EPAPER

Botsa Satyanarana: బాబు భాష ఘోరంగా ఉంది: మంత్రి బొత్స

Botsa Satyanarana: బాబు భాష ఘోరంగా ఉంది: మంత్రి బొత్స

Minister Botsa Satyanarana Sensational comments: ప్రచార సభలలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మాట్లాడే భాష ఘోరంగా ఉందంటూ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బాబు భాష ఘోరంగా ఉంది, ఆ భాషను అదుపులో పెట్టుకుంటే మంచిదని, నోరు జారి మాట్లాడి మీ స్థాయిని దిగజార్చుకోవొద్దంటూ చంద్రబాబుకు మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు.


బైబై, సిద్ధం పదాలు తమవని, వాటిని కాపీ కొట్టి వాడుకుంటున్నారని ఆయన విపక్షాలపై ఫైరయ్యారు. ఆన్ గోయింగ్ లో ఉండే పథకాలను లబ్ధిదారులకు అందకుండా ఎలక్షన్ కమిషన్ ద్వారా చంద్రబాబు అడ్డుకోవడం దారుణమన్నారు. పేదలంటే మీకు ఎందుకు అంత కోపమంటూ చంద్రబాబుపై మంత్రి ఫైరయ్యారు. ప్రతి దానిని రాజకీయంగా చూడొద్దని.. పేదలకు జరిగే మంచికి అడ్డురావడం సరికాదన్నారు. ఎన్నికల అనంతరం మే 14న లబ్ధిదారులకు రావాల్సిన పథకాలు అమలవుతాయన్నారు. లబ్ధిదారులెవరూ ఆధైర్యపడొద్దన్నారు.

ఓడిపోతాననే ఫ్రస్టేషన్ లో చంద్రబాబు ఉన్నారని, అందుకే ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావట్లేదన్నారు. చంద్రబాబు తానా అంటే పవన్ కల్యాణ్ తందానా అంటున్నారన్నారు. కూటమితో తమకు సంబంధం లేదన్నట్టుగా బీజేపీ వ్యవహరిస్తుందని ఆయన అన్నారు. ఎమ్మెల్యేగా కూడా గెలవలేని లోకేశ్ కు సీఎం జగన్ కోసం మాట్లాడే స్థాయి లేదన్నారు. చివరకు మేనిఫెస్టోను కూడా కాపీ కొట్టారని మంత్రి బొత్స సీరియస్ అయ్యారు. సీఎం జగన్ దెబ్బకు చంద్రబాబు తన ఒరిజినాలిటీని కోల్పోయి కాపీ కొట్టే చంద్రబాబుగా తయారయ్యారని ఆయన అన్నారు.


ఇదిలా ఉంటే.. నంద్యాలలో నిర్వహించిన రోడ్ షోలో చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. సీఎం జగన్ శవ రాజకీయాలు చేస్తున్నారన్నారు. జాబు రావాలంటే కూటమి ప్రభుత్వం రావాలని.. యువత అంతా సైకిల్ ఎక్కాలని ఆయన పిలుపునిచ్చారు. తాము అధికారంలోకి రాగానే డీఎస్సీ వేస్తామన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై మాట్లాడుతూ.. వారసత్వం నుంచి భూమిపై సైకో ఫొటో ఉండకూడదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: భారత్ జోడో యాత్రకు స్ఫూర్తి రాజశేఖర్ రెడ్డి పాదయాత్రే.. కడప బహిరంగసభలో రాహుల్

ఇటు జగన్ కైకలూరు, చిలకలూరిపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలలో పాల్గొన్న సీఎం జగన్ కూడా చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. 14 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా చేశానని చెప్పుకునే చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తొస్తుందా? అని ఆయన అన్నారు. గత ఐదేళ్ల పాలనలో తాము విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని చెప్పారు. గతంలో ఇలాంటి పథకాలు అమలయ్యాయా? అంటూ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే కొండ చిలువ నోట్లో తల పెట్టినట్టేనని ఆయన అన్నారు. ప్రస్తుతం అమలవుతున్న పథకాలన్నీ ఉండాలంటే జగన్ కు ఓటు వేయాలని ఆయన అన్నారు.

Tags

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×