EPAPER

Swathi Maliwal: స్వాతి మాలివాల్ పై కుట్ర.. ప్రాణాలకు ప్రమాదం: ఆమె మాజీ భర్త నవీన్!

Swathi Maliwal: స్వాతి మాలివాల్ పై కుట్ర.. ప్రాణాలకు ప్రమాదం: ఆమె మాజీ భర్త నవీన్!

Ex Husband React on Swathi Maliwal Incident: స్వాతి మాలివాల్ పై కుట్రలో భాగంగానే ఆమెపై దాడి చేశారని ఆమె మాజీ భర్త నవీన్ ఆరోపించారు. ఎంపీ స్వాతి మాలివాల్ ప్రాణాలకు ప్రమాదం ఉందని, ఆమె ప్రాణాలకు ఏమైనా జరగవచ్చని ఆమె మాజీ భర్త ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు ఆమెపై దాడి చేసింది నిజమేనంటూ ఆప్ అంగీకరించిన సందర్భంలోనే అతడి నుంచి స్పందన రావడం గమనార్హం.


ఇందుకు సంబంధించి ఆయన ఫేస్ బుక్ లో ఒక వీడియో సందేశాన్నికూడా పోస్టు చేశారు.
ఇదంతా కుట్రలో భాగమే అని.. ఆమెకు ఏదైన జరగవచ్చని తెలిపారు. దాడి ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత బిభవ్ స్పందించలేదని ఆయన ఎవరి ఆదేశాలను అనుసరిస్తున్నాడో చెప్పలేను అని వెల్లడించారు. ఇదిలా ఉంటే నవీన్ , స్వాతి నాలుగేళ్ల క్రితమే విడిపోయారు. అప్పటి నుంచి అతడు ఆమెతో మాట్లాడలేదని వెల్లడించాడు. ఆప్ నేత సంజయ్ కు అంతా తెలుసని ఆయన నటిస్తున్నారని నవీన్ ఆరోపించారు.

స్వాతి మాలివాల్ పై బిభవ్ దాడి చేయడం నిజమేనని ఆప్ సీనియర్ నేత ఎంపీ సంజయ్ సింగ్ అంగీకరించారు. కేజ్రివాల్ డ్రాయింగ్ రూంలో  సోమవారం ఆమె ఎదురు చూస్తుండగా బిభవ్ కుమార్ అక్కడకు వెళ్లి ఆమెతో అమర్యాదగా ప్రవర్తించాడని తెలిపారు. సీఎం కూడా ఈ సంఘటనను తీవ్రంగా ఖండించారని అన్నారు. బిభవ్ పై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మంగళవారం మీడియా సమావేశంలో సంజయ్ సింగ్ మాట్లాడారు.


Also Read: ప్రియాంక కూతురు మిరయాపై ట్వీట్, కేసు నమోదు

ఎంపీ స్వాతిపై దాడికి పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కుంటున్న బిభవ్ సింగ్ ఎవరంటే..2000 సంవత్సరంలో ఇండియా ఎగైనస్ట్ కరప్షన్ అనే సంస్థ ఏర్పాటు చేసిన ఓ పత్రికలో బిభవ్ వీడియో జర్నలిస్టుగా పని చేశారు.తర్వాత ఆ సంస్థ ఆమ్ ఆద్మీ పార్టీగా రూపాంతరం చెందింది. అనంతరం కేజ్రీవాల్ తో సన్నిహిత సంబందం ఏర్పడడం వల్ల ఆయనకు నమ్మకస్తుడు సహాయకుడిగా   బిభవ్   ఎదిగాడు.

ఆప్ అధినేత డైట్ కు సంబంధించిన విషయాలను  బిభవ్ చూసుకుంటాడు. 2007లో ఇతడిపై నమోదైన కేసు కారణంగా సీఎం వ్యక్తిగత కార్యదర్శి పదవి నుంచి తొలగించారు. ఢిల్లీ మద్యం కేసులో కీలక సాక్ష్యాలను ధ్వంసం చేసినట్లు కూడా ఇతడిపై ఆరోపణలు ఉన్నాయి.

Also Read: PM Modi : సీఏఏపై విప‌క్షాల అసత్య ప్రచారం, ఓటు బ్యాంకు కాదని నిర్లక్ష్యం: పీఎం మోదీ

Tags

Related News

kolkatta doctor case: కోల్ కతా డాక్టర్ కేసులో కీలక ఆధారాలు లభ్యం..ఆ రాత్రి బాత్ రూమ్ లో స్నానం చేసిందెవరు?

Lucknow Building collaps : యూపీలో ఘోర ప్రమాదం.. కూలిన బిల్డింగ్.. ఐదుగురు మృతి

Minister Comments: బ్రేకింగ్ న్యూస్.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి.. తన కూతురు – అల్లుడిని నదిలో తోసేయండంటూ..

Amit Shah: ఆ విషయంలో.. పాక్‌తో చర్చలు జరిపే ఆలోచనే లేదు: అమిత్ షా

No Doctors For Jails: 5600 మంది ఖైదీలకు ఒక డాక్టర్.. జైళ్లలో నేరస్తుల ఆరోగ్యంపై నిర్లక్ష్యమా?..

Uttar Pradesh Wolf Attacks: యూపీలో తోడేళ్ల విధ్వంసం.. 8 మంది మృతి.. మంత్రి వింత వాదన!

Kolkata Rape Case CBI: కోల్‌కతా రేప్ నిందితుడికి బెయిల్?.. సిబిఐ నిర్లక్ష్యం.. మండిపడిన మమతా పార్టీ!

Big Stories

×