EPAPER

India Ex Colonel Died in Rafah: రఫాలో భారత మాజీ అధికారి మృతి.. రెండు నెలల క్రితమే..?

India Ex Colonel Died in Rafah: రఫాలో భారత మాజీ అధికారి మృతి.. రెండు నెలల క్రితమే..?

Former Indian army officer Killed in Rafah: ఇండియన్ ఆర్మీలో పని చేసి ఐక్యరాజ్య సమితిలో పనిచేస్తోన్న కల్నల్ వైభవ్ అనిల్ కాలే ఇజ్రాయెల్-హమాస్ సంఘర్షనలో అశువలుబాసారు. గాజాలోని రఫాలో అతను ప్రయత్నిస్తోన్న వాహనంపై దాడి జరగగా అతను అక్కడిక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయని ఐక్యరాజ్యసమితి ఒక ప్రకటనలో తెలిపింది.


ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధంలో మరణించిన తొలి విదేశీ వ్యక్తి కల్నల్ వైభవ్ అనిల్ కాలే. 2022లో భారత సైన్యం నుంచి రిటైర్మెంట్ తీసుకున్న కల్నల్ వైభవ్ అనిల్ కాలే, రెండు నెలల క్రితం UN భద్రత విభాగం (DSS)లో సెక్యూరిటీ కోఆర్డినేషన్ ఆఫీసర్‌గా చేరారు. రఫాలో మృతిచెందిన కాలే, అక్టోబర్ 7 ఉగ్రవాద దాడుల తర్వాత ఇజ్రాయెల్-హమాస్ వివాదం ప్రారంభమైనప్పటి నుంచి గాజాలోని అంతర్జాతీయ UN సిబ్బందిలో మొదటి మరణం. రఫాలోని యూరోపియన్ ఆసుపత్రికి ప్రయాణిస్తుండగా వారి వాహనంపై దాడియ జరిగింది. దీంతో కాలేతో పాటు ప్రయాణిస్తోన్న మరో ఆఫీసర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

UN సెక్రటరీ-జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. “రఫాలోని యూరోపియన్ హాస్పిటల్‌కి వెళుతుండగా వారి UN వాహనంపై దాడి జరగగా, యునైటెడ్ నేషన్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ (DSS) సిబ్బంది మరణించడంతో పాటు మరొక DSS సిబ్బందికి గాయం కావడం గురించి తెలుసుకుని చాలా బాధపడ్డాను ” అని ట్విట్టర్ వేదికగా స్పందించారు. కాగా ఈ దాడిపై ఇజ్రాయెల్ విచారణకు ఆదేశించింది.


Also Read: India-Iran Chabahar Deal: ఆంక్షలు విధిస్తామన్న అమెరికా.. తగ్గేదేలే అన్న భారత్

ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్, Xలోని ఒక పోస్ట్‌లో, గాజాలో ఒక UN మానవతా కార్యకర్త మరణం, మరొకరికి గాయం కావడం గురించి తెలుసుకున్నందుకు మేము చాలా బాధపడ్డాము. చాలా మంది పౌరులు, మానవతా జీవితాలు ఈ యుద్ధానికి మూల్యం చెల్లించాయి. కాల్పుల విరమణ, శాంతి కోసం పని చేయండి, ”అని WHO చీఫ్ అన్నారు.

Tags

Related News

Crime: స్కూల్ బాత్రూంలో కాల్పులు.. బాలుడు మృతి

Russia president Putin: కమలా హ్యారిస్ కు జై కొట్టిన రష్యా అధ్యక్షుడు పుతిన్

USA Gun Fire: తండ్రి గిఫ్ట్‌గా ఇచ్చిన గన్‌తోనే స్కూల్‌లో అరాచకం.. ఐదుగురిని కాల్చి చంపిన ఆ నిందితుడి వయస్సు 14 ఏళ్లే!

PM Modi: భారత్‌లోనూ సింగపూర్‌లను సృష్టిస్తున్నాం: మోదీ

Muhammad Yunus: షేక్ హసీనాకు యూనస్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఎందుకంటే ?

Japan Resignation Companies: ఉద్యోగుల చేత రాజీనామా చేయించడం కూడా ఒక బిజినెస్.. జపాన్ లో కొత్త వ్యాపారం

US’s Georgia school shooting: అమెరికాలో మళ్లీ కాల్పులు.. ఈసారి స్కూల్ లో.. నలుగురు మృతి

Big Stories

×