EPAPER

HMD Arrow Smartphone: హెచ్ఎండీ ‘యారో’ తొలి స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది.. బడ్జెట్ ధరలోనే కొనేయొచ్చు

HMD Arrow Smartphone: హెచ్ఎండీ ‘యారో’ తొలి స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది.. బడ్జెట్ ధరలోనే కొనేయొచ్చు

HMD Arrow to Launch in India as First Branded Smartphone: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ నోకియా-బ్రాండెడ్ తయారీలో ఎంతో ప్రాముఖ్యత పొందిన కంపెనీ హెచ్‌ఎండీ (HMD). ఇప్పుడీ కంపెనీ భారత మార్కెట్‌లో తన మొదటి హెచ్‌ఎండీ బ్రాండెడ్ మొబైల్‌ను లాంచ్ చేసేందుకు రెడీగా ఉంది. ఇప్పుడు ఈ కంపెనీ తన స్మార్ట్‌ఫోన్ పేరును వెల్లడించింది.


Nokia-బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌లను తయారు చేసే కంపెనీ 2024 ప్రారంభంలో HMD బ్రాండ్ పేరుతో స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. కంపెనీ యూరోపియన్ మార్కెట్లో HMD ప్లస్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. అంతేకాకుండా HMD తన మొదటి స్మార్ట్‌ఫోన్‌ను ‘HMD వైబ్’ పేరుతో అమెరికన్ మార్కెట్లో లాంచ్ చేస్తుంది. అలాగే ఇప్పుడు కంపెనీ తన మొదటి స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది.

HMD ఇండియా తన మొదటి స్మార్ట్‌ఫోన్ పేరును ధృవీకరించింది. దీనికి భారతదేశంలో ‘HMD యారో’ అని పేరును ఖరారు చేసింది. భారతదేశంలో లాంచ్ చేయబోతున్న మొదటి స్మార్ట్‌ఫోన్ పేరును ఖరారు చేయడానికి కంపెనీ ‘HMDNameOurSmartphone’ పేరుతో పోటీని నిర్వహించింది. దీనికోసం కంపెనీ ఈ ఏడాది ఐపీఎస్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్‌తో భాగస్వామ్యం కలిగి ఉంది.


Also Read: భారత్‌లో త్వరలో విడుదల కానున్న తొలి HMD బ్రాండెడ్ ఫోన్.. స్పెసిఫికేషన్స్, ప్రైజ్ డీటెయిల్స్..!

దీంతో బ్రాండ్ HMD మొదటి స్మార్ట్‌ఫోన్ పేరును రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ టీమ్ అధికారిక X హ్యాండిల్‌ ద్వారా తెలిపింది. ఇక అందుతున్న సమాచారం ప్రకారం.. HMD యారోను ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఐరోపాలో ప్రారంభించబడిన HMD పల్స్ రీబ్రాండెడ్ వెర్షన్ అని భావిస్తున్నారు. స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. యారో 6.56-అంగుళాల HD + డిస్‌ప్లే (1612 x 720 పిక్సెల్‌లు)తో వస్తుందని సమాచారం. అంతేకాకుండా ఇది యూనిసోక్ T606 ప్రాసెసర్‌ను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: 16GB ర్యామ్ – 1TB స్టోరేజ్.. 200MP కెమెరాతో Vivo నుంచి కొత్త ఫోన్ లాంచ్.. ధర ఎంతంటే?

ఈ కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ 4GB RAM + 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. దీనిని 256 GB వరకు విస్తరించవచ్చు. అలాగే స్మార్ట్‌ఫోన్ ర్యామ్‌ను 6GB వరకు విస్తరించవచ్చు. ఇది ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌లో రన్ అవుతుంది. అలాగే 2 సంవత్సరాల OS అప్‌గ్రేడ్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 5000mAh బ్యాటరీ సామార్థ్యంతో వస్తుంది. 10W USB టైప్ C ఛార్జింగ్ ఫీచర్‌ను కలిగి ఉంది.

ఇక కెమెరా విషయానికొస్తే.. ఫోన్ వెనుక వైపు డ్యూయల్ రియర్ కెమెరా సెటప్-13MP ప్రధాన ఆటోఫోకస్ షూటర్‌ను కలిగి ఉంటుంది. ముందు భాగంలో ఇది సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 8MP కెమెరాను కలిగి ఉంటుంది. ఇక దీని ధర విషయానికొస్తే.. అంతర్జాతీయ మార్కెట్లలో ఈ స్మార్ట్‌ఫోన్ ధర EUR 140 గా ఉంది. అంటే ఇండియా కరెన్సీ ప్రకారం.. దాదాపు రూ. 12,500గా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిబట్టి చూస్తే ఇది సామాన్యులకు మంచి ఎంపిక అని చెప్పొచ్చు.

Tags

Related News

ChatGP: చాట్ జీపీటీతో ఇంట్లో కూర్చొని ఈజీగా డబ్బులు సంపాదించొచ్చు, ఎలాగో తెలుసా?

Amazon Great Indian Festival 2024 Sale: అమెజాన్ న్యూ సేల్ డేట్ ఖరారు.. రూ.38,999లకే ఐఫోన్!

Motorola Edge 50 Neo: ఎడ్జ్ 50 నియో లాంచ్.. ఫీచర్లు మత్తెక్కించాయ్, ఈ ఆఫర్లు మీకోసమే!

Oppo Find X8 series: ఒప్పో దూకుడు.. వరుసగా నాలుగు ఫోన్లు, ఫీచర్లు కెవ్ కేక!

Motorola Edge 50 Neo: మోటో నుంచి కొత్త ఫోన్.. ఊహించని ఫీచర్లు, అద్భుతమైన కెమెరా క్వాలిటీ!

Oppo K Series: సత్తాచాటేందుకు మరో మోడల్ రెడీ.. ఒప్పో నుంచి ఊహించని బడ్జెట్ ఫోన్!

Cheapest Smartphones Under Rs 10000: ఉఫ్ ఉఫ్.. కేవలం రూ.10వేల ధరలోనే 5జీ ఫోన్‌లు, వదిలారో మళ్లీ దొరకవ్!

Big Stories

×