EPAPER

Snakes: దేవుడా.. ఇది కాటేస్తే స్వర్గానికో.. నరకానికో పోవడం పక్కా..

Snakes: దేవుడా.. ఇది కాటేస్తే స్వర్గానికో.. నరకానికో పోవడం పక్కా..


Snakes: సరీసృపాల్లో పాములు అంటే భయపడని మనుషులు ఉండరు. భూమిపై ఉండే జీవరాశుల్లో పాములు అత్యంత విషపూరితమైనవి. అందులోను పాముల్లో అతి భయంకరమైన పాములు ఉంటాయి. ముఖ్యంగా భూమిపై 4 విషపూరితమైన పాములు ఉంటాయి. ఇందులో ఇండియన్ క్రైట్ ఒకటి. ఈ పాము కనుక కాటేస్తే కేవలం గంటలోనే ప్రాణాలు కోల్పోతారు. సాధారణంగా భూమిపై నాగుపాములే అత్యంత విషపూరితమైనవి అనుకుంటుంటారు. కానీ దానికంటే దాదాపు 5 రెట్లు ఇండియన్ క్రైట్ విషపూరితమైనది. దీనికి సైలెంట్ కిల్లర్ అని కూడా పేరు. దీనిని వాడుక బాషలో త్రాచుపాము అని పిలుస్తారు.

60 నుంచి 70 మందిని ఒక్క కాటుతో చంపేస్తుంది. ఇది ముఖ్యంగా ముఖం, తలపై కాటు వేస్తుందట. అయితే ఈ పాము కాటేస్తే చీమ కుట్టినట్లు కూడా అనిపించదట. ఇది కాటువేసిన సంగతి కూడా తెలియదట. ఎటువంటి నొప్పి కూడా రాదట. అందుకే ప్రజలు త్రాచుపాముకు భయపడుతుంటారు. ఈ పాములు సాధారణంగా శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, ఇండియా వంటి దేశాల్లో ఈ పాములు ఎక్కువగా కనిపిస్తుంటాయి.


ఎక్కువగా క్రేట్ పాములు చల్లటి వాతావరణంలో తిరుగుతుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి ఎక్కువగా రాత్రివేళల్లో చురుకుగా ఉంటాయట. అయితే ఇది కాటు వేసినా దీని దంతాల గుర్తులు శరీరంపై చాలా అరుదుగా కనిపిస్తాయట. అయితే లక్షణాలు కనిపించే సరికే మనిషి ప్రాణాలు కోల్పోతారట. అయితే ఈ పాము కాటు వేయడం వల్ల పక్షవాతం వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే మరోవైపు ఈ పాముల గురించి నిపుణులు కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ పాములు మనిషి శరీర ఉష్ణోగ్రతలను గ్రహించి దగ్గరకు వస్తాయట. అంతేకాదు శరీరాన్ని పూర్తిగా అంటుకుని ఉంటాయట. ఈ పాములు పొత్తికడుపు, ఛాతి, చంకలపై కాటువేస్తాయట. ఇవి అంటుకున్న సమయంలో మనిషి పక్కకు తిరిగితే కాటు వేస్తాయి. అయితే ఎక్కువగా మెత్తగా ఉండే వస్తువులపై ఉంటాయి. ముఖ్యంగా బట్టలు, పరపులపై వాలి, వాటిని కొరుకుతుంటాయని నిపుణులు చెబుతున్నారు.

ఈ పాము కాటుకు గురైన వ్యక్తి గంటన్నర పాటు మాత్రం జీవించగలడు. దగ్గరలో ఉండే ఆసుపత్రికి త్వరగా తీసుకెళ్తే ప్రాణాలు కాపాడే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ సమయాల్లో పాము కాటుకు గురైన వ్యక్తి ప్రశాంతంగా, దైర్యంగా ఉండాలి. భయానికి గురైతే రక్త ప్రసరణ జరగడం వల్ల, విషం శరీరంలోని రక్తంలో వేగంగా వ్యాపిస్తుంది. ఈ పాములు నలుపు లేదా గోధుమ రంగులో ఉంటాయి.

Tags

Related News

Shocking Video: సన్యాసిగా మారిన పిల్లిని ఎప్పుడైనా చూశారా..! ఈ వీడియో చూస్తే షాక్ అవుతారు

Mystery: చావు రహస్యం తేలిపోనుంది.. మరణం తర్వాత మూడో దశ!.. కన్ఫమ్ చేసిన సైంటిస్టులు

Flipkart: స్మార్ట్‌ఫోన్ పై 99 శాతం డిస్కౌంట్.. ఇదెక్కడి మోసమంటూ ఫ్లిప్‌కార్ట్‌పై కస్టమర్ల ఆగ్రహం

Viral Video: నూడుల్స్‌ని ఇష్టంగా లాగించేస్తున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే షాక్ అవుతారు

Amazon Delivery After 2 Years: రెండేళ్ల క్రితం అమెజాన్ ఆర్డర్ క్యాన్సిల్.. రీఫండ్ పూర్తి.. ఇప్పుడు డెలివరీ!

Viral Video: మీరేంట్రా ఇలా ఉన్నారు.. రూ. 10 జిలేబీ కోసం కొట్టుకుంటారా..

Urination: మూత్ర విసర్జన తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..

Big Stories

×