EPAPER

Stone Attack on CM Jagan: CM జగన్ పై రాళ్లదాడి.. టీడీపీ రియాక్షన్ పై వైసీపీ కీలక ప్రకటన!

Stone Attack on CM Jagan: CM జగన్ పై రాళ్లదాడి.. టీడీపీ రియాక్షన్ పై వైసీపీ కీలక ప్రకటన!

Attack on CM Jagan Updates: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై.. శనివారం రాత్రి విజయవాడలోని సింగ్ నగర్ లో రాళ్లదాడి జరిగిన విషయం తెలిసిందే. ఆయన ఎడమ కనుబొమ్మకు గాయమవ్వగా.. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు చికిత్స చేసి.. రెండు కుట్లు వేశారు. గాయం కారణంగా వైద్యులు ఆయనకు విశ్రాంతి సూచించడంతో.. నేటి మేమంతా సిద్ధం బస్సుయాత్రకు జగన్ విరామం ప్రకటించారు. ఆయన పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి కంటికి కూడా గాయమైంది. ఎన్నికలకు ముందు ఇది మరో కుట్ర అని టిడిపి ఆరోపించింది.


కాగా.. జగన్ పై దాడి ఘటనపై ప్రధాని సహా.. పలువురు నేతలు స్పందించారు. సీఎంపై రాళ్ల దాడి ఘటనను తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ కోరుతూ.. ట్వీట్ చేశారు. అలాగే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సైతం ఈ దాడిని ఖండించారు. దీనిపై ఈసీ నిష్పాక్షికంగా విచారణ చేసి.. బాధ్యులెవరైనా కఠినంగా శిక్షించాలని కోరారు. దాడి ఘటనలో నిర్లక్ష్యంగా ఉన్న అధికారులను శిక్షించాలని డిమాండ్ చేశారు.

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, బీఆర్ఎస్ నేత కేటీఆర్ లు కూడా ఈ ఘటనపై స్పందించారు. రాజకీయ విభేదాలు ఉండటం సహజమని, అవి హింసాత్మకంగా మాత్రం మారకూడదని స్టాలిన్ అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ త్వరగా కోలుకోవాలంటూ X వేదికగా ట్వీట్ చేశారు.


Also Read: సీఎం జగన్ పైకి రాయి.. ఎడమ కంటికి గాయం

తన సోదరుడిపై జరిగిన దాడిపై వైఎస్ షర్మిల స్పందించారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయనపై ఈ దాడి ప్రమాదవశాత్తు జరిగినట్లు భావిస్తున్నట్లు తెలిపారు. అలా కాకుండా ఎవరైనా దీనిని ఉద్దేశపూర్వకంగా చేసినట్లైతే.. ప్రతిఒక్కరూ ఖచ్చితంగా ఈ దాడిని ఖండించాల్సిందేనన్నారు. ఏదేమైనా తన సోదరుడు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.

ఇక సీఎం జగన్ పై జరిగిన దాడి ఘటనపై వైసీపీ కీలక ప్రకటన చేసింది. కార్యకర్తలెవరూ ఆందోళన చెందవద్దని, అందరూ సంయమనం పాటించాలని X వేదికగా కోరింది. జగన్ పై దాడిని చంద్రబాబు నిజంగానే ఖండించి ఉంటే.. ఆ పార్టీ X ఖాతా నుంచి ఎందుకు వ్యతిరేక పోస్టులు వస్తున్నాయని ఫైర్ అయింది.

Also Read: Peddireddy vs Chandrababu: రాళ్ల దాడి చేస్తే సింపథీ వస్తుందా బాబు?

Tags

Related News

Kadambari Jethwani: బట్టబయలైన కుట్ర.. ఏపీ పోలీసులు నటి జత్వానీని అందుకే అరెస్టు చేశారంటా!

Choreographer: జానీ మాస్టర్ పై పవన్ కళ్యాణ్ యాక్షన్

Alluri Sitharama Raju district: అంబులెన్స్ వెళ్లేందుకు దారిలేక విద్యార్థిని మృతి.. డోలీపై మోసుకెళ్లినా దక్కని ప్రాణం

Tdp office attack case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. ఆ మూడే సమాధానాలు, అదుర్స్ మూవీని తలపిస్తోందా?

Fire Accident: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం..

IPS Secret Operation Fail: ముంబై నటి కేసు.. లాజిక్ మిస్సయిన ఐపీఎస్‌లు, గత ప్రభుత్వం చుట్టూ ఉచ్చు

Kadambari Jethwani: జత్వానీ కేసులో మరో ముగ్గురు ఐపీఎస్‌లపై వేటు

Big Stories

×