EPAPER

Komatireddy Venkat Reddy: పదేళ్లు రేవంతే సీఎం.. కాంగ్రెస్‌లో ఏక్‌నాథ్ షిండేలు లేరన్న కోమటిరెడ్డి!

Komatireddy Venkat Reddy: పదేళ్లు రేవంతే సీఎం.. కాంగ్రెస్‌లో ఏక్‌నాథ్ షిండేలు లేరన్న కోమటిరెడ్డి!

Komatireddy Venkat Reddy Comments on CM Jagan: పదేళ్లు తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ఉంటారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో ఏక్‌నాథ్ షిండేలు ఉన్నారన్న మాట అవాస్తవమని అన్నారు. తామంతా కలసికట్టుగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చపెట్టి రాజకీయాలు చేస్తారని బీజేపీపై మండిపడ్డారు. హరీశ్ రావు, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హెచ్చరించారు.


ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య బద్ధంగా గెలిచిన పార్టీ ఐదేళ్లు అధికారంలో ఉంటుందన్నారు మంత్రి కోమటిరెడ్డి. ఇక బీఆర్ఎస్ పరిస్థితి వేరుగా ఉందని.. కనీసం పోటీ చేయడానికి అభ్యర్థులు కరువయ్యారన్నారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఒక్క ఎంపీ సీటు కూడా రాదని జోస్యం పలికారాయన. కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలుస్తుందని మంత్రి స్పష్టం చేశారు.

బీజేపీయే మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీలను చీల్చి ఏక్‌నాథ్ షిండేను సృష్టించారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో ఎలాంటి గ్రూపులు లేవని ఏదిపడితే అది మాట్లాడితే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. తనను అనవసరంగా లాగుతున్నారని.. ఇది మంచి పద్ధతి కాదని పేర్కొన్నరు. వచ్చే ఐదేళ్లు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని.. అప్పుడు కూడా సీఎంగా రేవంత్ రెడ్డియే ఉంటారని తెలిపారు. తాము సీనియర్ నేతల సలహాలు, సూచనలు తీసుకుని తెలంగాణలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నమాని చెప్పారు. పార్టీ అంతర్గత విషయాలు మాట్లాడొద్దని.. తాము మాట్లాడితే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోండని పేర్కొన్నారు.


Also Read: CBI Arrest MLC Kavitha: సీబీఐ అదుపులో కవిత, ఎందుకోసం?

కాగా బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మీడియా చిట్‌చాట్‌ల పేరుతో కాంగ్రెస్ పార్టీలో ఏక్‌నాథ్ షిండేలు ఉన్నారని ఆరోపించారు. పార్టీలో ఐదు గ్రూపులున్నాయని.. ఒక్కో గ్రూపులో 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారన్నారు. ఈ మాటలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి మండిపడ్డారు.

Related News

Narsingi: నార్సింగిలో బంగారు గని..?

CM Revanth Reddy: మా ప్రభుత్వానికి ఎవరిమీద కోపం లేదు.. కానీ,… : సీఎం రేవంత్ రెడ్డి

KTR: ఉన్న సిటీకే దిక్కులేదు.. ఫోర్త్ సిటీనా? : కేటీఆర్

TPCC Chief: కేటీఆర్.. అతి తెలివిగా ప్రశ్నలు వేయకు: మహేష్ కుమార్ గౌడ్

Telangana Rice: దసరా పండుగ వేళ తెలంగాణ ప్రజలకు భారీ శుభవార్త… త్వరలోనే..

Hydra: కబ్జాగాళ్ల గుండె జారే న్యూస్.. హైడ్రా‌కు చట్టబద్దత, గవర్నర్ గ్రీన్ సిగ్నల్, కానీ..

Bathukamma Celebrations: గాంధీ భవన్‌లో బతుకమ్మ సంబరాలు.. పాల్గొన్న జగ్గారెడ్డి

×