EPAPER

CM Jagan Reacts on Stone Attack: దేవుడి దయతో.. పోలీసుల రివార్డు.. ఇదిగో నిందితుల వివరాలు?

CM Jagan Reacts on Stone Attack: దేవుడి దయతో.. పోలీసుల రివార్డు.. ఇదిగో నిందితుల వివరాలు?

CM Jagan Reacts on Stone Attack: రాయి దాడి ఘటనపై సీఎం జగన్ రియాక్టయ్యారు. దేవుడి దయవల్ల ఆ దాడి నుంచి బయటపడ్డానని తెలిపారు. ధైర్యంగా ముందుకు అడుగులు వేద్దామని, ఈ విషయంలో ఎవరూ అధైర్య పడాల్సిన పనిలేదన్నారు. ఎలాంటి దాడులు మనల్ని ఏమీ చేయలేవని, మరోసారి అధికారంలోకి వస్తున్నామని పార్టీ నేతలకు భరోసా ఇచ్చారు.


దాడి ఘటన తర్వాత మేమంతా సిద్ధం బస్సు యాత్ర పునః ప్రారంభమైంది. సోమవారం యాత్ర ప్రారంభానికి ముందు ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలు సీఎం జగన్‌ను కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా నేతలతో మాట్లాడారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఏంటి? ప్రచారం ఎలా సాగుతోంది? ప్రజలు స్పందన ఎలా ఉందనే అంశాలపై ఆరా తీసినట్టు సమాచారం. ప్రస్తుతం గన్నవరంలో జగన్ యాత్ర కొనసాగుతోంది. సాయంత్రం అక్కడ భారీ బహిరంగ సభ జరగనుంది.

మరోవైపు రాయి ఘటనపై పోలీసు అధికారులు ఓ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం ఇచ్చినవారికి రెండు లక్షల రివార్డు ఇవ్వనున్నట్లు ప్రకటన ఇచ్చారు. దీనికి సంబంధించి సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. సెల్‌ఫోన్, వీడియో రికార్డులు అందించాలని కోరారు పోలీసులు.


Also Read: రాళ్ల దాడి చేస్తే సింపథీ వస్తుందా బాబు?

ఈ వ్యవహారంపై టీడీపీ రియాక్టయ్యింది. సీఎం జగన్ గులకరాయి డ్రామా వెనుక కేశినేని నాని, వెల్లంపల్లి సూత్రధారులని ఆరోపించారు. పశ్చిమ నియోజకవర్గానికి చెందిన రౌడీ షీటర్లను తీసుకొచ్చి చేయించినట్టు తమవద్ద సమాచారం ఉందన్నారు.

 

Related News

Inquiry on Sakshi Newspaper: జగన్ చిక్కినట్టేనా.. క్విడ్ ప్రోకో, సాక్షి పత్రిక కొనుగోళ్లపై

Tirupati Laddu: దేవుడిపై ప్రమాణానికి చంద్రబాబు కుటుంబం సిద్ధమా?

Free Gas Cylinders: భారీ శుభవార్త.. దీపావళి నుంచి ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ

Tirupati Laddu: తిరుపతి లడ్డూలపై సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు.. ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడారంటూ సీరియస్

Pavan Kalyan: ఈ వయసులోనూ ఆయన పనిచేస్తున్న తీరును చూసి నాకు ఆశ్చర్యం వేస్తుంది: పవన్ కల్యాణ్

Balineni: బ్రేకింగ్ న్యూస్.. జగన్ మోహన్ రెడ్డికి భారీ షాకిచ్చిన దగ్గరి బంధువు..

AP Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్

Big Stories

×