EPAPER

CM Revanth Reddy: సీఎం అయ్యే అర్హత ఉన్న వ్యక్తి మంత్రి కోమటిరెడ్డి: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: సీఎం అయ్యే అర్హత ఉన్న వ్యక్తి మంత్రి కోమటిరెడ్డి: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy news today(Latest news in telangana): తెలంగాణ సాధన కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సొంత పార్టీని ఎదిరించి పోరాటం చేశారని సీఎం రేవంత్ రెడ్డి ఆయన్న ఆకాశానికెత్తేశారు. కేసీఆర్ లా నకిలీ ఉద్యమం నడిపించలేదని, తెలంగాణ కోసం తెగించిన పోరాడిన వ్యక్తి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భువనగిరి ప్రజలకు తెలియజేశారు.


తనతో పాటు తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యే అన్ని అర్హతలు మంత్రి కోమటిరెడ్డికి ఉన్నాయని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డినే వెల్లడించారు. ప్రత్యేక సందర్భంలో, పార్టీ నిర్ణయంతో తనకు సీఎం పదవి ఇచ్చారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కోమటిరెడ్డి నిజమైన పోరాట యోధుడని సీఎం కొనియాడారు. ఆదివారం కోమటిరెడ్డి సోదరులతో కలిసి భువనగిరిలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించి ఈ వ్యాఖ్యలు చేశారు.

కోమటిరెడ్డి సోదరులు ప్రత్యేక తెలంగాణ కోసం హైకమాండ్ తో పోరాటం చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ కోసం కోమటిరెడ్డి తన మంత్రి పదవిని కూడా తృణపాయంగా వదులుకున్నారని గుర్తు చేశారు. తెలంగాణ కోసం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సొంత పార్టీనే ఎదిరించి నిలబడ్డారని సీఎం తెలిపారు.


Also Read: కేసీఆర్ మెడకు గుత్తా ఉచ్చు.. అడ్డంగా దొరికిపోయాడు!

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వాలని కోరారు. పొరపాటున బీఆర్ఎస్ కు ఒక్క సీటు ఇచ్చినా సరే దాన్ని తీసుకువెళ్లి మోదీ ఖాతాలో కేసీఆర్ వేస్తారని విమర్శించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కేసీఆర్ కుటుంబం తప్ప రాష్ట్రంలోని మరెవరూ బాగుపడలేదన్నారు. భవనిగిరి పార్లమెంట్ సీటును గెలిపించి సీఎం రేవంత్ రెడ్డికి బహుమతిగా అందిస్తామని కోమటిరెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి అన్నారు.

Related News

CM Revanth Reddy: అభివృద్ధిలో రాజకీయాల్లేవ్..: సీఎం రేవంత్ రెడ్డి

Ganesh Nimajjanam: నిమజ్జనం.. ప్రశాంతం: సీపీ సీవీ ఆనంద్

TPCC President: మీ నాయనమ్మకు పట్టిన గతే నీకూ పడుతదంటూ క్రూరంగా మాట్లాడుతున్నారు: టీపీసీసీ కొత్త ప్రెసిడెంట్

Rahul Gandhi: బీజేపీ ఆఫీస్ ముట్టడికి యత్నం.. గాంధీ భవన్ దగ్గర దిష్టిబొమ్మ దగ్ధం

Journalist: ఆపదలో ఉన్న జర్నలిస్టు.. ఆదుకున్న రేవంత్ సర్కారు

Ganesh Laddu Auction: గణపయ్య లడ్డూ వేలం.. గెలుచుకున్న ముస్లిం జంట.. కేటీఆర్ సంచలన ట్వీట్

Jani Master: జానీ మాస్టర్ పై పోక్సో కేసు.. లడాఖ్‌ పారిపోయాడా?

Big Stories

×