EPAPER

Kavitha’s Custody Extended: కవితకు భారీ షాక్.. కస్టడీ పొడగింపు!

Kavitha’s Custody Extended: కవితకు భారీ షాక్.. కస్టడీ పొడగింపు!

Kavitha Judicial custody Extended to Till May 30: ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది. ఆమె కస్టడీని ఈ నెల 20 వరకు న్యాయస్థానం పొడిగించింది. తదుపరి విచారణను మే20 కు వాయిదా వేసింది.


అయితే, ఈడీ కేసులో రిమాండ్ ముగియడంతో కవితను మంగళవారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా తీహార్ జైలు నుంచి హాజరుపరిచారు. దర్యాప్తు కొనసాగుతున్నదని, ఈ నేపథ్యంలో రిమాండ్ పొడిగించాలని ఈడీ అధికారులు కోర్టును కోరారు. ఈడీ తరఫున న్యాయవాది వాదనలతో ఏకీభవించిన రౌస్ అవెన్యూ న్యాయస్థానం.. కస్టడీని ఈనెల 20 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

8 వేల పేజీలతో సప్లిమెంటరీ చార్జిషీట్ ను దాఖలు చేశామని ఈడీ పేర్కొన్నది. దీనిపై స్పందించిన కోర్టు మే 20న ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషీట్ పరిగణనలోకి తీసుకునే అంశంపై విచారిస్తామని తెలిపిన కోర్టు కవిత జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల 20 వరకు పొడిగిస్తున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది. అయితే, సీబీఐ కేసులోనూ గతంలో కవితకు మే 20 వరకు రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడీషియల్ కస్టడీని విధించిన విషయం తెలిసిందే.


Also Read: Priyanka’s daughter Miraya: ప్రియాంక కూతురు మిరయాపై ట్వీట్, కేసు నమోదు

అయితే, ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యి ఆమె ప్రస్తుతం తీహార్ జైలులో ఉంటున్నారు. ఈ కేసు విషయమై కవిత పాత్రను ప్రస్తావిస్తూ ఇటీవల ఈడీ చార్జిషీట్ ను కూడా దాఖలు చేసింది. తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఢిల్లీ హైకోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేయగా, ఈ నెల 24న విచారణ చేపట్టనున్నది. అయితే, తనను ఈడీ, సీబీఐ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ, తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత దాఖలు చేసిన మధ్యంతర, రెగ్యులర్ పిటిషన్లను ఇప్పటికే కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. దీంతో ఆమె హైకోర్టును ఆశ్రయించింది.

Related News

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Ys jagan: బాబుపై జగన్ వెటకారం..కాస్త ఎక్కువైంది గురూ

Tejaswini Nandamuri: బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని గురించి తెలుసా?

Roja: జగన్ పార్టీ నుంచి రోజా జంప్? ఇదిగో ఇలా ప్రత్యక్షమై క్లారిటీ ఇచ్చేశారుగా!

Kondareddypalli:పూర్తి సోలార్ మయంగా మారనున్న సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం

Chitrapuri colony: ఖాజాగూడ చిత్రపురి కమిటీలో 21 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు

Adani group: బంగ్లాదేశ్ జుట్టు ఆదానీ చేతిలో.. అదెలా?

Big Stories

×