EPAPER

Infinix Note 40 Pro: ఇన్ఫినిక్స్ నుంచి 108 MP ఫోన్ లాంచ్.. ధర చూస్తే కొనకుండా ఉండలేరు..!

Infinix Note 40 Pro: ఇన్ఫినిక్స్ నుంచి 108 MP ఫోన్ లాంచ్.. ధర చూస్తే కొనకుండా ఉండలేరు..!

Infinix Launched Note 40 Pro and Note 40 Pro Plus: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ Infinix ఎట్టకేలకు తన కొత్త మిడ్‌రేంజ్ ఫోన్లను విడుదల చేసింది. ఇందులో Infinix Note 40 Pro 5G, Infinix Note 40 Pro Plus 5G వేరియంట్లు ఉన్నాయి. Infinix ఈ రెండు ఫోన్‌లను గ్లోబల్ మార్కెట్‌లో వరుసగా విడుదల చేసింది. కంపెనీ ఈ రెండు ఫోన్‌లలో MediaTek Dimensity 7200 చిప్‌సెట్, 108MP బ్యాక్ కెమెరా, 32MP ఫ్రంట్ కెమెరా సెటప్‌ను అందించింది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లోని ఇతర ఫీచర్లు తెలుసుకోండి.


రెండు ఫోన్‌ల స్పెసిఫికేషన్‌లు..

ఈ ఫోన్ 6.78 అంగుళాల ఫుల్ HD ప్లస్ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 2160Hz PWM డిమ్మింగ్  కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో వస్తుంది. ఈ రెండు ఫోన్‌ల వెనుక భాగంలో LED లైట్‌తో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ అందించబడింది.
వెనుక ప్యానెల్‌లో 108MP మెయిన్ కెమెరా సెన్సార్ ఉంటుంది. ఇది f/1.75 ఎపర్చరు OIS మద్దతుతో వస్తుంది. ఈ రెండు ఫోన్‌లలోని రెండవ బ్యాక్ కెమెరా 2MP మాక్రో లెన్స్‌తో వస్తుంది. మూడవ కెమెరా 2MP డెప్త్ సెన్సార్‌తో వస్తుంది. ఈ ఫోన్ల వెనుక కెమెరా 2K వీడియో రికార్డింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 32MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఇది f/2.2 ఎపర్చర్‌తో వస్తుంది.


Also Read: ఫోన్ల జాతర.. ఒకేసారి మూడు మోడళ్లు లాంచ్

Infinix Note 40 Pro Price and Specifications
Infinix Note 40 Pro Price and Specifications

Infinix Note 40 Pro 5G, Infinix Note 40 Pro Plus 5G స్మార్ట్‌ఫోన్లలో  ప్రాసెసర్ కోసం 6nm MediaTek డైమెన్సిటీ 7020 చిప్‌సెట్‌ను కలిగి ఉన్నాయి. ఇది గ్రాఫిక్స్ కోసం IMG BXM-8-256 GPUతో వస్తుంది.ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా XOS 14తో రన్ అవుతుంది. Infinix Note 40 Pro+ 5G 4500mAh బ్యాటరీని కలిగి ఉంది, ఇది 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. Infinix Note 40 Pro 5G 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఇది ఆల్ రౌండ్ FastCharge2.0, 20W వైర్‌లెస్ MagChargeకి సపోర్ట్ చేస్తుంది. ఈ రెండు ఫోన్‌లు JBL సౌండ్‌తో కూడిన స్టీరియో స్పీకర్‌లు ఉన్నాయి. ఇది హై రెస్ ఆడియోతో వస్తుంది.

ఇది IP53 డస్ట్,  వాటర్ రెసిస్టెంట్ ఫీచర్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ బ్లాక్, టైటాన్ గోల్డ్, వింటేజ్ గ్రీన్ రంగులలో వస్తుంది. బ్లాక్ ఫోన్ బరువు 196 గ్రాములు కాగా మిగిలిన రెండు రంగుల ఫోన్ల బరువు 190 గ్రాములుగా ఉంది. ఈ రెండు ఫోన్‌లు డ్యూయల్ సిమ్, 5G, WiFi 5, బ్లూటూత్ , NFC సపోర్ట్‌ను కలిగి ఉన్నాయి.

Also Read: వివో నుంచి బడ్జెట్ ఫోన్.. ఫీచర్లు మాములుగా లేవు మామ

ధర, ఆఫర్లు..

Infinix Note 40 Pro 5G ధర రూ. 21,999. ఈ ధరలో 8GB RAM+ 256GB స్టోరేజీతో కూడిన వేరియంట్ అందుబాటులో ఉంది. Infinix Note 40 Pro+ 5G ధర రూ. 24,999. ఈ ధరలో 12GB RAM +256GB స్టోరేజ్ ఉన్న వేరియంట్ అందుబాటులో ఉంది. ఈ రెండు ఫోన్లు ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్నాయి. హెచ్‌డిఎఫ్‌సి లేదా ఎస్‌బిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లించి ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే రూ.2000 వరకు ప్రైజ్ తగ్గుతుంది. ఇది కాకుండా కంపెనీ ఈ ఫోన్‌తో లాంచ్ ఆఫర్‌గా రూ.4,999 విలువైన మ్యాగ్‌కేస్,  మ్యాగ్‌పవర్‌ను ఉచితంగా అందిస్తోంది. అయితే ఈ ఆఫర్ ఏప్రిల్ 12న అంటే ఈరోజు ఎర్లీ బర్డ్ సేల్ సమయంలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

Tags

Related News

Bsnl Recharge Plan: వావ్ అమేజింగ్.. ఇంత తక్కువ ధరకే అన్ని రోజుల వ్యాలిడిటీనా, రీఛార్జ్ ప్లాన్ అదిరిపోయింది!

Honor Magic V3: బీభత్సం.. హానర్ ఏంటి భయ్యా ఒకేసారి ఇన్ని లాంచ్ చేసింది, ధర సహా పూర్తి వివరాలివే!

Realme 13 And 13+ 5G: దుమ్ముదులిపే స్మార్ట్‌ఫోన్లు లాంచ్.. మొదటి సేల్ షురూ, ఆఫర్లు పిచ్చెక్కించాయ్ గురూ!

Vivo T3 Ultra: కుమ్ముడే కుమ్ముడు.. ఏకదాటిగా దూసుకుపోతున్న వివో.. మార్కెట్‌లోకి మరో స్మార్ట్‌ఫోన్!

Poco M7 Pro 5G: పోకో నుంచి మరో కిక్కిచ్చే ఫోన్.. సామాన్యుల కోసం వచ్చేస్తుంది మావా!

Vivo Y300 Pro: వివో నుంచి మెస్మరైజింగ్ స్మార్ట్‌ఫోన్.. కర్వ్డ్ డిస్‌ప్లే, 6500mAh బ్యాటరీతో లాంచ్!

Moto S50 Launched: మోటో మామ అదరగొట్టేశాడు.. 50MP కెమెరా సహా మరెన్నో అధునాతన ఫీచర్లతో కొత్త ఫోన్ లాంచ్!

Big Stories

×