EPAPER

Delhi CM Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు మరో బిగ్ షాక్.. హెల్త్ పిటిషన్‌ను కొట్టివేసిన రౌస్ అవెన్యూ కోర్టు!

Delhi CM Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు మరో బిగ్ షాక్.. హెల్త్ పిటిషన్‌ను కొట్టివేసిన రౌస్ అవెన్యూ కోర్టు!

Delhi court rejects Arvind Kejriwal’s plea: లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం జైలులో ఉన్న ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు మరోసారి భారీ షాక్ తగిలింది. కేజ్రీవాల్ కోర్టులో దాఖలు చేసిన హెల్త్ పిటిషన్ ను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది.


డయాబెటిక్ వైద్యం కోసం ప్రతిరోజు 15 నిముషాల పాటు వర్చువల్ గా డాక్టర్ కన్సల్టేషన్, ఇన్సులిన్ తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ కేజ్రివాల్ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే కేజ్రీవాల్ షుగర్ లెవల్స్ సాధారణంగానే ఉన్నాయని, డాక్టర్లు సూచించిన డైట్ అందిస్తున్నామని, అరెస్ట్ కు ముందే ఇన్సులిన్ తీసుకోవడం ఆపేసారని తీహార్ జైలు అధికారులు కోర్టులో వెల్లడించారు. దీంతో కేజ్రీవాల్ హెల్త్ పిటిషన్ ను కోర్టు కొట్టి వేసింది.

జైలు అధికారుల మాటలను పరిగణలోకి తీసుకున్న కోర్టు.. కేజ్రీవాల్‌కు అవసరమైన వైద్యాన్ని జైలులో అందించాలని తీహార్ జైలు అధికారులకు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరీ బవేజా ఆదేశించారు. జైలులో కేజ్రీవాల్‌కు ప్రత్యేక సంప్రదింపులు అవసరమైతే, ఎయిమ్స్ డైరెక్టర్ ఏర్పాటు చేసే మెడికల్ బోర్డును సంప్రదించాలని కోర్టు తీహార్ జైలు అధికారులకు సూచించింది.


కేజ్రీవాల్‌కు ఇన్సులిన్ అందించడంపై ఎయిమ్స్ మెడికల్ బోర్డు నిర్ణయం తీసుకుంటుందని కోర్టు తెలిపింది. కేజ్రీవాల్‌కు డైట్, వ్యాయామ ప్రణాళికను మెడికల్ బోర్డు నిర్దేశిస్తుందని వెల్లడించింది. మెడికల్ బోర్డు సూచించిన ఆహారం ప్రకారం కేజ్రీవాల్ ఇంట్లో వండిన ఆహారాన్ని తీసుకోవచ్చని కోర్టు స్పష్టం చేసింది.

మెడికల్ బోర్డు కేజ్రీవాల్‌కు డైట్‌ని సూచించే వరకు, అతని కుటుంబం ఇంట్లో వండిన ఆహారాన్ని అందించవచ్చని, అయితే ఇది ఖచ్చితంగా అతని ప్రైవేట్ డాక్టర్ డైట్ చార్ట్ ప్రకారం , ఏప్రిల్ 01న కోర్టు అనుమతించినదాని ప్రకారం ఉండాలని పేర్కొంది. వైద్యపరంగా సూచించిన డైట్‌లో ఎలాంటి తేడాలు లేకుండా చూడాలని జైలు అధికారులను న్యాయమూర్తి ఆదేశించారు.

Also Read: హైకోర్టు సంచలన తీర్పు.. ఉద్యోగాలు కోల్పోనున్న 25,753 టీచర్లు

కేజ్రీవాల్ డైట్ పాటించని పక్షంలో ఆ విషయాన్ని వెంటనే కోర్టు దృష్టికి తీసుకురావాలని జైలు అధికారులను రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశించింది. కేజ్రీవాల్‌కు ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా అనేదానిపై తన నివేదికను త్వరగా సమర్పించాలని ఎయిమ్స్ మెడికల్ బోర్డును రౌస్ అవెన్యూ కోర్టు కోరింది. భవిష్యత్తులో ఏదైనా నిపుణుడి ద్వారా కేజ్రీవాల్‌కు వైద్యపరమైన చికిత్స అవసరమైతే, ఈ విషయంలో జైలు అధికారులు మెడికల్ బోర్డుతో సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.

Related News

Nipah virus: కేరళలో నిఫా వైరస్ విజృంభణ.. స్టూడెంట్ మృతి.. రాష్ట్రంలో ఆంక్షలు!

PM Modi: ఇది ట్రైలర్ మాత్రమే.. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ

yashwant Sinha: వాజ్ పేయి సిద్ధాంతాలతో.. పార్టీ పేరు ప్రకటించిన యశ్వంత్ సిన్హా

Delhi: ఢిల్లీకి తదుపరి సీఎం ఎవరు? రేసులో ఆరుగురు పేర్లు.. వీళ్లేనా?

Rajasthan Road Accident: రాజస్థాన్‌లో ట్రక్కును ఢీకొట్టిన తుఫాను.. ఎనిమిది మంది దుర్మరణం

Jammu Kashmir: గాంధీ, నెల్సన్ మండేలాతో బీజేపీ పోల్చుతున్న ఈ బుఖారీ ఎవరు?

PM Narendra Modi: మరో 6 వందే భారత్ రైళ్లు.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

Big Stories

×