EPAPER

Rishabh Pant: ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్.. రిషబ్ పంత్‌పై సస్పెన్షన్ వేటు..

Rishabh Pant: ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్.. రిషబ్ పంత్‌పై సస్పెన్షన్ వేటు..

Rishabh Pant Handed One Match Suspension: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్‌కు షాక్ తగిలింది. ఐపీఎల్ గవర్నింగ్ బాడీ పంత్‌పై ఒక మ్యాచ్‌ సస్పెన్షన్ వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ శనివారం మధ్యాహ్నం ఇక ప్రకటన విడుదల చేసింది.


12 మ్యాచుల్లో 6 విజయాలు, 6 పరాజయాలతో పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ తదుపరి మ్యాచుల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. కాగా ఈ నెల 12న ఆర్సీబీతో జరగనున్న మ్యాచ్‌కు పంత్ దూరమవ్వడం ఢిల్లీకి పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు.

ఈ నెల 7వ తేదీన రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ స్లో ఓశవర్ రేట్ నమోదు చేయడంతో ఐపీఎల్ గవర్నింగ్ బాడీ పంత్‌పై 30 లక్షల జరిమానాతో పాటు ఒక మ్యాచ్ సస్పెన్షన్ వేటు వేసింది.


Also Read: చెన్నైపై విజయం.. గిల్‌కు భారీ షాక్..

ఇప్పటికే పంత్‌పై ఐపీఎల్ గవర్నింగ్ బాడీ రెండు సార్లు జరిమానా విధించింది. మొదటి సారి చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో పంత్‌కు జరిమానా విధించింది బీసీసీఐ. ఆ తరువాత కోల్ కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా పంత్‌కు రెండో సారి జరిమనా విధించింది బీసీసీఐ. తాజాగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ స్లో ఓవర్ రేట్ నమోదు చేయడంతో బీసీసీఐ ముచ్చటగా మూడోసారి జరిమానా విధించి, ఒక మ్యాచ్ సస్పెండ్ చేసింది.

ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు గట్టి షాక్ తగిలింది. చెన్న సూపర్ కింగ్స్‌పై విజయం సాధించి మంచి ఊపు మీదున్న గుజరాత్‌కు ఐపీఎల్ గవర్నింగ్ బాడీ జరిమానా విధించింది. శుక్రవారం అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ నమోదు చేయడంతో.. గుజరాత్ కెప్టెన్ గిల్‌కు 12 లక్షలు, ప్లేయింగ్ IX, ఇంపాక్ట్ ప్లేయర్‌కు 6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధిస్తన్నట్లు బీసీసీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. మరో మ్యచ్‌లో స్లో ఓవర్ రేట్ నమోదు చేస్తే గిల్‌పై కూడా ఒక మ్యచ్ నిషేదం పడనుంది.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×