EPAPER

YCP Activists Attack on TDP: రౌడీ రాజకీయం..ప్రజలు గమనిస్తున్నారు.. జాగ్రత్త!

YCP Activists Attack on TDP: రౌడీ రాజకీయం..ప్రజలు గమనిస్తున్నారు.. జాగ్రత్త!

YCP Activists Attack on TDP: చిన్న నిప్పు రవ్వ అడవి మొత్తాన్ని తగలబెట్టేస్తుంది.. సేమ్‌ అలానే ఎన్నికల టైమ్‌లో చిన్న గొడవ చాలు రాష్ట్రం తగలబడడానికి.. ప్రస్తుతం అలానే ఉంది ఒంగోలు పంచాయితీ.. ఎలక్షన్ టైమ్‌లో నివురు గప్పిన నిప్పులా ఉన్న ఏపీ.. ఒంగోలు గొడవతో రాజుకుంది.. ఇంతకీ ఒంగోలు గడ్డపై ఏం జరిగింది? ఇందులో ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు? అసలు ఒంగోలు గొడవ ఇచ్చిన సంకేతమేంటి? ఎలక్షన్‌ టైమ్.. విషయమేంటి? దాని వివరమేంటి? ఇలా ఆలోచించే టైమ్ తక్కువా.. రియాక్షన్ టైమ్ ఎక్కువా.. గొడవ ఏంటి? ఎందుకు? అన్నది కాదు ముఖ్యం. నిరసన, ఆందోళన, ఉద్రిక్తత అంటే చాలు.. మందలు మందలుగా మూగడం.. పరస్పర దాడులు చేసుకోవడం.. అదే జరిగింది ఒంగోలులో.. వారంతా నేతలు, కార్యకర్తల్లా కాదు. గల్లీ రౌడీలా వ్యవహరించారు ఒక్కొక్కరు. మరి ఈ రేంజ్‌లో గొడవ జరగడానికి రీజనేంటి? ఏం లేదు.. ఓ మాట.. ఒంగోలులో రాత్రి వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు కావ్యారెడ్డి క్యాంపెయిన్‌కు వెళ్లారు. స్థానికంగా ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో ప్రచారం చేస్తున్నారు.


అయితే ఆమె వెంట ఓ వాలంటీర్ ఉన్నాడు. అది కూడా రాజీనామా చేసిన వాలంటీర్. ఆ అపార్ట్‌మెంట్‌లో ఉన్న టీడీపీ సింపతైజర్స్‌ కావ్యారెడ్డిని అడ్డుకున్నారు. వాలంటీర్‌తో ఎలా ప్రచారం చేస్తారని ప్రశ్నించారు.. ఇలా డిస్కషన్ జరుగుతుండగానే సీన్‌లోకి టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్ధన్, అయన అనుచరులు ఎంటరయ్యారు.. వీరందరిని చూసి బాలినేని వర్గం కూడా భారీగానే చేరుకుంది. అసలు విషయం పక్కకి పోయింది.. మాట మాట పెరిగింది.. ఆ తర్వాతా నోటితో మాట్లాడటం కాస్త.. చేతులతో పోట్లాడటం వరకు వెళ్లింది.. తోసుకున్నారు. కొట్టుకున్నారు. రెండు వర్గాల వారికి గాయాలయ్యాయి. అటు దామచర్ల, ఇటు బాలినేని సై అంటే సై అనుకున్నారు. ఆ తర్వాత సీన్‌లోకి పోలీసులు ఎంట్రీ ఇవ్వడం.. వారిని చెదరగొట్టడం జరిగిపోయింది.

ఆ తర్వాత పంచాయితీ పోలీస్ స్టేషన్‌కు చేరింది. పోనీ గొడవ అక్కడనైనా ఆగిందా ? లేదు.. ఘర్షణల్లో వైసీపీ, టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు.. వారిని ఒంగొలు రిమ్స్‌లో చేర్చారు.. దీంతో ఇద్దరు నేతలు మళ్లీ అక్కడికి చేరుకున్నారు.. దీంతో మరోసారి హైటెన్షన్‌.. ఈసారి ఏకంగా సెంట్రల్ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ సీన్‌లోకి ఎంట్రీ ఇస్తే కాని పరిస్థితులు కంట్రోల్ కాలేదు. ఈ మొత్తం గొడవలో తప్పెవరిది? వైసీపీ నేతలదా? టీడీపీ నేతలదా? అంటే ఇద్దరదీ అని చెప్పాలి. ఎలక్షన్ టైమ్‌లో ప్రతి అంశం సున్నితమే.. ఇలాంటి టైమ్‌లో కాస్త సంయమనం పాటించాల్సిన అవసరం వారిపై ఉంది.. నేతల మెప్పు కోసమో.. పార్టీపై అభిమానంతోనే.. ఏం జరిగినా అన్న చూసుకుంటాడన్న నమ్మకంతోనే.. రీజన్‌ ఏదైతేనేం.. నేతలు సై అంటే చాలు. ఎంతదూరమైనా వెళ్లేందుకు రెడీ అవుతారు అనుచరులు.. ఇదీ మెయిన్ సమస్య.. మరో ప్రాబ్లమ్ ఏంటంటే.. వాట్సాప్‌లో మిస్‌లీడ్ చేసే ప్రచారం. ఒంగోలులోని ఆ అపార్ట్‌మెంట్‌లో అసలేం జరిగిందన్నది అనవసరం.. కావ్యను దూషించారని కొందరు.. టీడీపీ నేతలపై దాడి చేశారని మరికొందరు.. ఎలా ఎవరికి తగ్గట్టు వారు ప్రచారం చేసుకున్నారు.


Also Read: మొన్న ఈడి, నేడు సీబీఐ..కవిత పరిస్థితేంటి?!

కొన్ని మీడియా సంస్థలు కూడా వన్‌ సైడెడ్‌గా వార్తలను టెలికాస్ట్‌ చేయడంతో.. ఒంగోలు పంచాయితీ స్టేట్‌వైడ్‌గా హాట్‌ టాపిక్‌గా మారింది.. దీంతో విషయం ఎంటో తెలుసుకోకుండానే.. రాష్ట్రవ్యాప్తంగా ఇరు పార్టీల నేతలు రియాక్టవుతున్నారు.. వైసీపీ గుండాగిరి అని కొందరు.. సైకిల్ పార్టీ సైకోయిజం అని మరికొందరు.. ఇలా ఎవరికి తగ్గట్టు వారి ఈ టాపిక్‌ను అనుకూలంగా మలుచుకున్నారు. రచ్చ చేస్తున్నారు. అసలే ఏపీలో పొలిటికల్ ఇష్యూ ఏదైనా హైటెన్షన్‌ ఉంటుంది. ఇలాంటివి జరుగుతాయని నేతలకు తెలుసు.. కానీ సంయమనం పాటించాల్సిన నేతలు కూడా అస్సలు తగ్గడం లేదు.. పరస్పరం వార్నింగ్‌లు ఇచ్చుకుంటూ మరింత అగ్గిని రాజేస్తున్నారు.. దీంతో కార్యకర్తలు బలవుతున్నారు. ఆసుపత్రుల్లో చేరుతున్నారు. పోలింగ్‌కు మరో నెల రోజులు ఉంది.

ఈ సమయంలో మీరు ఏం చేయాలనుకుంటున్నారో ప్రజలకు చెప్పండి.. వారి మనసులు గెలవండి  అంతేకానీ అర్థం లేని ఆవేశపూరిత రాజకీయాలు చేస్తే.. బలయ్యేది సామాన్య కార్యకర్తలే.. ఇప్పటికైనా మనోభావాలను దెబ్బతీసే పనులు కాకుండా.. మనసులు గెలిచే ప్రయత్నాలు చేయండి.. అప్పుడు ఎన్నికలు సజావుగా జరుగుతాయి. ప్రజలు కూడా అర్థం లేని ఆవేశాలకు లోనవకుండ.. ఎవరి పాలనతో తమకు మంచి జరుగుతుందో ఆలోచించి ఓటు వేస్తే మంచిది.. కార్యకర్తలు, అనుచరులు కూడా ఓ విషయాన్ని గుర్తుంచుకోవాలి.. ఎన్నికలు ముగిసిన తర్వాత నేతలు ఏసీ రూమ్‌లకే పరిమితమవుతారు. ఇప్పుడు వారి మాటలు విని అనవసర కక్షలు పెంచుకుంటే.. రేపు రోడ్డు మీద తిరగాల్సింది మీరే. కలిసి పనిచేయాల్సింది మీరే.. అందుకే అర్థం లేని ఆవేశాలకు లోనై జీవితాలను నాశనం చేసుకోవద్దు. ప్రచారాన్ని ప్రచారం వరకే ఉంచండి.. వారి పర్సనల్ పంచాయితీల్లోకి వెళ్లకపోతేనే మంచింది.

Related News

Inquiry on Sakshi Newspaper: జగన్ చిక్కినట్టేనా.. క్విడ్ ప్రోకో, సాక్షి పత్రిక కొనుగోళ్లపై

Tirupati Laddu: దేవుడిపై ప్రమాణానికి చంద్రబాబు కుటుంబం సిద్ధమా?

Free Gas Cylinders: భారీ శుభవార్త.. దీపావళి నుంచి ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ

Tirupati Laddu: తిరుపతి లడ్డూలపై సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు.. ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడారంటూ సీరియస్

Pavan Kalyan: ఈ వయసులోనూ ఆయన పనిచేస్తున్న తీరును చూసి నాకు ఆశ్చర్యం వేస్తుంది: పవన్ కల్యాణ్

Balineni: బ్రేకింగ్ న్యూస్.. జగన్ మోహన్ రెడ్డికి భారీ షాకిచ్చిన దగ్గరి బంధువు..

AP Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్

Big Stories

×