EPAPER

Discount on iPhone 15: వర్త్ వర్మ వర్త్.. కేవలం రూ. 42,900 లకే ఐఫోన్ 15.. ఆఫర్ పోతే మళ్లీ రాదు వర్మ!

Discount on iPhone 15: వర్త్ వర్మ వర్త్.. కేవలం రూ. 42,900 లకే ఐఫోన్ 15.. ఆఫర్ పోతే మళ్లీ రాదు వర్మ!

Huge Discount on iPhone 15 Series: యాపిల్ ఐఫోన్‌కు మార్కెట్‌లో సూపర్ డూపర్ క్రేజ్ ఉంది. ఈ ఫోన్ అంటే ఇష్టం లేనివారంటూ ఉండరు. ఈ కంపెనీ నుంచి కొత్త సిరీస్ వస్తుందంటే కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటారు. ధర ఎంత రేంజ్‌లో ఉన్నా కొనేందుకు ఆలోచించరు. అయితే మరికొందరు మాత్రం ఐఫోన్‌ను కొనుక్కోవాలనుకున్నా.. అధిక ధర కారణంగా తమ ప్లాన్‌ను మార్చుకుంటున్నారు. ఎప్పుడైనా ఐఫోన్‌లపై ఆఫర్లు ఉంటే అప్పుడు కొనుక్కోవచ్చులే అని అనుకుంటున్నారు. అలాంటి వారికి ఓ గుడ్ న్యూస్. ఐఫోన్ 15పై భారీ డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.


యాపిల్ ఐఫోన్ 15 ఇండియా ఐస్టోర్‌లో అద్భుతమైన ఆఫర్‌లు, డిస్కౌంట్‌లను పొందేందుకు సిద్ధంగా ఉంది. ఈ తాజాగా డిస్కౌంట్ ఆఫర్‌తో ఐఫోన్ 15 ఫోన్‌ను కేవలం రూ. 42,900 (బేస్ వేరియంట్)కే కొనుగోలు చేయవచ్చు. India iStore మే 10 నుండి మే 26 వరకు అప్‌గ్రేడర్ ఫెస్ట్‌ సేల్‌ నిర్వహిస్తోంది. ఇది Apple iPhone 15 సిరీస్ కొనుగోలుపై ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు, బ్యాంక్ డిస్కౌంట్లను అందిస్తుంది. మీరు మీ పాత ఐఫోన్‌ను తాజా ఐఫోన్‌కి అప్‌గ్రేడ్ చేయాలని చూస్తున్నట్లయితే.. ఇప్పుడు ఈజీగా కొనుక్కోవచ్చు. Apple iPhone 15 128GB వేరియంట్‌ అసలు ధర రూ. 79,900గా ఉంది.

అయితే ఆఫర్‌లో భాగంగా.. ఇండియా iStore రూ. 5,000 ఇన్‌స్టంట్ స్టోర్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. అప్పుడు దీని ధర రూ. 74,900కి తగ్గుతుంది. అదనంగా ICICI బ్యాంక్, SBI క్రెడిట్ కార్డ్‌లపై రూ. 4,000 తక్షణ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.


Also Read: హూర్రె.. 5G ఫోన్ కంటే తక్కువ ధరకే ఐఫోన్ 15.. డోంట్ మిస్!

అలాగే కొత్త ఐఫోన్ 15ని కొనుగోలు చేసేటప్పుడు మీ పాత ఐఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకుంటే రూ. 20,000 తగ్గింపు పొందవచ్చు. అయితే ఈ రూ. 20,000 తగ్గింపు iPhone 12 మొబైల్ 64GB మోడల్ ఎక్స్‌ఛేంజ్ విలువపై లెక్కించబడుతుందని గుర్తుంచుకోవాలి. అయితే ఈ పాత ఫోన్ మంచి కండీషన్‌లో ఉండాలి. ఎలాంటి డ్యామేజ్ కానీ, హ్యాంగింగ్ కానీ ఉండకూడదు. అప్పుడు మాత్రమే ఇంత మొత్తంలో ఎక్స్ఛేంజ్ ఆఫర్ పొందవచ్చు. అంతేకాకుండా అదనంగా రూ.8000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా లభిస్తుంది. ఈ తగ్గింపులన్నింటితో ఐఫోన్ 15 ఫోన్‌ను కేవలం రూ.42,900లకే సొంతం చేసుకోవచ్చు.

అంతేకాకుండా ఈ ఇండియాస్టోర్‌లో ఇతర iPhone 15 సిరీస్‌లపై కూడా డిస్కౌంట్లను ఇస్తోంది. iPhone 15 Plus, iPhone 15 Pro, iPhone 15 Pro Max వంటి సిరీస్‌లపై కూడా ఆఫర్లు పొందవచ్చు. ఈ సేల్‌లో ఐఫోన్ 15 ప్లస్‌ను రూ. 52,900కి, Apple iPhone 15 Pro ను రూ.1,03,900కి, iPhone 15 Pro Maxను రూ. 1,28,900 ధరకు కొనుక్కోవచ్చు.

Tags

Related News

Bsnl Recharge Plan: వావ్ అమేజింగ్.. ఇంత తక్కువ ధరకే అన్ని రోజుల వ్యాలిడిటీనా, రీఛార్జ్ ప్లాన్ అదిరిపోయింది!

Honor Magic V3: బీభత్సం.. హానర్ ఏంటి భయ్యా ఒకేసారి ఇన్ని లాంచ్ చేసింది, ధర సహా పూర్తి వివరాలివే!

Realme 13 And 13+ 5G: దుమ్ముదులిపే స్మార్ట్‌ఫోన్లు లాంచ్.. మొదటి సేల్ షురూ, ఆఫర్లు పిచ్చెక్కించాయ్ గురూ!

Vivo T3 Ultra: కుమ్ముడే కుమ్ముడు.. ఏకదాటిగా దూసుకుపోతున్న వివో.. మార్కెట్‌లోకి మరో స్మార్ట్‌ఫోన్!

Poco M7 Pro 5G: పోకో నుంచి మరో కిక్కిచ్చే ఫోన్.. సామాన్యుల కోసం వచ్చేస్తుంది మావా!

Vivo Y300 Pro: వివో నుంచి మెస్మరైజింగ్ స్మార్ట్‌ఫోన్.. కర్వ్డ్ డిస్‌ప్లే, 6500mAh బ్యాటరీతో లాంచ్!

Moto S50 Launched: మోటో మామ అదరగొట్టేశాడు.. 50MP కెమెరా సహా మరెన్నో అధునాతన ఫీచర్లతో కొత్త ఫోన్ లాంచ్!

Big Stories

×