగాలనుకుంటున్నారా..? అయితే ఇవి తినండి..!

Natural Weight Gain Tips: బరువు పెరగాలనుకుంటున్నారా..? అయితే ఇవి తినండి..!

Foods for Healthy Weight Gain in 10 Days: ప్రస్తుతం చాలా మంది ఊబకాయ సమస్యతో బాధపడుతున్నారు. పెరిగిన బరువును ఎలా తగ్గించుకోవాలో తెలియక మథనపడుతుంటారు. కానీ కొంత మంది మాత్రం ఉండాల్సిన బరువు ఉండకపోవడం వల్ల బరువు పెరగడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బరువు తగ్గడానికి చాలానే మార్గాలున్నా పెరగడం మాత్రం సవాల్ లాంటిదే.


బరువు తక్కువగా ఉన్నవారు ముందుగా బరువు ఎందుకు పెరగడం లేదో నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా.. అందువల్లే బరువు పెరగడం లేదా లాంటి విషయాలను గుర్తించాలి. అవసరమైతే వైద్యులను సంప్రదించాలి. ఎలాంటి సమస్య లేకపోతే మంచి డైట్ పాటించడం వల్ల బరువు పెరగొచ్చు. డైట్ లో ఆరోగ్యకరమైన ఆహారాలను చేర్చడం వల్ల బరువు పెరగడానికి అవకాశం ఉంటుంది.

ఏది తింటే బరువు పెరుగుతారో అది ఎంత మోతాదులో తినాలో ప్లాన్ చేసుకోవాలి. సరైన ఆహారం తీసుకోవడం ద్వారా మాత్రమే బరువు పెరగడం సాధ్యం అవుతుంది. ముఖ్యంగా బరువు పెరగాలనుకునే వాళ్లు ఏ ఆహార పదార్థాలు తింటే కడుపులో ఇబ్బంది కలగకుండా ఈజీగా జీర్ణమవుతుందో అలాంటి ఆహారాలను తినడానికి ట్రై చేయాలి.


Also Read: Clove for Weight Loss: బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నారా.. ఓ సారి ఇవి ట్రై చేయండి..

ఆహారంలో భాగంగా డ్రై ఫ్రూట్స్ ఉండేలా చూసుకోవాలి. అలా అని డ్రై ఫ్రూట్స్ ఎక్కువ మోతాదులో తీసుకున్నా ఇబ్బంది కలుగుతుంది. అందుకే డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించి లేదా బెల్లంలో కలిపి తింటే జీర్ణశక్తి మెరుగుపడుతుంది. బరువు పెరగడం కోసం కేవలం మంచి ఆహారం తీసుకోవడం మాత్రమే కాకుండా అందుకు తగ్గట్టుగా జీర్ణశక్తిని మెరుగుపరుచుకోవడం కూడా ఎంతైనా అవసరం.

చాలా మంది ఆకు కూరలు తినేందుకు ఆసక్తి చూపించరు. దీంతో పీచు పదార్థం అవసరమైన పోషక విలువలున్న ఆహారం శరీరానికి అందదు. వీటిని వివిధ మార్గాల్లో ఆహారంలో ఉపయోగించేలా చూసుకోవాలి. అంతే కాకుండా ఆకుకూరలతో పాటు దుంపలు కూడా ఆహారంలో భాగంగా చేసుకోవాలి. బీట్ రూట్ లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. దీనిని డైట్‌లో ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. బరువు పెరగాలనుకునే వారు వేరుశనగను తినవచ్చు. పీనట్ బటర్ కూడా చాలా మంది తినడానికి ఇష్టపడుతుంటారు. అయితే ఇది ఇంట్లో తయారుచేసుకున్నదైతే బాగుంటుంది.

Also Read: Cleaning Teeth Techniques: రోజు సరిగా బ్రష్ చేయకపోతే ఏం అవుతుందో తెలుసా..?

బరువు పెరగడంలో పండ్లు కూడా ముఖ్య పాత్రను పోషిస్తాయి. శరీర పోషణకు, బరువు పెరగడానికి పండ్లు తినడం ముఖ్యం. వాటి నుంచి రకరకాల ఎంజైములు, ఖనిజాలు లభిస్తాయి. దీని ద్వారా శరీర పోషణతో పాటు బరువు పెరిగేందుకు ఇవి కారణం అవుతాయి. అరటి పండ్లు బరువు పెరిగేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి అంతే కాకుండా ఆయా సీజన్లలో వచ్చే పండ్లను కూడా తినవచ్చు. కనీసం రోజులో రెండు సార్లయినా..పండ్లు తీసుకునేలా.. బరువు పెరగాలకునే వారు డైట్ ప్లాన్ చేసుకోవాలి.

నెయ్యి, పాలు, పెరుగు వంటివి కూడా శరీర బరువును పెంచడానికి ఉపయోగపడతాయి. అంతే కాకుండా పాలల్లో డ్రై ఫ్రూట్స్ పొడిని కలుపుకుని తాగొచ్చు. పప్పుధాన్యాలు కూడా ముక్కలు చేసి సలాడ్ లపైన వేసుకొని ఆహారంగా తినవచ్చు. నానబెట్టిన లేదా ఉడికించిన శనగలు తినడం వల్ల శరీరానికి ప్రోటీన్లు అందుతాయి. బరువు పెరగడానికి ఇవి ఉపయోగపడతాయి.

Also Read: ఫెయిర్‌నెస్ క్రీమ్స్ వల్ల కిడ్నీ సమస్యలు, పరిశోధనలో షాకింగ్ నిజాలు

గేద పాలు కూడా శరీర బరువును పెంచడానికి ఉపయోగపడతాయి. ఇందులో ఉండే పోషక విలువలు శరీరానికి చాలా అవసరం. పాల నుంచి తయారు చేసే చీజ్, పన్నీరు వంటివి తినడం వల్ల బరువు పెరగవచ్చు. మాంసాహారులైతే వారంలో రెండు మూడు సార్లు కోడి గుడ్డు, చేపలు, కోడి మాంసం వంటివి తినాలి. అయితే వీటిని ఎంత పరిమాణంలో తింటే జీర్ణం అవుతుందన్న విషయాన్ని డాక్టర్ల సలహా తీసుకుని తినాలి.

ప్రాణాయామం ధ్యానం, యోగా వంటివి రోజువారి జీవితంలో ఒత్తిడిని తగ్గిస్తాయి. మంచిగా నిద్రపోవడం డైట్ పాటించడం ద్వారా కూడా బరువు పెరగవచ్చు.

Related News

Hair Care Tips: జుట్టు సమస్యలన్నింటికీ చెక్ పెట్టండిలా !

Tips For Skin Glow: క్షణాల్లోనే మీ ముఖాన్ని అందంగా మార్చే టిప్స్ !

Yoga For Stress Release: ఒత్తిడి తగ్గేందుకు ఈ యోగాసనాలు చేయండి

Throat Infection: గొంతు నొప్పిని ఈజీగా తగ్గించే డ్రింక్స్ ఇవే..

Skin Care Tips: గ్లోయింగ్ స్కిన్ కోసం.. ఇంట్లోనే ఈ ఫేస్ ప్యాక్స్ ట్రై చేయండి

Sweets: స్వీట్లు ఇష్టపడేవారు ఈ సమయంలో తింటే అన్నీ సమస్యలే..!

Coffee For Glowing Skin: కాఫీ పౌడర్‌లో ఇవి కలిపి ఫేస్‌ప్యాక్ వేస్తే.. మీ ముఖం మెరిసిపోవడం ఖాయం

Big Stories

×