EPAPER

Dust Strom : దుమ్ము తుఫాను.. ఇద్దరు మృతి.. విమాన రాకపోకలు నిలిపివేత

Dust Strom : దుమ్ము తుఫాను.. ఇద్దరు మృతి.. విమాన రాకపోకలు నిలిపివేత

Dust Strom in Delhi : ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరాల జాబితా తీస్తే.. అందులో టాప్ లో ఉండేది మనదేశ రాజధాని ఢిల్లీనే. అక్కడ వాయుకాలుష్యం అంత ఉంటుంది. శీతాకాలంలో అయితే.. ప్రజలు ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంమేనని చెప్పాలి. మంచు పట్టిందో, వాయు కాలుష్యం అలుముకుందో తెలియనంతలా ఉంటుంది. ఇక వేసవిలో అయితే.. ఎంత వేడి ఉంటుందో. ఓ పక్క కాలుష్యం, మరోపక్క వేడికి ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.


ఇప్పుడు దేశ రాజధానిలో దుమ్ముతుఫాను అలజడి రేపింది. తీవ్రమైన దుమ్ముతో కూడిన బలమైన గాలులు.. ఢిల్లీని తాకడంతో అక్కడి వాతావరణంలో ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి. శుక్రవారం ఢిల్లీ – ఎన్సీఆర్ ప్రాంతంలో దుమ్ము తుఫానుతో కూడిన వర్షం కురిసింది. ఇద్దరు మృతి చెందారు. జనజీవనం స్తంభించింది. విమాన రాకపోకలు ఆగిపోయాయి. ఉన్నట్లుండి ఈదురుగాలులు వీయడంతో చెట్లు కూలిపోయాయి. 152 మంది చెట్లు కూలిపోయాయి.. తొలగించండి అంటూ కాల్స్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Also Read : బెజవాడను ముంచెత్తిన వాన.. నేడు కూడా..


వర్షం, ఈదురుగాలుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ఎక్కడికక్కడే ట్రాఫిక్ నిలిచిపోయింది. దుమ్ము తుఫాను కారణంగా.. ఢిల్లీకి రావల్సిన 9 విమానాలను జైపూర్ కు మళ్లించినట్లు ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. చెట్లు, గోడ కూలి ఇద్దరు వ్యక్తులు మరణించగా.. 23 మంది గాయపడ్డారు. శనివారం ఉదయం ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టి విరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలను తొలగించారు.

కాగా.. దేశవ్యాప్తంగా నిన్నటి నుంచి హీట్ వేవ్ తగ్గుతుందని ఐఎండీ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షం కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఏపీలోనూ నిన్న భారీ వర్షం కురిసింది. విజయవాడ, పరిసర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి ప్రజలు ఉపశమనం పొందారు.

Tags

Related News

Nipah virus: కేరళలో నిఫా వైరస్ విజృంభణ.. స్టూడెంట్ మృతి.. రాష్ట్రంలో ఆంక్షలు!

PM Modi: ఇది ట్రైలర్ మాత్రమే.. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ

yashwant Sinha: వాజ్ పేయి సిద్ధాంతాలతో.. పార్టీ పేరు ప్రకటించిన యశ్వంత్ సిన్హా

Delhi: ఢిల్లీకి తదుపరి సీఎం ఎవరు? రేసులో ఆరుగురు పేర్లు.. వీళ్లేనా?

Rajasthan Road Accident: రాజస్థాన్‌లో ట్రక్కును ఢీకొట్టిన తుఫాను.. ఎనిమిది మంది దుర్మరణం

Jammu Kashmir: గాంధీ, నెల్సన్ మండేలాతో బీజేపీ పోల్చుతున్న ఈ బుఖారీ ఎవరు?

PM Narendra Modi: మరో 6 వందే భారత్ రైళ్లు.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

Big Stories

×