EPAPER

Xiaomi 14 Ultra with 4 Camera’s: నాలుగు 50MP కెమెరాలతో షియోమీ స్మార్ట్‌ఫోన్.. ఫ్లిప్‌కార్ట్‌లో సేల్!

Xiaomi 14 Ultra with 4 Camera’s: నాలుగు 50MP కెమెరాలతో షియోమీ స్మార్ట్‌ఫోన్.. ఫ్లిప్‌కార్ట్‌లో సేల్!

Xiaomi 14 Ultra with Four 50 MP Camera’s:  ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ Xiaomi తన కొత్త స్మార్ట్‌ఫోన్ Xiaomi 14 Ultra స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్‌లో చాలా ప్రత్యేకమైన ఫీచర్లు ఉన్నాయి. ఫోటోగ్రఫీ కోసం ఈ మొబైల్‌ను కంపెనీ ప్రత్యేకంగా రూపొందించింది. మొదటి సేల్‌‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌లో ఉంచింది. ఈ ఫోన్‌‌లోని ఫీచర్లు, ధర, తదితర వివరాలు తెలుసుకోండి.


Xiaomi 14 అల్ట్రా ధర విషయానికి వస్తే.. 16GB RAM+12GB స్టోరేజీని కలిగి ఉన్న మోడల్‌ ప్రారంభ ధర రూ. 99,999తో ప్రారంభించింది. ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్, షియోమీ అఫిషియల్ సైట్ ‌నుంచి కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా ఈ ఫోన్‌పై డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. HDFC, ICICI బ్యాంకు కార్డులపై రూ.5000 డిస్కౌంట్ పొందొచ్చు. ఎక్సేంఛ్ ఆఫర్‌గా మరో రూ.5000 వరకు తగ్గింపు లభిస్తుంది.

Xiaomi 14 అల్ట్రా స్పెసిఫికేషన్‌ల వివరాలు చూస్తే స్మార్ట్‌ఫోన్ 3,200 x 1,440 పిక్సెల్‌ల రిజల్యూషన్‌‌ను కలిగి ఉంది. ఇది 6.73-అంగుళాల LTPO అమోలెడ్ మైక్రో-కర్వ్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. 120Hz రీఫ్రెష్‌రేట్‌, 3,000నిట్స్ బ్రైట్‌నెస్ ఇస్తుంది. స్క్రీన్‌‌కు షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్ ఇచ్చారు.


Also Read: అదిరిపోయిందయ్యా.. రూ.499కే 50 MP స్మార్ట్‌ఫోన్

 Xiaomi 14 Ultra
Xiaomi 14 Ultra

Xiaomi 14 Ultra స్మార్ట్‌ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 SoC ప్రాసెసర్‌పై వస్తుంది. 5300mAh పవర్‌ఫుల్ బ్యాటరీ ఉంది. ఇది 90W వైర్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. అలానే 80W వైర్‌లెస్,10W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌ చేయవచ్చు. ఇందులో ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్ వేగవంతమైన ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 సొక్కు ప్రాసెసర్ తో వస్తుంది. ఈ ఫోన్ 16GB వరకు LPDDR5x RAM,1TB వరకు UFS 4.0 స్టోరేజ్‌తో కెపాసిటీని కలిగి ఉంటుంది. ఫోన్ స్మూత్‌గా రన్ అవడానికి ఇందులో సరికొత్త ఆండ్రాయిడ్ 14-ఆధారిత హైపర్ OS ఉపయోగించారు.

Also Read: శ్యామ్‌సంగ్ నుంచి సరికొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే!

కెమెరా గురించి చెప్పాలంటే.. ఇది అద్భుతమైన క్వాలిటీతో ఫోటోలను క్యాప్చర్ చేస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో కూడిన 1 ఇంచెస్ 50మెగాపిక్సెల్ సోనీ LYT900 ప్రైమరీ కెమెరా సెన్సార్‌‌ను పొందుపరిచారు. దీనితో స్పష్టమైన బ్లర్ ఫ్రీ ఇమేజ్‌లను షూట్ చేయవచ్చు.

ఇందులో మరో రెండు కెమెరాలు అదనపు 50మెగాపిక్సెల్ సోనీ IMX858 సెన్సార్లు 3.2x,5x ప్రత్యేక ఆప్టికల్ జూమ్ సామర్థ్యం కలిగి ఉంది. వీటి ఫోకల్ లెంత్ వరుసగా 75mm,120mmగా చెప్పవచ్చు.
నాల్గవ 50 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌తో జత చేయబడి ఉంటుంది. వీడియో కాలింగ్, సెల్ఫీ కోసం 32మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

Related News

ChatGP: చాట్ జీపీటీతో ఇంట్లో కూర్చొని ఈజీగా డబ్బులు సంపాదించొచ్చు, ఎలాగో తెలుసా?

Amazon Great Indian Festival 2024 Sale: అమెజాన్ న్యూ సేల్ డేట్ ఖరారు.. రూ.38,999లకే ఐఫోన్!

Motorola Edge 50 Neo: ఎడ్జ్ 50 నియో లాంచ్.. ఫీచర్లు మత్తెక్కించాయ్, ఈ ఆఫర్లు మీకోసమే!

Oppo Find X8 series: ఒప్పో దూకుడు.. వరుసగా నాలుగు ఫోన్లు, ఫీచర్లు కెవ్ కేక!

Motorola Edge 50 Neo: మోటో నుంచి కొత్త ఫోన్.. ఊహించని ఫీచర్లు, అద్భుతమైన కెమెరా క్వాలిటీ!

Oppo K Series: సత్తాచాటేందుకు మరో మోడల్ రెడీ.. ఒప్పో నుంచి ఊహించని బడ్జెట్ ఫోన్!

Cheapest Smartphones Under Rs 10000: ఉఫ్ ఉఫ్.. కేవలం రూ.10వేల ధరలోనే 5జీ ఫోన్‌లు, వదిలారో మళ్లీ దొరకవ్!

Big Stories

×