EPAPER

Chaitra Navratri 2024: చైత్ర నవరాత్రులు ఎప్పటి నుంచి.. ఏ రోజు వరకు కొనసాగుతాయో తెలుసా?

Chaitra Navratri 2024: చైత్ర నవరాత్రులు ఎప్పటి నుంచి.. ఏ రోజు వరకు కొనసాగుతాయో తెలుసా?
Chaitra Navratri 2024
Chaitra Navratri 2024

Chaitra Navratri 2024: 2024 చైత్ర నవరాత్రులు మంగళవారంతో ప్రారంభమయ్యాయి. ఈ 9 రోజుల దుర్గామాత ఆరాధన పండుగ హవన్, కన్యా పూజతో ముగుస్తుంది. అదే సమయంలో నవరాత్రుల అష్టమి తిథికి చాలా ప్రాముఖ్యత ఉంది.


చైత్ర నవరాత్రులు ఏప్రిల్ 9వ తేదీ నుంచి ప్రారంభమయి.. ఏప్రిల్ 17 వరకు కొనసాగుతాయి. ఈ 9 రోజులలో, దుర్గా మాత 9 రూపాలను పూజిస్తారు. ప్రతి రోజు, మాతరాణి దేవి వివిధ రూపాలను ఆచారాలతో పూజిస్తారు. దేవికి ఇష్టమైన నైవేద్యాలు సమర్పిస్తారు. అలాగే, నవరాత్రి ఉపవాసాలు కూడా ఆచరిస్తారు. నవరాత్రుల 9 రోజులలో అష్టమి తిథికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రోజున, అన్ని దేవతలను ప్రజలు తమ తమ ఇళ్లలో పూజిస్తారు. నవరాత్రులు మొత్తం ఉపవాసం ఉండని వారు నవరాత్రి మొదటి, అష్టమి రోజులలో ఉపవాసం ఉంటారు. నవరాత్రుల చివరి రోజు అంటే నవమి రోజున హవన, కన్యాపూజ చేయడం ద్వారా నవరాత్రులు ముగుస్తాయి.

నవరాత్రుల అష్టమి తిథి ఎప్పుడు?
నవరాత్రులలో ఎనిమిదో రోజు అష్టమి తిథిలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ రోజున దుర్గాదేవి.. మహాగౌరీ రూపాన్ని పూజిస్తారు. పంచాంగం ప్రకారం, చైత్ర నవరాత్రుల అష్టమి తిథి ఏప్రిల్ 15 మధ్యాహ్నం 12:11 నుండి ఏప్రిల్ 16 మధ్యాహ్నం 1:23 వరకు.. ఉదయ తిథి ప్రకారం ఏప్రిల్ 16న అష్టమి పూజ జరుగుతుంది.


చైత్ర నవరాత్రి హవన్, కన్యా పూజ ఎప్పుడు చేయాలి?
హవన్, కన్యా పూజ లేకుండా నవరాత్రి ఉపవాసం, పూజలు అసంపూర్ణంగా ఉంటాయి. అందుకే నవరాత్రులలో తొమ్మిదో రోజు తప్పనిసరిగా హవన్, కన్యా పూజ చేయాలి. ఇలా చేయడం వల్ల దుర్గామాత అనుగ్రహంతో కోరిన కోర్కెలు నెరవేరి జీవితంలో ఎనలేని సంతోషం, ఐశ్వర్యం కలుగుతుందని ప్రజలు భావిస్తుంటారు.

రామ నవమి అంటే శ్రీరాముని జన్మదినోత్సవం కూడా చైత్ర నవరాత్రుల నవమి రోజున జరుపుకుంటారు. అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామ మందిరంలో ఈ ఏడాది రామనవమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నవరాత్రి నవమి రోజున, సిద్ధిదాత్రి అమ్మవారి రూపాన్ని ఆరాధిస్తారు. ఈ రోజున, హవన్, కన్యా పూజ తర్వాత, వ్రతి పారణ చేస్తారు.

పంచాంగం ప్రకారం, చైత్ర నవరాత్రుల నవమి తిథి ఏప్రిల్ 16వ తేదీ మధ్యాహ్నం 1:23 గంటలకు ప్రారంభమై ఏప్రిల్ 17వ తేదీ మధ్యాహ్నం 3:14 గంటల వరకు కొనసాగుతుంది. ఈ విధంగా ఏప్రిల్ 17న నవమి, రామ నవమి జరుపుకుంటారు. అలాగే ఏప్రిల్ 17న నవరాత్రి హవనం, కన్యాపూజ నిర్వహిస్తారు. కన్యాపూజలో, 2 నుండి 9 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న బాలికలకు హల్వా-పూరీ తినిపిస్తారు. వారికి బహుమతులు ఇచ్చి ప్రజలు వారి ఆశీర్వాదాలు తీసుకుంటారు.

నవరాత్రుల నవమి నాడు శుభ యోగం కలుగుతుందా..!
ఈసారి ఏప్రిల్ 17న రామ నవమి రోజున అనేక శుభ యోగాలు కలగనున్నాయి. నవమి రోజున రవియోగం, సర్వార్థ సిద్ధి యోగం కలగనుంది. ఈ పవిత్రమైన యోగాలలో హవన-కన్యా పూజ చేయడం చాలా మంచింది. అలా చేసిన వారికి శుభం యోగం కలుగుతుంది.

గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం సామాజిక, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. bigtvlive.com దీనిని ధృవీకరించలేదు. దీని కోసం నిపుణుల సలహా తీసుకోండి.

Tags

Related News

Surya Grahan 2024: త్వరలో సూర్య గ్రహణం.. ఈ రోజు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి

Vriddhi Yog Horoscope: ఈ రాశుల వారిపై ప్రత్యేక యోగం వల్ల కోటీశ్వరులు కాబోతున్నారు

Guru Vakri 2024 : మరో 20 రోజుల్లో బృహస్పతి తిరోగమనం కారణంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందబోతున్నారు

Budh Shani Yuti Horoscope: బుధ-శని సంయోగంతో ఈ 3 రాశుల వారు సంపదను పొందబోతున్నారు

Horoscope 19 September 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఊహించని ధనలాభం!

Budh Gochar 2024: కన్య రాశిలో బుధుడి సంచారం.. వీరికి అన్నీ శుభవార్తలే

19 September 2024 Rashifal: రేపు ధనుస్సుతో సహా 5 రాశుల వారికి సంపద పెరగబోతుంది

Big Stories

×