EPAPER

Benefits of Baby Soaps: చిన్న పిల్లలకు పెద్దలు వాడే సబ్బులు వాడొచ్చా..?

Benefits of Baby Soaps: చిన్న పిల్లలకు పెద్దలు వాడే సబ్బులు వాడొచ్చా..?

Health Benefits Of Baby Soaps: చిన్న పిల్లలకు వాడే ప్రతీది సెపరెట్‌గా ఉండాలి. పుట్టినప్పటి నుంచి వారికి 5 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు అన్నీ వారికి ప్రత్యేకమైన వస్తువులనే వాడాలి. ఎందుకంటే పెద్దలు వాడే వస్తువులను పిల్లలకు వాడితే ఎలర్జీలు వంటి వివిధ రకాల సమస్యలు వస్తాయని నిపుణులు సూచిస్తుంటారు. అయితే ముఖ్యంగా కొన్ని సంవత్సరాల వరకు వారికి షాంపులు, సబ్బులు, లోషన్స్ వంటి విషయాల్లో చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.


చిన్న పిల్లల చర్మం సెన్సిటివ్‌గా ఉంటుంది కాబట్టి తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అయితే కొంత మంది అటువంటి జాగ్రత్తలు పాటించకుండా పెద్దలకు వాడే సబ్బులను పిల్లలకు ఉపయోగిస్తుంటారు. అలా చేయడం అస్సలు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం.

పెద్దలు తరచూ వాడే సబ్బులను చిన్న పిల్లలకు ఉపయోగించడం వల్ల వారి చర్మం పొడిబారి చికాకు పెడుతుందట. అందువల్ల పిల్లలకు ప్రత్యేకమైన, నాణ్యమైన సబ్బులను ఉపయోగించాల్సి ఉంటుంది. పిల్లలకు సంబంధించిన సబ్బుల్లో సహజ నూనెలు ఉండడం వల్ల ఇవి చర్మాన్ని శుభ్రంగా, తేమగా ఉంచడానికి సహాయపడతాయి. అంతేకాదు ఏడాదిలోపు గల పిల్లలకు పెద్దల సబ్బులు అస్సలు ఉపయోగించకూడదు. ఎందుకంటే వారి చర్మం సున్నితంగా ఉంటుంది. కాబట్టి గాఢత తక్కువ ఉన్న సబ్బులను మాత్రమే వాడాల్సి ఉంటుంది.


Also Read: Clove for Weight Loss: బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నారా.. ఓ సారి ఇవి ట్రై చేయండి..

ఏడాది లోపు వయసు గల పిల్లలకు గాఢత తక్కువ ఉండే సబ్బులను మాత్రమే వాడాలని, లేదంటే చర్మం పొడిబారి చర్మ సమస్యలు వస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. రంగులు, సువాసనలు ఉండే సబ్బులను వాడడం కూడా హానికరం. పిల్లలకే కాదు పెద్దలకు కూడా ఇవి ప్రమాదకరం అని నిపుణులు చెబుతున్నారు. అయితే సబ్బులకు బదులుగా కొబ్బరి నూనె, బాదం వంటి సహజ నూనెలను పిల్లలకు వాడడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. వాటిలోను మంచి పరిమళాలు ఉంటాయి కాబట్టి సువాసనలు వస్తాయి.

Tags

Related News

Home Remedies For Hair: ఇవి వాడితే.. వద్దన్నా జుట్టు పెరుగుతుంది తెలుసా ?

Dates For Hair: ఇలా చేస్తే చాలు.. జుట్టు రాలడం ఆగిపోతుంది తెలుసా ?

Cough: ఎంతకీ దగ్గు తగ్గడం లేదా.. వీటితో వెంటనే ఉపశమనం

Homemade Rose Water: ఇంట్లోనే రోజ్ వాటర్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసా ?

Egg Potato Omelette: ఎగ్ పొటాటో ఆమ్లెట్ ఇలా వేసి చూడండి, మీ పిల్లలకు ఈ బ్రేక్ ఫాస్ట్ తెగ నచ్చేస్తుంది

Haldi adulteration: మీరు ఇంట్లో వాడే పసుపు మంచిదేనా లేక కల్తీదా? పసుపు కల్తీని ఇలా ఇంట్లోనే చెక్ చేయండి

Worst First Date: కలిసిన పావుగంటకే ముద్దు అడిగాడు, ఆ తర్వాత.. అమ్మాయి ఫస్ట్ డేట్ అనుభవాలు..

Big Stories

×