EPAPER
Kirrak Couples Episode 1

Suryakumar : కొత్త రికార్డులు సృష్టించిన సూర్య

Suryakumar : కొత్త రికార్డులు సృష్టించిన సూర్య

Suryakumar : T20ల్లో సూర్యకుమార్ యాదవ్ రికార్డుల రారాజులా మారుతున్నాడు. మ్యాచ్ మ్యాచ్‌కీ అతని ఖాతాలో కొత్త రికార్డులు వచ్చిపడుతున్నాయి. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో T20లో 49 బంతుల్లోనే సూపర్ సెంచరీ చేసిన సూర్య… అనేక రికార్డులు అందుకున్నాడు.


న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 సిక్సర్లు, 11 ఫోర్లతో 51 బంతుల్లోనే 111 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచిన సూర్య… కివీస్ గడ్డపై T20ల్లో శతకం సాధించిన తొలి భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇక ఈ సెంచరీ T20 మ్యాచ్‌ల్లో సూర్యకు రెండోది. ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో రెండు సెంచరీలు సాధించిన రెండో టీమిండియా బ్యాటర్‌గా… రోహిత్‌ శర్మ రికార్డును సమం చేశాడు… సూర్యకుమార్. ఇంతకుముందు 2018లో రోహిత్ శర్మ ఈ ఘనత సాధించాడు.

T20 మ్యాచ్‌ల్లో ఓ క్యాలెండర్‌ ఇయర్‌లో ఎక్కువసార్లు 50 లేదా అంతకన్నా ఎక్కువ పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు… సూర్య. ఇప్పటివరకూ 10 హాఫ్ సెంచరీలతో సెకండ్ ప్లేస్ లో ఉన్న పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌ను మూడో స్థానానికి నెట్టి… 11 హాఫ్ సెంచరీలతో రెండో స్థానానికి చేరుకున్నాడు… సూర్య. ఇంతకుముందు పాక్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్ ఒక క్యాలెండర్ ఇయర్లో 13 హాఫ్ సెంచరీలు కొట్టి టాప్‌ ప్లేస్‌లో ఉన్నాడు. ఇక టీమిండియా తరఫున T20ల్లో అత్యధిక సెంచరీలు బాదిన బ్యాటర్‌గా కేఎల్‌ రాహుల్‌ రికార్డును సమం చేశాడు… సూర్య. రాహుల్‌ 72 మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు చేయగా, సూర్యకుమార్‌ 41 మ్యాచ్‌ల్లోనే 2 సెంచరీలు బాదాడు. ఈ లిస్టులో 4 T20 సెంచరీలతో రోహిత్‌ శర్మ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.


అంతేకాదు.. T20ల్లో తన తొలి రెండు సెంచరీలను విదేశాల్లోనే చేశాడు… సూర్య. నాటింగ్‌హమ్‌లో ఇంగ్లండ్ మీద 117 రన్స్ చేసిన స్కై… ఇప్పుడు న్యూజిలాండ్‌పై 111 రన్స్ బాదాడు. ఇది కూడా ఓ రికార్డే.

మరోవైపు… న్యూజిలాండ్‌తో రెండో T20లో దీపక్‌ హుడా కూడా అరుదైన రికార్డు అందుకున్నాడు. కేవలం 10 పరుగులే ఇచ్చి 4 వికెట్లు తీసిన హుడా… T20ల్లో న్యూజిలాండ్‌పై అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన తొలి భారత బౌలర్ గా రికార్డులకెక్కాడు.

Related News

Heavy Rain: రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. కీలక సూచనలు!

Animal Oil Making: జంతుల కొవ్వుతో నూనె ఎలా తయారు చేస్తారు? కల్తీని ఎలా గుర్తించాలి? ఒళ్లుగగూర్పాటు కలిగించే వాస్తవాలు!

Rhea Singha: ‘మిస్ యూనివర్స్ ఇండియా 2024’.. ఎవరో తెలుసా?

Weather Update: బిగ్ అలర్ట్.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులు భారీ వర్షాలు

Devara : దేవర ట్రైలర్ వచ్చేసింది.. ఎన్టీఆర్ అంటే ఫైర్.. అదిరిపోయిన విజువల్స్…

Iran coal mine: ఇరాన్‌లో ఘోర విషాదం.. భారీ పేలుడుతో 30 మంది మృతి

Illegal Hookah: పైకి బోర్డు కేఫ్.. లోపలకి వెళ్లి చూస్తే షాక్.. గుట్టు చప్పుడు కాకుండా ఏకంగా!

Big Stories

×