EPAPER

CM Revanth Reddy Tweet: జనగామ అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్‌ను అభినందించిన సీఎం..

CM Revanth Reddy Tweet: జనగామ అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్‌ను అభినందించిన సీఎం..

CM Revanth Reddy Tweet (Latest news in Telangana): రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ధాన్యం కొనుగోళ్లలో చిత్తశుద్ధితో ఉండాలని ప్రభుత్వాన్ని సీఎం ఆదేశించారు. రైతుల కష్టాన్ని ఎవరైనా మార్కెట్ కమిటీ అధికారులు.. వ్యాపారులతో కుమ్మక్కైనట్లు తెలిస్తే సహించేది లేదన్నారు. జనగామ వ్యవసాయ మార్కెట్ లో జరిగిన ఘటనపై సకాలంలో స్పందించి.. వెంటనే చర్యలు తీసుకున్న అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్ ను ఆయన అభినందించారు. రాష్ట్ర వ్యాప్తంగా అధికారులందరూ ధాన్యం కొనుగోళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి కోరుతున్నామన్నారు.


కాగా ధాన్యంలో తేమ, తాలు సాకుతో కనీస మద్ధతు ధర కంటే ట్రేడర్లు తక్కువ ధరకు కొనడంతో జనగామ మార్కెట్ కమిటీ కార్యాలయం ముందు రైతులు బుధవారం నిరసన చేశారు. ప్రభుత్వం ధర రూ. 2,203 కంటే తక్కువ ధర రూ. 1,500 ఇవ్వడమేంటని ప్రశ్నించారు. మద్దతు ధర చెల్లించాల్సిందేనని అధికారులను నిలదీశారు. ఈ సంఘటన గురించి తెల్సుకున్న అడిషనల్ కలెక్టర్(రెవెన్యూ) రోహిత్ సింగ్ మార్కెట్ యార్డుకు వచ్చి రైతులతో మాట్లాడి ట్రేడర్లు ఇచ్చిన ధరల చిట్టీచూసి అవాక్కయ్యారు. దీంతో ట్రేడర్లపై క్రిమినల్ కేసులు నమోదు చెయ్యాలని ఆయన ఆదేశించారు.

Also Read: CBI Arrest MLC Kavitha: సీబీఐ అదుపులో కవిత, ఎందుకోసం?


రైతుల సమస్యల పట్ల పట్టనట్టు వ్యవహరించిన మార్కెట్ సెక్రటరీని సస్పెండ్ చేయాలని అధికారులను ఆదేశించారు. మద్దతు ధరకే ధాన్యం కొంటామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.

కాగా ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ట్రేడర్లపై కేసులు, మార్కెట్ కార్యదర్శిపై సస్పెన్షన్ వేటు వంటి చర్యలు హర్షణీయమంటూ అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్‌ను అభినందించారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల పట్ల, రైతు సమస్యల పట్ల చిత్తశుద్ధితో ఉందని స్పష్టం చేశారు.

Tags

Related News

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: తిరుపతి లడ్డూలో జంతవుల కొవ్వు వాడకంపై స్పందించిన బండి సంజయ్.. ఏమన్నారంటే?

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Harish Rao Letter: రాహుల్ గాంధీకి లేఖ రాసిన హరీశ్‌రావు.. పార్టీ మారుతున్నారా..?

Big Stories

×