EPAPER

CM Revanth Reddy: రిజర్వేషన్ల రద్దే.. ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతం: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: రిజర్వేషన్ల రద్దే.. ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతం: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: రిజర్వేషన్లు రద్దు చేయడమే ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతం అని.. బీజేపీ దాన్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎస్సీ, ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేయాలనేదే బీజేపీ ప్రధాన అజెండా అని విమర్శించారు.


‘ఆర్ఎస్ఎస్ రాజకీయ కార్యచరణ పేరే బీజేపీ. ఆర్ఎస్ఎస్ కార్యచరణ ఎన్నుకుంది. రిజర్వేషన్ల రద్దు దేశస్థాయిలో చర్చకు రావడంతో బీజేపీ కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. దీనిపై నేను మాట్లాడగానే నా మీద ఢిల్లీలోని కేంద్ర హోంశాఖ ఫిర్యాదు చేసి అక్రమ కేసులు పెట్టింది. దీనిపై వివరణ ఇవ్వాలని హుకుం జారీ చేసింది. ఢిల్లీ పోలీసుల్ని ప్రయోగిస్తే నేను లొంగిపోను.

రిజర్వేషన్ల రద్దులో భాగంగానే 2000 ఫిబ్రవరి 22న ఎన్డీఏ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాజ్యాంగ సవరణపై అప్పటి ప్రధాని వాజ్ పేయి ప్రభుత్వం గెజిట్ ఇచ్చింది. మీరు రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నారు. దీనిలో భాగంగానే కమిషన్ ఏర్పాటు చేస్తూ మొదటిసారిగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. 2002లో ఆ కమిషన్ నివేదిక ఇచ్చింది. రాజ్యాంగాన్ని ఎలా సవరించాలో ఆ నివేదికలో ఉంది. దళితులకు హక్కులులేని హిందూ సమాజం మేలని గోల్వాల్కర్ అందులో రాశారు. ఎన్జీ బైద్య అనే ఆర్ఎస్ఎస్ ఫిలాసఫర్.. 2015లో కులపరమైన రిజర్వేషన్లు రద్దు చేయాలని రాశాడు. 2004 లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో.. రాజ్యాంగాన్ని మార్చే అవకాశం బీజేపీకి లేకుండా పోయింది’ అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.


‘ఈసారి రాజ్యాంగాన్ని మార్చడానికే 400 సీట్లు రావాలని చూస్తున్నారు. రాజ్యాంగాన్ని మార్చాలంటే లోక్ సభలో 2/3 మెజార్టీ కావాలి. 50 శాతం రాష్ట్రాలు కూడా ఆమోదం తెలపాలి. అందులే చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాల్ని బీజేపీ కూల్చేసింది. దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలనేది.. ఆర్ఎస్ఎస్ మౌలిక సిద్ధాంతం. మీ ఆలోచన ఏంటో చెప్పిండి. గతంలో మీ పార్టీ మంత్రులు మాట్లాడిన మాటలు మర్చిపోతున్నారు.

మేం రిజర్వేషన్లు పెంచాలని భావిస్తుంటే.. బీజేపీ రిజర్వేషన్లు తొలగించాలని చూస్తోంది. బీజేపీకి ఓటు వేస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారు. ఇండియా కూటమి అయితే రిజర్వేషన్లను కాపాడుతుంది. బీజేపీ అబద్ధాల యూనివర్సిటీ.. ఆ అబద్ధాల యూనివర్సిటీకి వైస్ ఛాన్స్ లర్ మోదీ, రిజిస్ట్రార్ అమిత్ షా.

రిజర్వేషన్లు ఇచ్చిన పార్టీగా నేను దాన్ని కాపాడాలి. ఎన్నికల్లో నెగ్గడానికి ఢిల్లీ పోలీసులను ప్రయోగిస్తున్నారు. మోదీ వాళ్లకు అండగా ఉంటున్నారు. రిజర్వేషన్ల గురించి మాట్లాడితే లోపల వేస్తామంటున్నారు. ఢిల్లీ సుల్తానులు నేను లొంగిపోతా అనుకుంటున్నారు. ఫేక్ వీడియోలు సీఎం సృష్టిస్తారా..?’ అంటూ మోదీ, అమిత్ షాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×