EPAPER

Mumbai Indians: ముంబైకి షాక్ మీద షాక్..

Mumbai Indians: ముంబైకి షాక్ మీద షాక్..

Shock To Mumbai IndiansShock To Mumbai Indians: మూలిగే నక్కపై తాటి పండు పడ్డమంటే ఇదేనేమో.. అసలే ముంబై ఇండియన్స్ జట్టు చచ్చీ చెడీ ఒక మ్యాచ్ గెలిచిందో లేదో, అప్పుడే సౌతాఫ్రికా యువ ఫాస్ట్ బౌలర్ 17  ఏళ్ల క్వేనా మఫాకా స్వదేశానికి పయనమయ్యాడు. దీంతో ముంబై జట్టులో బౌలింగ్ విభాగం వీక్ అయిందని అంటున్నారు.


ఎందుకీ కుర్రాడు వెళ్లిపోతున్నాడంటే, తను పదో తరగతి చదువుతున్నాడు. పరీక్షలు జరగనుండటంతో వెళ్లక తప్పని పరిస్థితులు నెలకొన్నాయని అంటున్నారు. ఎన్నికల కోడ్ కారణంగా ఐపీఎల్ షెడ్యూల్ లో చాలా మార్పులు వచ్చాయి. దీంతో క్వేనా మఫాకా ముందుగా రావల్సి వచ్చింది.

అయితే ఈ విషయాన్ని ముంబై ఫ్రాంచైజీకి చెప్పాడంట, కనీసం 4 మ్యాచ్ లైనా ఆడమని చెప్పడంతో తను పరీక్షల ముందు వచ్చాడు. కానీ దురద్రష్టవశాత్తూ మూడు మ్యాచ్ లు ఓడిపోయారు. నాలుగో మ్యాచ్ గెలవగానే తను వెళ్లిపోతున్నాడు.


నిజానికి శ్రీలంక ఫాస్ట్ బౌలర్ దిల్షాన్ మధుశంక కూడా తొలుత గాయపడి ముంబై జట్టులో చేరలేదు. దీంతో తన ప్లేసులో క్వేనా మఫాకా వచ్చాడు. ఇప్పుడు తను కూడా వెళ్లి పోతున్నాడు. మరోవైపున కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ వేయడం లేదు. ఇవన్నీ చూస్తుంటే ముంబై ఇండియన్స్ కి ఈ ఏడాది మూడినట్టే అంటున్నారు.

ఇంక జస్ప్రీత్ బుమ్రాపైనే భారం అంతా పడేలా ఉంది. ఇంక ముంబై ఇండియన్స్ లో చెప్పుకోదగ్గ బౌలర్లలో ఆకాష్ మధ్వాల్, కొయెట్జీ, పియూష్ చావ్లా ఉన్నారు. మరి వీళ్లతో హార్దిక్ బండెలా నడిపిస్తాడని అంతా అనుకుంటున్నారు.

Also Read: Nitish Kumar Reddy: ఎవరీ నితీశ్ రెడ్డి..? తెలుగు కుర్రాడి ప్రస్థానం ఇదే..

అటువైపు విరాట్ కొహ్లీ ఉన్న ఆర్సీబీ పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. నానాటికి తీసికట్టుగా మారింది. ఇక్కడ రోహిత్ శర్మ  ఉన్న ముంబై ఇండియన్స్ పరిస్థితి అలాగే ఉంది. మొత్తానికి టాప్ ప్లేయర్లతో భారీ అంచనాలతో బరిలోకి దిగిన రెండు జట్లు అందరికన్నా ముందే షెడ్డుకి వెళ్లిపోయేలా కనిపిస్తున్నాయని క్రీడాభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.

Tags

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×