EPAPER

Vasuki Indicus: గుజరాత్ లో అతి పెద్ద శిలాజం.. ఆసక్తికర విషయాలు వెలుగులోకి..!

Vasuki Indicus: గుజరాత్ లో అతి పెద్ద శిలాజం.. ఆసక్తికర విషయాలు వెలుగులోకి..!

Vasuki Indicus: గుజరాత్ లో అతి పెద్ద పాము శిలాజం బయటపడింది. గుజరాత్ లోని కచ్ ప్రాంతంలో ఈ శిలాజం బయటపడగా ఐఐటీ రూర్కీ దీనిపై పరిశోధనలు జరుపుతోంది. ఈ శిలాజానికి వాసుకి ఇండికస్‌గా పరిశోధకులు నామకరణం చేశారు.ఈ శిలాజంపై పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు ఆకక్తికర విషయాలు వెల్లడించారు.


రూర్కీ ఈ శిలాజంపై పరిశోధనలు జరుపగా..సైంటిఫిక్‌ రిపోర్ట్స్‌ అనే జర్నల్‌లో ఇందుకు సంబంధించిన వివరాలు ప్రచురితం అయ్యాయి. లిగ్రైట్ మైన్ లో దొరిగిన 27 ఎముకలు ప్రపంచంలోనే అతి పెద్ద పాముకు చెందినవిగా గుర్తించారు. అయితే ఇవి ప్రపంచంలోనే అతి పెద్ద పాము వెన్నుముకకు చెందినవని పరిశోధకులు భావిస్తున్నారు. అంతే కాకుండా ఈ పాము సుమారు 11 నుంచి 15 మీటర్ల పొడవు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

Also Read: ఈవీఎంలు ధ్వంసం.. 11 పోలింగ్ బూత్ లలో ఏప్రిల్ 22న రీ పోలింగ్


ఈ శిలాజం ప్రపంచంలోనే అతి పెద్ద పాముగా గుర్తింపు పొందిన టైటానోబోవాను పోలి ఉందని పరిశోధకులు చెబుతున్నారు. అతి పెద్ద సైజులో ఉండే ఈ పాము అనకొండలాగా నెమ్మదిగా కదిలే స్వభావం కలిగి ఉండేదని చెబుతున్నారు. శివుడి మెడలో ఉండే పాము పేరు వాసుకి కాగా అదే పేరును  పరిశోధకులు దీనికి నామకరణం చేశారు. వాసుకి ఇండస్ గా పేరు పెట్టారు. అయితే ఈ పాము ఒకప్పుడు భారత్ తో పాటు యూరప్ , ఆఫ్రికాలో జీవించి అంతరించిపోయిందని  పరిశోధకులు చెబుతున్నారు. ఈ పాము మాడ్ట్సోయిడై కుటుంబానికి చెందినదిగా భావిస్తున్నారు. ఈ శిలాజాలు 4.7 కోట్ల సంవత్సరాల క్రితం నాటివని అంచనా వేస్తున్నారు.

Tags

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×