EPAPER

Prostitution Racket Busted: మైనర్లతో వ్యభిచారం.. డీఎస్పీ సహా ప్రభుత్వ అధికారులు అరెస్ట్.. ఎక్కడంటే..?

Prostitution Racket Busted: మైనర్లతో వ్యభిచారం.. డీఎస్పీ సహా ప్రభుత్వ అధికారులు అరెస్ట్.. ఎక్కడంటే..?

Prostitution Racket Busted in Arunachal Pradesh: అరుణాచల్ ప్రదేశ్ లో అంతర్రాష్ట్ర వ్యభిచార రాకెట్ గుట్టు రట్టయింది. ఇందులో ప్రభుత్వ అధికారుల ప్రమేయం కూడా ఉందన్న ఆరోపణలు రావడంతో.. పోలీసులు ప్రభుత్వ అధికారులు సహా 21 మందిని అరెస్ట్ చేశారు. ఈ రాకెట్ లో 15 సంవత్సరాల వయసున్న ఐదుగురు మైనర్లను రక్షించినట్లు పోలీసులు తెలిపారు. వ్యభిచార రాకెట్ లో అరెస్టైన ప్రభుత్వ అధికారుల్లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ కూడా ఉన్నారని వారు తెలిపారు.


క్యాపిటల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్‌పి) రోహిత్ రాజ్‌బీర్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇటానగర్‌లో బ్యూటీ పార్లర్‌ను నడుపుతున్న ఇద్దరు మహిళలు పొరుగున ఇద్దరు మైనర్లను మాటలతో మభ్యపెట్టి వ్యభిచారానికి రవాణా చేస్తున్నారని పేర్కొన్నారు. ఇక్కడికి సమీపంలోని చింపులో మైనర్ బాలికలతో కూడిన వ్యభిచార రింగ్ చురుకుగా ఉందని సమాచారం రావడంతో.. రాజధాని పోలీసు బృందం మే 4న ఇద్దరు మహిళల ఇంటిపై దాడి చేసి.. ఆ ఇద్దరు మైనర్లను రక్షించారు. మే 11న ఇక్కడ సమీపంలోని చింపు వద్ద జూ రోడ్‌లోని లాడ్జి నుండి మరో మైనర్ బాలికను రక్షించారు.

Also Read: రెండు వాహనాలు ఢీ.. 8 మంది మృతి


మైనర్ బాలికలు.. తమను బ్యూటీపార్లర్ నడిపే సిస్టర్స్ ధేమాజీ నుంచి ఇటానగర్ కు తీసుకొచ్చినట్లు చెప్పారు. వారితో పాటు మరో ఇద్దరు మైనర్లను పోలీసులు రక్షించారు. మైనర్లను వ్యభిచారకూపంలోకి దింపుతున్న మహిళలందరినీ అరెస్ట్ చేసినట్లు పోలీసులు వివరించారు. ప్రస్తుతం బాధిత బాలికలు షెల్టర్ హోమ్‌లలో ఉన్నారని, వారికి వైద్యపరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ కేసులో ముగ్గురు లైంగిక వేధింపులకు గురిచేస్తున్న వారు సహా మరో ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. వ్యభిచార రాకెట్‌లో పాల్గొన్న 10 మందిని, ఐదుగురు ప్రభుత్వ అధికారులతో సహా 11 మంది కస్టమర్‌లను అరెస్ట్ చేసినట్లు సింగ్ తెలిపారు.

Tags

Related News

kolkatta doctor case: కోల్ కతా డాక్టర్ కేసులో కీలక ఆధారాలు లభ్యం..ఆ రాత్రి బాత్ రూమ్ లో స్నానం చేసిందెవరు?

Lucknow Building collaps : యూపీలో ఘోర ప్రమాదం.. కూలిన బిల్డింగ్.. ఐదుగురు మృతి

Minister Comments: బ్రేకింగ్ న్యూస్.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి.. తన కూతురు – అల్లుడిని నదిలో తోసేయండంటూ..

Amit Shah: ఆ విషయంలో.. పాక్‌తో చర్చలు జరిపే ఆలోచనే లేదు: అమిత్ షా

No Doctors For Jails: 5600 మంది ఖైదీలకు ఒక డాక్టర్.. జైళ్లలో నేరస్తుల ఆరోగ్యంపై నిర్లక్ష్యమా?..

Uttar Pradesh Wolf Attacks: యూపీలో తోడేళ్ల విధ్వంసం.. 8 మంది మృతి.. మంత్రి వింత వాదన!

Kolkata Rape Case CBI: కోల్‌కతా రేప్ నిందితుడికి బెయిల్?.. సిబిఐ నిర్లక్ష్యం.. మండిపడిన మమతా పార్టీ!

Big Stories

×