EPAPER

CSK vs RR Match Highlights: తేలిపోయిన రాజస్థాన్.. ప్లే ఆఫ్‌కు చేరువలో చెన్నై..

CSK vs RR Match Highlights: తేలిపోయిన రాజస్థాన్.. ప్లే ఆఫ్‌కు చేరువలో చెన్నై..

IPL 2024 Match 61 CSK vs RR Highlights: చెన్నై ఎమ్ ఏ చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య చెన్నై జట్టు రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తు చేసింది. 142 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ మరో 10 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.


తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ తడబడుతూ ఇన్నింగ్స్ ఆరంభించింది. తొలి వికెట్ కు 43 పరుగులు జోడించిన వన్డే తరహా బ్యాటింగ్ ఆడటంతో వేగంగా పరుగులు చేయలేకపోయింది. ఈ సీజన్ లో మంచి ఫామ్‌లో ఉన్న రియాన్ పరాగ్ (47*, 35 బంతుల్లో ) రాణించడంతో 20 ఓవర్లో రాయల్స్ 5 వికెట్లు కోల్పోయి 141 పరుగుల చేసి చెన్నైముందు స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. రాజస్థాన్ బ్యాటర్లలో జైశ్వాల్ (24), బట్లర్ (21), జురెల్(28) పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో సిమర్జీత్ సింగ్ 3, తుషార్ దేశ్ పాండే 2 వికెట్లు తీసుకున్నారు.

142 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై జట్టు ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించింది. తొలి వికెట్ కు 3.4 ఓవర్లలో 32 పరుగులు జోడించింది. అందులో ఓపెనర్ రచిన్ రవీంద్ర చేసిన పరుగుల 27 కావడం విశేషం. రుతురాజ్ గైక్వాడ్(42*, 41 బంతుల్లో) కెప్టెన్ ఇన్నింగ్స్ కు తోడు డారిల్ మిచెల్(22) శివమ్ దూబె(18) రాణించడంతో చెన్నై సూపర్ కింగ్స్ ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని చేధించింది.


ఈ విజయంతో చెన్నై పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి చేరుకుంది. రాజస్థాన్ రాయల్స్ 12 మ్యాచుల్లో 8 విజయాలతో రెండో స్థానంలో కొనసాగుతుండగా, చెన్నై సూపర్ కింగ్స్ 13 మ్యాచుల్లో 7 విజయాలతో 3వ స్థానంలో కొనసాగుతుంది.

Also Read: ముగిసిన శకం.. రిటైర్మెంట్ ప్రకటించిన దిగ్గజ క్రికెటర్..

చెన్నై సూపర్ కింగ్స్ తన చివరి లీగ్ మ్యాచ్‌ను మే 18న రాయల్ ఛాలెంజర్స బెంగళూరుతో తలపడనుంది. ఇక రాజస్థాన్ రాయల్స్ మే 15న పంజాబ్ కింగ్స్‌తో, మే 19న కోల్ కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది.

Tags

Related News

Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ.. ఇండియా ‘ఏ’ టీం తొలి విజయం

Neeraj Chopra Diamond League: బ్రసెల్స్ డైమండ్ లీగ్ లో నీరజ్ చోప్రాకు రెండో స్థానం.. 2024లో ఏకంగా నాలుగుసార్లు టైటిల్ మిస్!

Matthew Short: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా ఓపెనర్..13ఏళ్ల రికార్డు బ్రేక్

Virat Kohli: కోహ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ షురూ..!

India vs Bangladesh 1st Test: ఒక్కటి గెలిస్తే చాలు.. 92 ఏళ్ల రికార్డు బ్రేక్

MS Dhoni: ధోనీ.. ఓసారి వాటర్ బాటిల్ తన్నేశాడు.. తెలుసా? : బద్రీనాథ్

Piyush Chawla: గంభీర్‌కి.. కొహ్లీ రికార్డులన్నీ తెలుసు: చావ్లా

Big Stories

×