Get Oppo Enco Air 3 Pro Earbuds at Rs 194 in Amazon Summer Sale 2024: స్మార్ట్‌ఫోన్ వినియోగం రోజురోజుకు విపరీతంగా పెరుగుతుంది. వీటితో పాటుగా స్మార్ట్‌ఫోన్ కనెక్టెడ్ యాక్సరీస్ను యువత ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. గతంలో మ్యూజిక్ వినాలంటే వైర్డ్ ఇయర్‌ఫోన్స్ ఉపయోగించేవారు. అప్పుడు మీరు కచ్చితంగా ఆ గ్యాడ్జెట్‌ను మీ దగ్గరలోనే ఉంచుకోవాలి. ఇది కాస్త ఇబ్బందిగానే ఉండేది. దీంతో బ్లూటూత్ ఆధారంగా పనిచేసే ఇయర్‌బడ్స్ వచ్చాయి. యువత వీటిని ఎక్కువగా కొనుగోలు చేయడానికి ఇంటరెస్ట్ చూపుతున్నారు.
ఈ క్రమంలోనే ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‌లో భాగంగా Oppo Enco Air 3 Pro ఇయర్‌బడ్స్‌పై భారీ ఆఫర్ ప్రకటించింది. జూలై 2023లో Oppo ఈ ఇయర్‌బడ్స్‌ను రూ. 4999తో విడుదల చేసింది. అయితే ఇప్పుడు ఈ బడ్స్‌పై రూ.1000తో డిస్కౌంట్ ప్రకటించింది. దీని ప్రకారం రూ. 3,999 ఖర్చు చేయగలిగితే ఈ Enco Air 3 Pro TWSను దక్కించుకోవచ్చు. అంతేకాకుండా నెల EMI కింద రూ.194 చెల్లించి కొనుగోలు చేయవచ్చు. ఈ అమెజాన్ ఆఫర్ గురించి పూర్తి సమాచారం తెలుసుకోండి.
Also Read: వన్‌ప్లస్ ఫోన్లపై ఆఫర్లే ఆఫర్లు.. ఒక్కో వేరియంట్‌పై వేలల్లో డిస్కౌంట్!
Oppo Enco Air 3 Pro ఇయర్‌బడ్స్ రూ. 4999తో విడుదల అయ్యాయి. కాగా ఇప్పుడు అమెజాన్ దీనిపై రూ.1000 డిస్కౌంట్ ప్రకటించింది. రూ.3,999కి వీటిని కొనుగోలు చేయవచ్చు. ఈ వైర్లెస్ ఇయర్ఫోన్లు బ్లూటూత్ 5.3 LC3 AAC SBC, LDAC ఆడియో కోడెక్‌లను సపోర్ట్ చేస్తాయి.
Oppo Enco Air 3 Pro డిజైన్ విషయానికి వస్తే.. ఈ ఇయర్‌బడ్స్ Apple AirPodల మాదిరిగానే ఉంటాయి. ఇన్-ఇయర్ బడ్స్, పెబుల్-షేప్ ఛార్జింగ్ కేస్‌తో ఉంటుంది. ఇది వెదురు ఫైబర్‌తో తయారు చేయబడిన ప్రత్యేకమైన 12.4mm డ్రైవర్లను కలిగి ఉంది. ఈ వైర్లెస్ ఇయర్ఫోన్లు బ్లూటూత్ 5.3, LC3, AAC, SBC మరియు LDAC ఆడియో కోడెక్‌లకు సపోర్ట్ ఇస్తాయి. అదనంగా ఈ బడ్స్ హై-రెస్ ఆడియో కోసం తీసుకొచ్చారు.
Also Read: వాట్సాప్ నుంచి షాకింగ్ ఫీచర్.. ఇక తప్పు చేస్తే శిక్ష తప్పదు!
Oppo నుండి వచ్చిన ఈ ఇయర్‌ఫోన్‌లో స్పేషియల్ ఆడియో టెక్నాలజీ కూడా ఉంది. ఇది కాకుండా 49 డెసిబుల్స్ వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC)తో బ్యాటరీ గురించి మాట్లాడితే Enco Air 3 Pro ఒక్కసారి పూర్తి ఛార్జ్‌పై 30 గంటల బ్యాటరీ లైఫ్ పొందుతుంది దీనిలో ఇయర్‌బడ్‌లు 7 గంటల పాటు ఉంటాయి.