EPAPER

Priyanka’s Daughter Miraya: ప్రియాంక కూతురు మిరయాపై ట్వీట్.. కేసు నమోదు

Priyanka’s Daughter Miraya: ప్రియాంక కూతురు మిరయాపై ట్వీట్.. కేసు నమోదు

Tweet on Priyanka’s Daughter Miraya – Case Filed: ఎన్నికల వేళ పార్టీల మధ్య ప్రచారం తారాస్థాయికి చేరుతుంది. ఒకరిపై మరొకరు నేతలు పాలసీలపై విమర్శలు గుప్పించుకుంటారు. కానీ ఓ వ్యక్తి ఏకంగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక‌గాంధీ కూతురు మిరయాపై ఆసక్తికరమైన పోస్ట్ పెట్టాడు. అంతేకాదు ఏకంగా ఆమెకు 3000 కోట్ల రూపాయలు ఆస్తులున్నట్లు అందులో పేర్కొన్నాడు. ఈ వ్యవహారంపై దుమారం రేగడంతో హిమాచల్ ప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అసలేం జరిగింది?


కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ మనవరాలు, ప్రియాంక గాంధీ కూతురు మిరయాగాంధీని ఉద్దేశించి అనూప్‌వర్మ అనే నెటిజన్ మిరయాకు వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని పేర్కొన్నాడు. అంతేకాదు మూడు కోట్ల రూపాయల ఆస్తులున్నట్లు అందులో ప్రస్తావించాడు. దీనిపై కాంగ్రెస్ కార్యకర్తలు మండిపడ్డారు. ముమ్మాటికీ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని ఆరోపించారు. అంతేకాదు అనూప్‌వర్మపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Also Read: Maharashtra Rs 170 crore seized: ఐటీకి చిక్కిన భారీ తిమింగళం, 8 కేజీల బంగారం, 170 కోట్ల…


మీరయాపై అనూప్ తప్పుదోవ పట్టించే విధంగా నిరాధారమైన పోస్ట్ చేశారంటూ కాంగ్రెస్ నేత ప్రమోద్ గుప్తా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనూప్‌వర్మ ఐడీని పరిశీలించిన పోలీసులు, ఆయన ఐఏఎఫ్ ఫ్లయిట్ లెప్టినెంట్, డిఫెన్స్ అనలిస్టు, రాజకీయ వ్యాఖ్యాత అని ఖాతాలో రాసుంది. అనూప్‌వర్మను గుర్తించేందుకు సైబర్ సెల్ సాయం కోరినట్టు తెలిపారు. తప్పుడు సమాచారంతో పోస్టు చేయడం, ఇతరుల గౌరవాన్ని కించపరిచేలా పోస్టులు పెట్టడం చట్టరీత్యా నేరమని, చర్యలు తీసుకుంటామని వివరించారు పోలీసులు.

Tags

Related News

Lucknow Building collaps : యూపీలో ఘోర ప్రమాదం.. కూలిన బిల్డింగ్.. ఐదుగురు మృతి

Minister Comments: బ్రేకింగ్ న్యూస్.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి.. తన కూతురు – అల్లుడిని నదిలో తోసేయండంటూ..

Amit Shah: ఆ విషయంలో.. పాక్‌తో చర్చలు జరిపే ఆలోచనే లేదు: అమిత్ షా

No Doctors For Jails: 5600 మంది ఖైదీలకు ఒక డాక్టర్.. జైళ్లలో నేరస్తుల ఆరోగ్యంపై నిర్లక్ష్యమా?..

Uttar Pradesh Wolf Attacks: యూపీలో తోడేళ్ల విధ్వంసం.. 8 మంది మృతి.. మంత్రి వింత వాదన!

Kolkata Rape Case CBI: కోల్‌కతా రేప్ నిందితుడికి బెయిల్?.. సిబిఐ నిర్లక్ష్యం.. మండిపడిన మమతా పార్టీ!

Jammu and Kashmir Assembly Polls: జమ్మూకాశ్మీర్ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల

Big Stories

×