EPAPER

Rahul’s Helicopter Checking: రాహుల్ చాపర్‌లో తనిఖీలు.. ఏం జరిగింది..?

Rahul’s Helicopter Checking: రాహుల్ చాపర్‌లో తనిఖీలు.. ఏం జరిగింది..?

Rahul Gandhi’s Helicopter Checked in Tamil Nadu: సార్వత్రిక ఎన్నికల ప్రచారం హొరెత్తుతోంది. అధికార బీజేపీ-విపక్ష కాంగ్రెస్ నేతల మధ్య మాటలు తూటాల మాదిరిగా పేలుతున్నాయి. అయితే తొలి విడత ఎన్నికలకు సమయం దగ్గరపడడంతో ఎన్నికల అధికారులు ఆయా రాష్ట్రాలపై దృష్టి సారించారు. గడిచిన రెండురోజులుగా తమిళనాడులో భారీ ఎత్తున బంగారం పట్టుబడింది. అటువైపు ఫోకస్ పెట్టారు ఎన్నికల అధికారులు. తాజాగా నీలగిరి వెళ్లిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ హెలికాఫ్టర్‌ను ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేసింది.


తమిళనాడులోని నీలగిరి నియోజకవర్గంలో భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ హాజరయ్యారు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం రాహుల్ హెలికాప్టర్ నీలగిరిలో ల్యాండయ్యింది. రాహుల్ హెలికాప్టర్ దిగగానే ఫ్లయింగ్ స్వ్కాడ్ చుట్టుముట్టింది. దాదాపు 10 నిమిషాల సేపు చాపర్‌లో తనిఖీలు చేశారు. అయితే ఎలాంటి నగదు, నగలు లభించలేదు. దీంతో అక్కడి నుంచి అధికారులు వెళ్లిపోయారు.

నీలగిరి నియోజకవర్గం నుంచి డీఎంకె అభ్యర్థి ఏ రాజా పోటీ చేస్తున్నారు. తొలివిడత ఎన్నికలు ఏప్రిల్ 19న తమిళనాడులోని అన్ని సీట్లకు పోలింగ్ జరగనుంది. సమయం కేవలం నాలుగు రోజులు మాత్రమే ఉండడంతో అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. రీసెంట్‌గా శనివారం ఫ్లయింగ్ స్వ్కాడ్ చేపట్టిన సోదాల్లో 1000 కేజీల బంగారం పట్టుబడింది. ఈ క్రమంలోనే అధికారులు తనిఖీలు చేసినట్టు సమాచారం. నీలగిరి సభ తర్వాత కేరళకు వెళ్లారు రాహుల్‌గాంధీ.


Also Read: ఎన్నికల వేళ 1425 కేజీల బంగారం సీజ్.. ఎక్కడ?

ఆదివారం టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ హెలికాప్టర్‌లోనూ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఎలాంటి నగదు లభించకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. వరుసగా జరుగుతున్న పరిస్థితులను గమనించిన విపక్ష నేతలు.. ఈసీ అధికారులు కూడా తమనే టార్గెట్ చేశారని అంటున్నారు.

Tags

Related News

Nipah virus: కేరళలో నిఫా వైరస్ విజృంభణ.. స్టూడెంట్ మృతి.. రాష్ట్రంలో ఆంక్షలు!

PM Modi: ఇది ట్రైలర్ మాత్రమే.. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ

yashwant Sinha: వాజ్ పేయి సిద్ధాంతాలతో.. పార్టీ పేరు ప్రకటించిన యశ్వంత్ సిన్హా

Delhi: ఢిల్లీకి తదుపరి సీఎం ఎవరు? రేసులో ఆరుగురు పేర్లు.. వీళ్లేనా?

Rajasthan Road Accident: రాజస్థాన్‌లో ట్రక్కును ఢీకొట్టిన తుఫాను.. ఎనిమిది మంది దుర్మరణం

Jammu Kashmir: గాంధీ, నెల్సన్ మండేలాతో బీజేపీ పోల్చుతున్న ఈ బుఖారీ ఎవరు?

PM Narendra Modi: మరో 6 వందే భారత్ రైళ్లు.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

Big Stories

×