EPAPER

Telugu States Weather Updates: తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్.. చల్లబడనున్న వాతావరణం!

Telugu States Weather Updates: తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్.. చల్లబడనున్న వాతావరణం!

Weather Updates in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో గత రెండు మూడు రోజుల నుంచి వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా కూడా వాతావరణ శాఖ ఓ శుభవార్త చెప్పింది. వచ్చే నాలుగు రోజులపాటు వర్షాలు ఇరు రాష్ట్రాల్లోనూ వర్షాలు కురవనున్నాయని పేర్కొన్నది. పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.


అయితే, గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం నెలకొన్నది. వారం రోజుల క్రితం వరకు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవగా, నాలుగైదు రోజులుగా వాతావరణం చల్లబడుతూ ఉంది. అప్పుడప్పుడు వర్షాలు కురుస్తున్నాయి. అయితే, తాజాగా వాతావరణ శాఖ మరో చల్లటి వార్తను తెలియజేసింది. మరో నాలుగు రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ద్రోణి ప్రభావం కారణంగా ఈ నెల 15 వరకు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నది.

తెలంగాణలోని నారాయణపేట, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, సంగారెడ్డి, సిరిసిల్ల, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్, మెదక్, జోగులాంబ, మంచిర్యాల జిల్లాల్లో నేడు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆ సమయంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశముందని పేర్కొన్నది. మరికొన్ని చోట్లా మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.


Also Read: వరద నీటిలో బ్రిడ్జి కింద చిక్కుకున్న దివ్యాంగుడు..

ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, విజయనగరం, పార్వతీపురం, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. మరికొన్ని చోట్లా మాత్రం మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొన్నది.

Tags

Related News

Inquiry on Sakshi Newspaper: జగన్ చిక్కినట్టేనా.. క్విడ్ ప్రోకో, సాక్షి పత్రిక కొనుగోళ్లపై

Tirupati Laddu: దేవుడిపై ప్రమాణానికి చంద్రబాబు కుటుంబం సిద్ధమా?

Free Gas Cylinders: భారీ శుభవార్త.. దీపావళి నుంచి ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ

Tirupati Laddu: తిరుపతి లడ్డూలపై సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు.. ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడారంటూ సీరియస్

Pavan Kalyan: ఈ వయసులోనూ ఆయన పనిచేస్తున్న తీరును చూసి నాకు ఆశ్చర్యం వేస్తుంది: పవన్ కల్యాణ్

Balineni: బ్రేకింగ్ న్యూస్.. జగన్ మోహన్ రెడ్డికి భారీ షాకిచ్చిన దగ్గరి బంధువు..

AP Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్

Big Stories

×