EPAPER

YS Sharmila on CM Jagran: ఏటా జ్యాబ్ క్యాలెండర్ అన్నారే.. ఏదీ ఎక్కడా కనబడదే..?: వైఎస్ షర్మిల

YS Sharmila on CM Jagran: ఏటా జ్యాబ్ క్యాలెండర్ అన్నారే.. ఏదీ ఎక్కడా కనబడదే..?:  వైఎస్ షర్మిల

YS Sharmila on Yearly Job Calender: రాజధాని అంశంపై ఏపీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సీఎం జగన్‌పై మండిపడ్డారు. కర్నూలును స్మార్ట్ సిటీ చేస్తామన్న జగన్.. కనీసం మంచి నీళ్లు కూడా ఇవ్వలేకపోయారని మండిపడ్డారు.


కర్నూలులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల వైసీపీ ప్రభుత్వంపై పలు ప్రశ్నలు సంధించారు. కర్నూలును న్యాయ రాజధాని చేస్తామన్న జగన్ మాటాలు ఇప్పుడు ఏమయ్యాయని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. న్యాయ రాజధాని అంటే ఇదేనా అంటూ ప్రశ్నించారు.

గత ఎన్నికల హామీల్లో భాగంగా సీఎం జగన్ కర్నూలుని స్మార్ట్ సిటీ చేస్తామని హామీ ఇచ్చారన్నారు. కానీ అధికారంలోకి వచ్చి ఐదేళ్లు గడిచినా సరే.. చుక్క మంచి నీళ్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఐదేళ్లలో కర్నూలులో ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయలేదని ఫైర్ అయ్యారు.


గుండ్రేవుల ప్రాజెక్ట్ పూర్తయి ఉంటే కర్నూలు నగర ప్రజలకు నీళ్లు వచ్చేవని.. కానీ వాటిని వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. జగన్ అధికారంలోకి రావడం వల్ల ఉద్యోగ నోటిఫికేషన్లు లేక యువత రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని విమర్శలు గుప్పించారు.

Also Read: YS Sharmila: అట్లుంటది షర్మిలతోని.. జగన్ కు ఝలక్

ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు.. కానీ ఎక్కడా వాటి జాడ కనిపించడం లేదన్నారు. దీంతో పాటుగా రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు దారుణంగా పెంచారని ప్రజలకు తెలిపారు. ఒక చేత్తో ప్రజలకు డబ్బులు అందించి.. మరో చేత్తో లాగేసుకుంటున్నారని మండిపడ్డారు.

ఐదేళ్లు ప్రజలకు చేసిన మోసం చాలదా అన్నట్లు.. ఇప్పుడు సిద్ధమా అంటూ బయల్దేరారంటూ ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా అంటూ మోసం చేసేందుకు సిద్ధమా లేక ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేయడానికి సిద్ధమా అంటూ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సీఎం జగన్ ను ప్రశ్నించారు.

Related News

Kadambari Jethwani: బట్టబయలైన కుట్ర.. ఏపీ పోలీసులు నటి జత్వానీని అందుకే అరెస్టు చేశారంటా!

Choreographer: జానీ మాస్టర్ పై పవన్ కళ్యాణ్ యాక్షన్

Alluri Sitharama Raju district: అంబులెన్స్ వెళ్లేందుకు దారిలేక విద్యార్థిని మృతి.. డోలీపై మోసుకెళ్లినా దక్కని ప్రాణం

Tdp office attack case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. ఆ మూడే సమాధానాలు, అదుర్స్ మూవీని తలపిస్తోందా?

Fire Accident: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం..

IPS Secret Operation Fail: ముంబై నటి కేసు.. లాజిక్ మిస్సయిన ఐపీఎస్‌లు, గత ప్రభుత్వం చుట్టూ ఉచ్చు

Kadambari Jethwani: జత్వానీ కేసులో మరో ముగ్గురు ఐపీఎస్‌లపై వేటు

Big Stories

×