EPAPER

Facts about Fairness Creams: ఫెయిర్‌నెస్ క్రీమ్స్ వల్ల కిడ్నీ సమస్యలు.. పరిశోధనలో షాకింగ్ నిజాలు!

Facts about Fairness Creams: ఫెయిర్‌నెస్ క్రీమ్స్ వల్ల కిడ్నీ సమస్యలు.. పరిశోధనలో షాకింగ్ నిజాలు!

Fairness Creams Causes Kidney Problems Shocking Facts: చర్మం యవ్వనంగా, కాంతి వంతంగా కనిపించడానికి రక రకాలఫెయిర్‌నెస్ క్రీమ్‌లను వాడుతూ ఉంటారు. అన్ని రకాల చర్మానికి సంబంధించిన ఫెయిర్‌నెస్ క్రీమ్స్ మార్కెట్‌లో లభిస్తున్నాయి. కానీ ఈ ఫెయిర్‌నెస్ క్రీమ్ లు కిడ్నీ సమస్యలను పెంచుతాయని మీకు తెలుసా..?


ఫెయిర్‌నెస్ క్రీమ్ ల వల్ల భారతదేశంలో చాలా మంది కిడ్నీ సమస్యల బారిన పడుతున్నారని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ప్రస్తుతం ఫెయిర్‌నెస్ క్రీమ్ లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అయితే ఈ క్రీమ్ లు మెంబ్రేనస్, నెఫ్రోపతి వంటి వ్యాధులకు కారణమవుతాయట. ఇది మూత్రపిండాల పనితీరును దెబ్బతీస్తాయి. అంతే కాకుండా ప్రోటీన్ల లీకేజీకి కారణమవుతాయి.

ఫెయిర్‌నెస్ క్రీమ్ లు ఎక్కువగా వాడడం వల్ల భారతదేశంలో కిడ్నీ సమస్యలు గణనీయంగా పెరుగుతున్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం ఈ క్రీమ్ లలో అధిక మొత్తంలో పాదరసం ఉండటం వల్ల ఇది మూత్రపిండాల సమస్యలను పెంచడానికి కారణం అవుతుంది.


పాదరసం చర్మం ద్వారా గ్రహించబడుతుంది. కిడ్నీ ఫిల్టర్లపై ఇది ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది నెఫ్రోటిక్ కేసుల పెరుగుదలకు దారితీస్తుంది. భారతదేశంలో మార్కెట్లో ఉన్న ఈ క్రిమ్ లు ఉత్తమ ఫలితాలను అందిస్తాయి. అయితే వీటిని వాడిన తర్వాత చర్మం మరింత నల్లగా మారవచ్చు. పరిశోధకులు జూలై 2021 నుంచి సెప్టెంబర్ 2023 మధ్య వచ్చిన 22 కేసుల అధ్యయనంలో భాగంగా ఈ అంశాలను తెలియజేశారు.

రోగులు అలసట, మూత్రంలో నురగ వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని వెల్లడించారు. కొందరు మెడలో రక్తం గడ్డ కట్టే సమస్యను కూడా ఎదుర్కొంటున్నారట.పాదరసం ఎక్కువగా ఉండే ఫెయిర్‌నెస్ క్రీమ్ లు సబ్బులు, లోషన్లు వాడకంపై అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ పదే పదే హెచ్చరిస్తోందని వైద్యులు చెబుతున్నారు.

Also Read:  మైగ్రేన్ వేధిస్తోందా ? అయితే ఈ చిట్కాలు మీ కోసమే..!

మెర్క్యురస్ క్లోరైడ్ కలోనల్ మెర్క్యురిక్ లేదా మెర్క్యురీ రసాయనాలు చర్మాన్ని కాంతివంతం చేయడంతో పాటు వృద్దాప్య నిరోధకాలుగా పనిచేస్తాయి. ఇవి మచ్చలు, ముడతలను తొలగిస్తాయి. పలు అధ్యయనాల ప్రకారం యుక్త వయస్సులో ఉన్నవారు తరచుగా ఈ ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల చర్మంపై దద్దుర్లు మరియు చర్మ వ్యాధులు,మతిమరుపు, నిరాశ, ఆందోళన వంటి సమస్యలు వస్తాయి.

Related News

Weight Gain Foods For Children: మీ పిల్లలు బరువు పెరగడం లేదా ? ఈ ఫుడ్స్ తినిపించండి

Aloe Vera Health Benefits: కలబందతో మతిపోయే ప్రయోజనాలు !

Lip Care Tips: పెదాలు ఎర్రగా మారడానికి చిట్కాలు ఇవే !

Barley Water Benefits: బార్లీ వాటర్‌తో అనారోగ్య సమస్యలు దూరం !

Chana Dal For Diabeties: డయాబెటీస్ ఉన్నవారికి శనగపప్పుతో ఉండే లాభాలు తెలిస్తే అస్సలు వదలరు..

Figs Side Effects: ఆరోగ్యానికి మంచిది అని అంజీర పండ్లను అతిగా తినేస్తున్నారా ?

Chia Seeds Benefits for Skin: చియా సీడ్స్‌తో ఫేస్ ప్యాక్.. మీ చర్మం మెరిసిపోవడం ఖాయం

Big Stories

×