EPAPER

Siromundanam Case Verdict : తూర్పుగోదావరి శిరోముండనం కేసు.. తీర్పు వాయిదా

Siromundanam Case Verdict : తూర్పుగోదావరి శిరోముండనం కేసు.. తీర్పు వాయిదా

Siromundanam Case Verdict Postponed : తూర్పుగోదావరి జిల్లాలో 1996లో సంచలనం సృష్టించిన శిరోముండనం కేసులో తీర్పు వాయిదా పడింది. జడ్జి సెలవులో ఉండటంతో తీర్పును వాయిదా వేసినట్లు న్యాయస్థానం తెలిపింది. గతంలోనే తీర్పును నేటికి రిజర్వ్ చేసి, ఇప్పుడు వాయిదా వేయడంతో బాధితులు అసహనం వ్యక్తం చేశారు.


ఉమ్మడి రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వెంకటాయపాలెంలో 1996 డిసెంబరు 29న జరిగిన శిరోముండనం కేసులో విచారణ పూర్తి అయ్యింది. దీనిపై నేడు విశాఖ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తీర్పు వెలువరించాల్సి ఉంది. కానీ.. అనూహ్యంగా తీర్పును వాయిదా వేశారు. రామచంద్రపురం మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉండగా.. మరో 8 మంది నిందితులు కూడా ఉన్నారు. ప్రధాన సాక్షి కోటి రాజు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ప్రధాన బాధితుడు కోటి చినరాజుకు ఆయన సోదరుడు. గత ఏడాది బాధితుడు పువ్వల వెంకటరమణ మృతి చెందాడు. మొత్తం ఐదుగురు బాధితుల్లో ఇద్దరు, 15 మంది సాక్షుల్లో మరో ఇద్దరు చనిపోయారు.

Also Read : రామేశ్వరం కేఫ్ బ్లాస్.. నిందితుడిని పట్టించిన క్యాప్


ఒక్కసారి కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే.. 1994లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిలిచిన తోట త్రిమూర్తులుపై BSP పార్టీకి చెందిన కొందరు పోటీలో నిలవటం.. వారితో వాగ్వాదం, తోట వర్గీయులు రిగ్గింగ్ చేయడానికి దౌర్జన్యంగా పోలింగ్ బూత్ లోకి వచ్చారంటూ ప్రతి ఘటించటం జరిగింది. ఈ విషయంపై పోలింగ్ బూత్ వద్ద సుమారు గంటసేపు ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ విషయంపై తోట వర్గీయులు కక్ష పెట్టుకున్నారు.

తోట త్రిమూర్తులు ఎమ్మెల్యే గా గెలిచిన మూడు నెలలు తర్వాత.. తమకు ఎన్నికల్లో ఎదురు తిరిగిన ముగ్గురు వ్యక్తులు.. కోటి చిన్నరాజు, దడాల వెంకటరత్నం, చల్లపూడి పట్టాభి రామయ్యపై.. పొలం చుట్టూ ఉన్న ఫెన్సింగ్‌ను ధ్వంసం చేశారంటూ తోట త్రిమూర్తులు అన్న కొడుకు తప్పుడు కేసు పెట్టారని బాధితులు పేర్కొన్నారు. 1996లో శిరోముండనానికి తోట వర్గీయులు పాల్పడ్డారు.

ఐదుగురు కుర్రాళ్లకు శిరోముండనం చేయవద్దని గ్రామస్థులు, వారి తల్లిదండ్రు కోరినా వినకుండా గుండు గీయించి, మీసాలు తీసి తర్వాత కనుబొమ్మలను కూడా తొలగించినట్లు కేసులో పేర్కొన్నారు. ఈ విషయం ఎక్కడైనా చెబితే చంపుతామని బెదిరించారని బాధితులు చెబుతున్నారు. నాటి నుంచి న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నామని బాధితులు చెబుతున్నారు. ఈ కేసులో ఇరు వర్గాల వాదనలు విన్న విశాఖ ఎస్సీ, ఎస్టీ కోర్టు బెంచ్.. నేడు తుదితీర్పు వెలువరిస్తామని చెప్పింది. సుమారు 28 సంవత్సరాల తర్వాత దీనిపై కీలక తీర్పు వస్తుందనుకుంటే అది కాస్తా వాయిదా పడింది.

Tags

Related News

Kadambari Jethwani: బట్టబయలైన కుట్ర.. ఏపీ పోలీసులు నటి జత్వానీని అందుకే అరెస్టు చేశారంటా!

Choreographer: జానీ మాస్టర్ పై పవన్ కళ్యాణ్ యాక్షన్

Alluri Sitharama Raju district: అంబులెన్స్ వెళ్లేందుకు దారిలేక విద్యార్థిని మృతి.. డోలీపై మోసుకెళ్లినా దక్కని ప్రాణం

Tdp office attack case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. ఆ మూడే సమాధానాలు, అదుర్స్ మూవీని తలపిస్తోందా?

Fire Accident: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం..

IPS Secret Operation Fail: ముంబై నటి కేసు.. లాజిక్ మిస్సయిన ఐపీఎస్‌లు, గత ప్రభుత్వం చుట్టూ ఉచ్చు

Kadambari Jethwani: జత్వానీ కేసులో మరో ముగ్గురు ఐపీఎస్‌లపై వేటు

Big Stories

×