EPAPER

Chilukur Balaji Temple: చిలుకూరు భక్తులకు షాక్.. నిరాశ చెందిన పెళ్లికాని ప్రసాదులు!

Chilukur Balaji Temple: చిలుకూరు భక్తులకు షాక్.. నిరాశ చెందిన పెళ్లికాని ప్రసాదులు!

Shock to Chilukur Balaji Temple Devotees: వీసా దేవుడు, చిలుకూరు బాలాజీ ఆలయానికి ప్రతిరోజూ భక్తుల తాకిడి ఉంటుంది. కానీ.. ఈసారి బ్రహ్మోత్సవాల్లో గరుడప్రసాదం పంపిణీ రోజున వచ్చిన భక్తులను చూసి.. ఆలయ అర్చకులు సహా.. పోలీసులు కూడా షాకయ్యారు. సంతానం లేనివారికి పంపిణీ చేసే ప్రసాదం కోసం 5 వేల మంది వస్తారనుకుంటే.. ఏకంగా 60 వేల మందికి పైగా భక్తులు ఆలయానికి క్యూ కట్టారు. 30 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్, ఎక్కడిక్కడే ఇరుకున్న వాహనాలను క్లియర్ చేయడానికి పోలీసులు నానా తంటాలు పడ్డారు.


తాజాగా చిలుకూరు ఆలయం ప్రధాన అర్చకులు రంగరాజన్ భక్తులకు మరో షాకిచ్చారు. చిలుకూరు ఆలయంలో వివాహ ప్రాప్తి కార్యక్రమాన్ని నిర్వహించడం లేదని, సంతాన ప్రాప్తి రోజు జరిగిన రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పెళ్లికాని జంటలు ఆలయానికి రావొద్దని, ఇంట్లోనే ఉండి దేవుడిని ప్రార్థించాలని సూచించారు. స్వామివారి కల్యాణోత్సవం మాత్రం యథావిధిగా నిర్వహించారు. ఆలయ అర్చకులు పెళ్లికాని ప్రసాదులను రావొద్దని చెప్పడంతో.. నిరాశ చెందారు.

Also Read: గరుడ ప్రసాదం తింటే సంతానం.. నిజమా? అబద్ధమా?


బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. 22న వసంతోత్సవం, గజవాహన సేవలు, 23న పల్లకీసేవ, అదేరోజు రాత్రి 12 గంటలకు దివ్యరథోత్సవ కార్యక్రమం, 24న మహాభిషేకం, ఆస్థానసేవ, అశ్వవాహన సేవ, దోప్ సేవ, పుష్పాంజలి సేవలను నిర్వహిస్తారు. 25న చక్రతీర్థం, ధ్వజావరోహణం కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

Tags

Related News

CM Revanth Reddy: అభివృద్ధిలో రాజకీయాల్లేవ్..: సీఎం రేవంత్ రెడ్డి

Ganesh Nimajjanam: నిమజ్జనం.. ప్రశాంతం: సీపీ సీవీ ఆనంద్

TPCC President: మీ నాయనమ్మకు పట్టిన గతే నీకూ పడుతదంటూ క్రూరంగా మాట్లాడుతున్నారు: టీపీసీసీ కొత్త ప్రెసిడెంట్

Rahul Gandhi: బీజేపీ ఆఫీస్ ముట్టడికి యత్నం.. గాంధీ భవన్ దగ్గర దిష్టిబొమ్మ దగ్ధం

Journalist: ఆపదలో ఉన్న జర్నలిస్టు.. ఆదుకున్న రేవంత్ సర్కారు

Ganesh Laddu Auction: గణపయ్య లడ్డూ వేలం.. గెలుచుకున్న ముస్లిం జంట.. కేటీఆర్ సంచలన ట్వీట్

Jani Master: జానీ మాస్టర్ పై పోక్సో కేసు.. లడాఖ్‌ పారిపోయాడా?

Big Stories

×