EPAPER

Govt Focus On Musi River: మూసీ ముస్తాబుపై ప్రభుత్వం స్సెషల్ ఫోకస్..

Govt Focus On Musi River: మూసీ ముస్తాబుపై ప్రభుత్వం స్సెషల్ ఫోకస్..

రివర్ థేమ్స్‌ ఆఫ్‌ ఇండియా.. ఇది మూసీ నదికి ఉన్న పేరు. ప్రపంచంలోని అందమైన నగరాలన్ని నదుల ఒడ్డునే వెలిశాయని చరిత్ర చెబుతోంది. అందుకే మూసీ డెవలప్‌మెంట్‌ను హైప్రియారిటీలో తీసుకున్నారు సీఎం రేవంత్.. అలాంటి మూసీని థేమ్స్‌లానే డెవలప్‌ చేయాలని డిసైడ్ అయ్యారు.
లండన్‌ పర్యటనలో ఉన్నప్పుడు అక్కడి అధికారులతో భేటీ నిర్వహించారు. తన థాట్స్ షేర్ చేసుకున్నారు.  వారి సలహాలు తీసుకున్నారు. మరి అవన్ని అమల్లోకి వస్తున్నాయా? ఈ క్వశ్చన్‌కి ఆన్సర్‌ యస్‌ అనే చెప్పాలి.

మూసీ నది డెవలప్​మెంట్, బ్యూటిఫికేషన్‌పై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఉన్నతాధికారులతో నిర్వహిస్తున్న సమావేశాల్లో హైదరాబాద్ ప్రస్తావన వస్తే చాలు. ఫస్ట్ వచ్చే టాపిక్‌ మూసీ బ్యూటిఫికేషన్..
ఇప్పటికే మూసీ డెవలప్‌మెంట్ అండ్ బ్యూటిఫికేషన్‌ కోసం 36 నెలల టైమ్‌ను టార్గెట్‌గా పెట్టుకున్నారు..
అంతేకాదు. మూసీ నది నుంచి 50 మీటర్ల పరిధిలో నిర్మాణ అనుమతులు ఆపేశారు. మూసీ పరిధిలో ఉన్న చారిత్రక కట్టడాలను కలుపుతూ ఓ టూరిజం సర్క్యూట్‌కు ఏర్పాటు చేసేందుకు అడుగులు పడుతున్నాయి. ఎట్ ది సేమ్‌ టైమ్.. మూసీ బ్యూటిఫికేషన్‌లో భాగంగా ఇల్లు కోల్పోయే నిరాశ్రయులకు డబుల్ బెడ్‌ రూమ్ ఇల్లు ఇవ్వాలని కూడా నిర్ణయించింది రేవంత్ సర్కార్.


ఈ చర్యలన్ని చూస్తుంటే అడుగులు పడటం కాదు.. పరుగులే మొదలయ్యాయని అర్థమవుతోంది..
అంతేకాదు మూసీ రివర్‌ను పబ్లిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసేందుకు అధికారులు ప్లాన్ రూపొందించారు. ఆగస్టు నెలాఖరులోగా మాస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్రాఫ్ట్ సిద్ధం కానుంది. ఈ ప్రాజెక్ట్‌ ఫస్ట్‌ ఫేజ్‌లో భాగంగా ఉస్మాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్యామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్ట్రీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి గౌరెల్లి సమీపంలోని ఔటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోడ్డు వరకు..
హిమాయత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్యామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్ట్రీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి బాపూఘాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని సంఘం వరకు మొత్తం 55 కిలోమీటర్ల మేర విస్తరణ, అభివృద్ధి చేపట్టాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మూసీ చుట్టూ ఉన్న వారసత్వ కట్టడాల పరిరక్షణ, పునరుద్ధరణ చేయాలని నిర్ణయించారు.. ఎక్కడాఇబ్బందులు లేకుండా, నది పరివాహక ప్రాంత ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా చర్యలు తీసుకోవాలన్నది ప్రభుత్వం ప్లాన్..

ఈ టోటల్ ప్రాజెక్ట్‌ అంచనా వ్యయం అక్షరాలా 60 వేల కోట్లు.. అయితే ప్రభుత్వం అనుకున్నంత ఈజీగా మూసీని డెవలప్‌ చేయగలదా? అంటే కాస్త కష్టమనే చెప్పాలి. ఎందుకంటే మూసీని డెవలప్‌ చేయాలనే ఆలోచన ఇప్పటిది కాదు. అసలు మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్ కాన్సెప్ట్‌ అనేది 1980లోనే వచ్చింది. 1990లో కాస్త ముందుకు కదిలినా.. పూర్తిస్థాయిలో పురోగతి సాధించలేదు. ఎందుకంటే నగరంలోని నాలాల నుంచి వస్తున్న మురుగునీరు. నదికి ఇరువైపులా పెరిగిన ఆక్రమణలు.. మూసీ డెవలప్‌మెంట్‌కు అడ్డంకిగా మారాయి. ఇప్పుడు ఆ ఆక్రమణలను తొలగించడమే ప్రభుత్వానికి అతి పెద్ద సవాల్.

మరో సవాల్ కూడా ఉంది. ప్రస్తుతం మూసీలో మురుగు నీరు పరవళ్లు తొక్కుతుంది. మరి ఆ నీటిని క్లీన్ చేయడం ఎలా? దీనికి గుజరాత్‌ మోడల్‌ను అమలు చేసే చాన్స్ కనిపిస్తోంది. గుజరాత్‌లో నర్మదా నది నీటిని సబర్మతికి తీసుకెళ్లారు. సేమ్ అలానే మూసీని ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌ సాగర్‌ జంట జలాశయాలకు లింక్ చేయాలనేది ఓ ప్లాన్. మురుగునీటితో నిండి ఉన్న మూసీ నదికి ఈ జంట జలాశయాల నుంచి నీటిని విడుదల చేయాలి. ఇలా రోజుకు 1–2 టీఎంసీల జలాల విడుదలతో మురుగు నీరు తొలిగి.. మంచినీరు చేరుతుందని ప్రభుత్వం భావిస్తోంది.. మరి ఈ ఆలోచన కూడ పట్టాలెక్కుతుందా? లేదా? అన్నది చూడాలి..

ఉన్న మురుగును తొలగిస్తారు సరే.. మరి కొత్తగా మురుగు నీరు చేరకుండా ఉండాలంటే ఏం చేయాలి?
దీనికి ఆన్సర్ ఎస్టీపీ అంటే మురుగునీటి శుద్దీకరణ ప్లాంట్‌ల నిర్మాణం మొత్తం 39 ఎస్టీపీలను నిర్మించాలనేది ప్లాన్… వీటిద్వారా వందశాతం శుద్ధి చేసిన నీటిని నదిలోకి విడుదల చేస్తారు. ఇలా మురుగు నీరు కలవకుండా.. ఉన్న మురుగును తొలగించేలా నది పరిసరాలను డెవలప్ చేసేలా.. అన్ని రకాలుగా ప్లాన్‌ చేస్తోంది రేవంత్ సర్కార్.. సో ఇన్ వెరీ సూన్.. మూసీ ముఖచిత్రం మారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.

Related News

Balapur Laddu: 1994లో రూ. 450.. బాలాపూర్ లడ్డు చరిత్ర ఇదే!

New Ration Cards: కొత్త రేషన్ కార్డులకు డేట్ ఫిక్స్.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన

Rajiv Gandhi: ఆ పార్టీ పెద్ద సొంత విగ్రహం పెట్టుకోడానికే ఆ ఖాళీ ప్లేస్.. బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

Telangana Liberation Day: విమోచన దినోత్సవంగా నిర్వహిస్తేనే హాజరవుతా: కేంద్రమంత్రి బండి

Rajiv Gandhi Statue: సచివాలయంలోని రాజీవ్ గాంధీ విగ్రహ ప్రత్యేకత ఏమిటీ?

Nursing student death: గచ్చిబౌలి హోటల్‌లో యువతి అనుమానాస్పద మృతి.. రూమంతా రక్తం, హత్యా.. ఆత్మహత్యా?

Harish Rao: హరీశ్ రావు యాక్ష‌న్ షురూ.. కేసీఆర్ శకం క్లోజ్ అయినట్లేనా?

Big Stories

×