EPAPER

RR Vs GT Match Preview: రాజస్థాన్ రాయల్స్‌కు ఎదురుందా..? నేడు గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఆర్ఆర్..

RR Vs GT Match Preview: రాజస్థాన్ రాయల్స్‌కు ఎదురుందా..? నేడు గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఆర్ఆర్..

IPL 2024 Rajasthan Royals vs Gujarat Titans Match Preview: ఐపీఎల్ సీజన్ 2024లో ఇంతవరకు ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో, నాలుగింట గెలిచిన ఏకైక జట్టు ఎవరంటే, రాజస్థాన్ రాయల్స్ అని చెప్పాలి. అన్నీ గెలిచి టేబుల్ టాపర్ గా ఉంది. నేడు గుజరాత్ టైటాన్స్ తో జరగనున్న మ్యాచ్ లో విజయం సాధించి ముందుకు వెళుతుందా? లేక బ్రేక్ పడుతుందా? అని చూడాలి. నేడు గుజరాత్ వర్సెస్ ఆర్ ఆర్ మధ్య మ్యాచ్ జైపూర్ సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో రాత్రి 7.30కి ప్రారంభం కానుంది.


ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 5 మ్యాచ్ లు జరిగాయి. గుజరాత్ నాలుగు గెలిచింది. ఆర్ ఆర్ ఒక మ్యాచ్ లోనే విజయం సాధించింది. మరి గుజరాత్ తన పట్టును నిలుపుకుంటుందా? లేదా చూడాలి. లేకపోతే ఇంతవరకు ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా రికార్డు విజయాలతో వెళ్లి మొన్న లక్నోపై ఓడిపోయింది. అలా చేసుకుంటుందా? అనేది చూడాలి.

ఆర్ ఆర్ గురించి చెప్పాలంటే సంజూ శాంసన్ కెప్టెన్సీలో జట్టు అద్భుతంగా ఆడుతోంది. గత వారం జైపూర్ లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో ఆర్ ఆర్ ఆటగాగు జాస్ బట్లర్ 58 బంతుల్లో సెంచరీ చేసి మ్యాచ్ గెలిపించాడు. క్రిస్ గేల్ సెంచరీ రికార్డులను సమం చేశాడు. ఇక సంజూ శాంసన్ ఆ మ్యాచ్ లో 42 బంతుల్లో 69 పరుగులు చేసి ఐపీఎల్ లో 4000 పరుగులు పూర్తి చేసుకున్నాడు.


గుజరాత్ టైటాన్స్ విషయానికి వస్తే, ఈ సీజన్‌లో ఐదు మ్యాచ్‌లు ఆడి, రెండు గెలిచి, మూడు ఓడింది. నాలుగు పాయింట్లతో పాయింట్ల టేబుల్ లో ఏడో స్థానంలో ఉంది. గిల్ ఆడితే, ఆడినట్టు లేకపోతే లేదన్నట్టుగా జట్టు పరిస్థితి ఉంది.

Also Read: ఉత్కంఠ పోరులో హైదరాబాద్ విజయం.. పోరాడి ఓడిన పంజాబ్

తను ఆడితే మిగిలినవాళ్లు హిట్టింగ్ చేసి కొంచెం స్కోరుని ముందుకు తీసుకువెళుతున్నారు. తను అయిపోతే వెనకందరూ ఒత్తిడి తట్టుకోలేక, రాంగ్ షాట్స్ ఆడి అవుట్ అయిపోతున్నారు. ఈ పరిస్థితి నుంచి బయటకు రావాలి. అలాగే ప్రత్యర్థి బ్యాటర్లను గుజరాత్ బౌలర్లు నిలువరించ లేకపోతున్నారు. ఈ బలహీనతను అధిగమించాలి.

మొత్తానికి ఈరోజు జరగబోయే మ్యాచ్ లో గెలిస్తే గుజరాత్ టైటాన్స్ రేస్ లో ఉంటుందని అంటున్నారు. లేకపోతే సర్దుకోవల్సిందే అంటున్నారు.

Tags

Related News

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

Big Stories

×