EPAPER

CSK Vs RR IPL 2024 Preview: చెన్నై గెలుస్తుందా..? నిలుస్తుందా..? నేడు రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్!

CSK Vs RR IPL 2024 Preview: చెన్నై గెలుస్తుందా..? నిలుస్తుందా..? నేడు రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్!

IPL 2024 61 Match – Chennai Super Kings vs Rajasthan Royals Preview: ఐపీఎల్ 2024 సీజన్ లో నేడు అత్యంత రసవత్తరమైన మ్యాచ్ జరగనుంది. చెన్నై వర్సెస్ రాజస్థాన్ మధ్య చిదంబరం స్టేడియంలో మధ్యాహ్నం 3.30కి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక్కడ టెక్నికల్ గా పాయింట్ ఏమిటంటే రాజస్థాన్ ఇప్పుడు 16 పాయింట్లతో పటిష్టమైన స్థితిలోనే ఉంది. కానీ ఇది గెలిచేస్తే హైవే మీద విజిల్ వేసుకుంటూ ప్లే ఆఫ్ కి వెళ్లిపోతుంది.


మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ ని చూస్తే పడుతూ లేస్తూ ఆడుతోంది.  ఒకటి ఓడిపోతే, ఒకటి గెలుస్తోంది. ప్రస్తుతం 12 మ్యాచ్ లు ఆడి 12 పాయింట్లతో టాప్ 4లో ఉంది. ఇక్కడ నుంచి మిగిలిన రెండు మ్యాచ్ లు వరుసగా గెలవాల్సి ఉంది. లేదు ఒకటే గెలిచిందంటే, వెనుక ఆర్సీబీ, ఢిల్లీ, లక్నో అన్నీ తరుముకుంటూ వస్తున్నాయి. అందుకని నేడు రాజస్థాన్ తో మ్యాచ్ జీవన్మరణ పోరు అని చెప్పాలి.

రుతురాజ్ గైక్వాడ్, డేరీ మిచెల్, రవీంద్ర జడేజా, ధోనీ, శివమ్ దుబె అందరూ బాగా ఆడుతున్నారు. బౌలింగులో దీపక్ చాహర్, పతిరణ, తుషార్, శార్దూల్ ఠాగూర్ వీళ్లందరూ బ్రహ్మండంగా బౌలింగు చేస్తున్నారు.


Also Read: ప్లే ఆఫ్ కు చేరిన తొలి జట్టుగా కోల్ కతా.. ఎప్పటిలా ఓడి, మూలన కూర్చున్న ముంబై

ఇక రాజస్థాన్ రాయల్స్ విషయానికి వస్తే తను నెంబర్ 2 ప్లేస్ లో ఉంది. మొన్నటి వరకు నెంబర్ వన్ గా ఉన్నది, కోల్ కతాకి అప్పగించి తను రెండులో పడిపోయింది. వరుసగా ఆఖరి రెండు మ్యాచ్ లు ఓడిపోయింది. అందుకే ఇప్పుడు చెన్నయ్ కి గెలిచేందుకు అవకాశాలున్నాయి. యశస్వి జైశ్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్, రియాన్ పరాగ్ అందరూ అదరగొడుతున్నారు. బౌలింగు ఎటాక్ కూడా బాగుంది. ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, చాహల్, అశ్విన్ అందరూ మ్యాచ్ ని నిలబెడుతున్నారు.

మరి ఈ రెండు జట్లకు కీలకం కానున్న మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారో వేచి చూడాల్సిందే.

Related News

Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ.. ఇండియా ‘ఏ’ టీం తొలి విజయం

Neeraj Chopra Diamond League: బ్రసెల్స్ డైమండ్ లీగ్ లో నీరజ్ చోప్రాకు రెండో స్థానం.. 2024లో ఏకంగా నాలుగుసార్లు టైటిల్ మిస్!

Matthew Short: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా ఓపెనర్..13ఏళ్ల రికార్డు బ్రేక్

Virat Kohli: కోహ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ షురూ..!

India vs Bangladesh 1st Test: ఒక్కటి గెలిస్తే చాలు.. 92 ఏళ్ల రికార్డు బ్రేక్

MS Dhoni: ధోనీ.. ఓసారి వాటర్ బాటిల్ తన్నేశాడు.. తెలుసా? : బద్రీనాథ్

Piyush Chawla: గంభీర్‌కి.. కొహ్లీ రికార్డులన్నీ తెలుసు: చావ్లా

Big Stories

×