EPAPER

Bharat Biotech on Covaxin: మా వ్యాక్సిన్ తో సేఫే: ప్రకటించిన భారత్ బయోటెక్!

Bharat Biotech on Covaxin: మా వ్యాక్సిన్ తో సేఫే: ప్రకటించిన భారత్ బయోటెక్!

Bharat Biotech About Covaxin Vaccine: కోవిడ్ వ్యాక్సిన్ గా వచ్చిన కోవిషీల్డ్ తో ఆరోగ్యంపై దుష్ర్పభావాలు ఉంటాయని.. ఆస్ట్రాజెనెకా అంగీకరించడంతో.. ప్రపంచమంతా ఒక్కసారిగా ఆందోళనకు గురైంది. కోవిడ్ వ్యాక్సిన్లుగా కోవిషీల్డ్, కొవాగ్జిన్ లు రాగా.. కోవిషీల్డ్ వ్యాక్సిన్ నే ఎక్కువమందికి వేశారు. దాంతో అందరూ కంగారుపడ్డారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్నవారంతా ఏమవుతుందోనని భయపడుతున్నారు. రక్తం గడ్డకట్టి.. అది హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ కు కారణమవుతుందని ఆస్ట్రాజెనెకా చెప్పడంతో.. ఇతర వ్యాక్సిన్లు తీసుకున్నవారు కూడా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే.. కోవిడ్ కు తయారు చేసిన వ్యాక్సిన్ దాదాపు అదే ఫార్ములాతో ఉండటమే ఈ ఆందోళనకు కారణం.


అయితే.. భారత్ బయోటెక్ తమ వ్యాక్సిన్ తో ఎలాంటి దుష్ర్పభావాలు ఉండవని చెప్పింది. కొవాగ్జిన్ తో సైడ్ ఎఫెక్ట్స్ ఉండదని తెలిపింది. లైసెన్స్ కోసం 27 వేల కంటే ఎక్కువ సబ్జెక్టుల్లో ప్రయోగించామని, ట్రయ్ల్స్ మోడ్ లోనే లిమిటెడ్ గా వాడేందుకు లైసెన్స్ వచ్చిందని పేర్కొంది. రక్తం గడ్డకట్టడం, టీటీఎస్, వీఐటీటీ, పెరికార్డిటిస్, థ్రోంబోసైటోపెనియా, మయోకార్డిటిస్ వంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని తేల్చి చెప్పంది. కోవాగ్జిన్ యొక్క భద్రతను ఆరోగ్య మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం కూడా మూల్యాంకనం చేసిందని తెలిపింది.

Also Read: కోవిడ్ వ్యాక్సిన్ కు గడ్డకడుతున్న రక్తం.. నిజమేనని అంగీకరించిన ఆస్ట్రాజెనెకా..!


సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII)చే తయారు చేయబడిన ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ భారతదేశంలో కోవిషీల్డ్‌గా విక్రయించబడింది. యూనివర్శిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్ సహకారంతో అభివృద్ధి చేసిన టీకా కారణంగా.. సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని, మరణాలు కూడా సంభవించాయని ఏప్రిల్ 2021లో జామీ స్కాట్ అనే బ్రెయిన్ స్ట్రోక్ బాధితుడు ఈ పిటిషన్ వేశాడు. రక్తం గడ్డకట్టడం, ప్లేట్‌లెట్ గణనలతో కూడిన థ్రాంబోసైటోపెనియా సిండ్రోమ్ (TTS)తో థ్రోంబోసిస్ అని పిలువబడే అరుదైన దుష్ప్రభావం చూపుతుంది.

Tags

Related News

Arthritis: కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా ?

Health Tips: ఖర్జూర, పాలు కలిపి తింటే బోలెడు ప్రయోజనాలు

Walking: ప్రతి రోజు 30 నిమిషాలు నడవడం వల్ల ఈ రోగాలన్నీ దూరం

Copper Utensils: రాగి పాత్రలు మెరిసిపోవాలా.. అయితే ఇలా చేయండి

Gastric Problems: గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా ? వీటితో క్షణాల్లోనే ఉపశమనం

Natural Scrub: నేచురల్ స్క్రబ్స్‌తో గ్లోయింగ్ స్కిన్

Skin Care: గ్లోయింగ్ స్కిన్ కోసం ఇవి తప్పక ట్రై చేయండి

Big Stories

×