EPAPER

Sushil Kumar Modi Death: తుది శ్వాస విడిచిన బీజేపీ సీనియర్ నేత సుశీల్‌మోదీ..

Sushil Kumar Modi Death: తుది శ్వాస విడిచిన బీజేపీ సీనియర్ నేత సుశీల్‌మోదీ..

EX Bihar Deputy CM Sushil Kumar Passed Away: బీజేపీ సీనియర్ నేత, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్‌కుమార్ మోదీ ఇక లేరు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన గతరాత్రి న్యూఢిల్లీ ఎయిమ్స్‌లో తుదిశ్వాస విడిచారు.రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో ఆయన మరణించినట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.


72 ఏళ్ల సుశీల్ మోదీ గడిచిన ఆరునెలలుగా ఆయన క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. తనకు ఆరోగ్యం సహకరించని కారణంగా ప్రస్తుత లోక్‌సభ ఎన్నిలకు దూరంగా ఉంటున్నట్లు పార్టీ హైకమాండ్‌కు తెలిపారు. ఇదే విషయాన్ని సోషల్‌మీడియా వేదికగా తెలిపారు.

1973లో స్టూడెంట్ నేతగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన సుశీల్ మోదీ, బీహార్‌లో బీజేపీకి కీలకమైన నాయకుడు కూడా. దాదాపు 11 ఏళ్లపాటు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 1990 ఏడాది తొలిసారి పాట్నా నుంచి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అక్కడి నుంచి ఆయన వెనుదిరిగి చూడలేదు. ప్రస్తుతం బీజేపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఆయన పార్లమెంటరీ కమిటీలోని పలు ప్యానెళ్లకు ఛైర్మన్‌గా వ్యవహరించారు.


Also Read: గాలివాన బీభత్సం.. 9 మంది మృతి!

సుశీల్ మోదీ మరణవార్త తెలియగానే ప్రధాని మోదీ స్పందించారు. తన స్నేహితుడు సుశీల్ మరణవార్తపై తీవ్ర విచారం వ్యక్తం చేశారాయన. ముఖ్యంగా బీహార్‌లో తమ పార్టీ విజయం వెనుక ఆయన కీలక పాత్ర పోషించారన్నారు. జీఎస్టీ అమలుకు సంబంధించి ఆయన సేవలు మరిచిపోలేమన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు.

బీహార్ రాజకీయాల్లో గొప్ప మార్గదర్శకుడని కొనియాడారు కేంద్రమంత్రి అమిత్ షా. పేదలు, వెనుకబడిన వర్గాల ప్రయోజనాల కోసం ఆయన రాజకీయాలు అంకితమన్నారు. ఆయన మరణంతో బీహార్‌ రాజకీయాల్లో శూన్యత పూరించలేమని గుర్తుచేశారు. అటు ఆర్జేడీ అధ్యక్షుడు లాలూప్రసాద్ యాదవ్ కూడా స్పందించారు. ఆయన మృతికి సంతాపం తెలిపారు. 50 ఏళ్లగా పాట్నా యూనివర్సిటీ విద్యార్థి నేతగా ఉన్న సమయం నుంచి తనకు మంచి స్నేహితుడని గుర్తు చేసుకున్నారు.  సుశీల్‌మోదీ మృతికి బీహార్ సీఎం నితీష్‌కుమార్, బెంగాల్ సీఎం మమత, పలువురు రాజకీయ నేతలు సంతాపం తెలిపారు. మంగళవారం ఆయన అంత్యక్రియలు పాట్నాలో జరగనున్నాయి.

Also Read: ప్రియాంక కూతురు మిరయాపై ట్వీట్, కేసు నమోదు

Tags

Related News

Nipah virus: కేరళలో నిఫా వైరస్ విజృంభణ.. స్టూడెంట్ మృతి.. రాష్ట్రంలో ఆంక్షలు!

PM Modi: ఇది ట్రైలర్ మాత్రమే.. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ

yashwant Sinha: వాజ్ పేయి సిద్ధాంతాలతో.. పార్టీ పేరు ప్రకటించిన యశ్వంత్ సిన్హా

Delhi: ఢిల్లీకి తదుపరి సీఎం ఎవరు? రేసులో ఆరుగురు పేర్లు.. వీళ్లేనా?

Rajasthan Road Accident: రాజస్థాన్‌లో ట్రక్కును ఢీకొట్టిన తుఫాను.. ఎనిమిది మంది దుర్మరణం

Jammu Kashmir: గాంధీ, నెల్సన్ మండేలాతో బీజేపీ పోల్చుతున్న ఈ బుఖారీ ఎవరు?

PM Narendra Modi: మరో 6 వందే భారత్ రైళ్లు.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

Big Stories

×