Track Stolen Phone with IMEI Number: ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ ప్రతి ఒక్కరి చేతిలో ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ అవసరం ఉన్నా లేకున్నా కొనుగోలు చేస్తున్నారు. మరి కొందరైతే ఏకంగా ఫోన్లను కొనుగోలు చేసేందుకు లక్షల రూపాయలు చెల్లిస్తున్నారు. అయితే కొందరు కేటుగాళ్లు స్మార్ట్ఫోన్లను సులభంగా చోరీ చేస్తున్నారు. ఈ క్రమంలో వేలు,లక్షల రూపాయలు చెల్లంచి ఇష్టంగా తీసుకునే ఫోన్ల భద్రత గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అసలు మన స్మార్ట్‌ఫోన్‌లో IMEI అనేది ఒకటి ఉంటుదని మీకు తెలుసా? ఈ నెంబర్ ద్వారా మీరు పోగొట్టుకున్న, లేదా దొంగిలించబడ్డ ఫోన్ చిరునామా చెబుతుంది. మొబైల్లో IMEI నంబర్ చాలా ముఖ్యమైనది. ఫోన్ దొంగిలించబడినా లేదా పోగొట్టుకున్నా IMEI ద్వారా ట్రాక్ చేయవచ్చు. ఇది ఫోన్‌ను తిరిగి పొందడం సులభతరం చేస్తుంది. IMEI ప్రాముఖ్యత నంబర్ ఎలా చూడాలో ఇప్పుడు తెలుసుకోండి.
IMEI అంటే ఏమిటి..?
IMEI నంబర్ అంటే ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ. ఇది 15 అంకెల ప్రత్యేక కోడ్. ఇది ప్రతి మొబైల్ ఫోన్‌కు ఉంటుంది. ఒక విధంగా ఇది ఫోన్ ఫింగర్ ప్రింట్‌గా చెప్పవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ట్రాక్ చేయవచ్చు. చెప్పాంటే.. దొంగ సిమ్ మార్చినా ఐఎంఈఐ నంబర్ కారణంగా ఫోన్ నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయగానే సమాచారం పోలీసులు చేరుతుంది. దీంతో ఫోన్‌ను తిరిగి పొందడమే కాకుండా దొంగను కూడా పట్టుకోవచ్చు.
IMEI ప్రాముఖ్యత
Also Read: Lava Blaze 5G @ Rs 649: రూ.8,999 ధరగల 5జీ ఫోన్.. ఇప్పుడు రూ.649కే కొనుక్కోవచ్చు.. ఎలాగో తెలుసా..?
మీరు మీ ఫోన్ పోగొట్టుకున్నా లేదా అది దొంగిలించబడినా వెంటనే పోలీసు రిపోర్ట్‌ను ఫైల్ చేయండి. IMEI నంబర్ అనేది మీ ఫోన్‌ను సురక్షితంగా ఉంచడంలో సహాయపడే ముఖ్యమైన విషయం.