EPAPER

PBKS Vs MI Preview: హార్దిక్ పాండ్యా.. లైన్ లో పడతాడా..? నేడు పంజాబ్ వర్సెస్ ముంబై ఇండియన్స్!

PBKS Vs MI Preview: హార్దిక్ పాండ్యా.. లైన్ లో పడతాడా..? నేడు పంజాబ్ వర్సెస్ ముంబై ఇండియన్స్!

PBKS Vs MI Match Preview and Prediction: ఐపీఎల్ సీజన్ 2024లో అందరి కళ్లూ ముంబై ఇండియన్స్ పైనే ఉన్నాయి. ఒకవైపు నుంచి ఓడిపోతున్నా, ఆ జట్టుకి ఉన్న క్రేజ్ మామూలుగా లేదు. ఎందుకంటే హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ ఎలా ఉంటుందో చూడాలని అనుకోవడం ఒకటైతే, రెండోది ఓటమి నుంచి మళ్లీ గెలుపు బాట పడుతుందా? లేదా? అనే అనుమానాలు మరోవైపుతో ఆ జట్టుపై లేనిపోని అంచనాలను పెంచేస్తున్నాయి.


నేడు పంజాబ్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మొహలీలో రాత్రి 7.30కి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇకపోతే ఇప్పటికే ముంబై ఆడిన 6 మ్యాచ్ ల్లో 2 గెలిచి 4 ఓడిపోయింది. దీంతో పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. ఇకపోతే పంజాబ్ కింగ్స్  రన్ రేట్ ప్రకారం వీరికన్నా
ఒక అడుగు ముందున్నారు. అంటే 7వ స్థానంలో ఉన్నారు. వీరు కూడా ఆడిన 6 మ్యాచ్ ల్లో 2 గెలిచి 4 ఓడిపోయారు.

MI vs PKBS Preview
MI vs PKBS Preview

ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 32 మ్యాచ్ లు జరిగాయి. వీటిలో ముంబయి 16 మ్యాచ్ ల్లో విజయం సాధించింది. పంజాబ్ 15 గెలిచింది. ఒక మ్యాచ్ లో ఫలితం తేలలేదు.


Also Read: 89కే ఆలౌట్.. అరె! గుజరాత్ కి ఏమైంది..? ఆడుతూ పాడుతూ గెలిచిన ఢిల్లీ

ఇక ముంబై ఇండియన్స్ విషయం అందరికీ తెలిసిందే. ఒకరు ఆడితే ఒకరు ఆడటం లేదు. మొన్న సీఎస్కేతో జరిగిన మ్యాచ్ లో రోహిత్ సెంచరీ చేసినా మ్యాచ్ గెలవలేకపోయింది. మరోవైపు హార్దిక్ కెప్టెన్సీ కూడా వివాదాస్పదం అవుతోంది. బుమ్రా ఉండగా డెత్ ఓవర్లు తను బౌల్ చేయడం ఓటమికి కారణమైంది. అంతేాకాదు బుమ్రాని పక్కన పెట్టి తనే ఫస్ట్ ఓవర్ వేసి, లేనిపోని ప్రయోగాలు చేసి విఫలమయ్యాడు.

పంజాబ్ విషయానికి వస్తే, కెప్టెన్ ధావన్ భుజం గాయంతో రెండు వారాలు ఆటకి దూరమయ్యాడు. శ్యామ్ కర్రన్ కెప్టెన్సీలో మరి ఈసారి మ్యాచ్ ఎలా ఆడుతుందో వేచి చూడాల్సిందే. ముంబై ఇండియన్స్ తో సమానంగానే వీరి ఆట తీరు సాగుతోంది. దొందూ దొందులాగే ఉన్నారు. అందువల్ల ఎవరు గెలిచినా పెద్ద ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదని అంటున్నారు. అంతేకాదు పెద్ద ఉపయోగం కూడా ఉండకపోవచ్చునని నెటిజన్లు తీర్మానిస్తున్నారు.

Tags

Related News

Pro Kabaddi League 11: నేటి నుంచి ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-11 ప్రారంభం..లైవ్‌ స్ట్రీమింగ్‌, మ్యాచ్‌ వివరాలు ఇవే !

IPL 2025: సన్‌రైజర్స్‌కు డేల్ స్టెయిన్ గుడ్ బై !

Lowest Totals: టెస్టుల్లో ఇప్పటి వరకు అతి తక్కువ పరుగులకు ఆల్ అవుట్ అయిన జట్లు ఇవే !

Ind vs Nz : చుక్కలు చూపించిన న్యూజిలాండ్‌…46 పరుగులకే కుప్పకూలిన టీమిండియా..!

Ind Vs Nz: బెంగుళూరు టెస్ట్.. కష్టాల్లో టీమిండియా! 46 పరుగులకే ఆలౌట్

Ind vs NZ: తగ్గిన వర్షం..టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ తీసుకున్న టీమిండియా…జట్లు ఇవే

Ind vs NZ: బెంగళూరులో మరో 3 రోజులు వర్షాలు..టెస్ట్‌ మ్యాచ్‌ రద్దు కానుందా?

Big Stories

×